MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • MBBS చ‌దివి స్విగ్గీ, జొమాటో ఎంటీ బ్రో.? ఇది చ‌దివితే మీ పిల్ల‌ల్ని డాక్ట‌ర్ చేయాల‌న్న ఆలోచ‌న మార్చుకుంటారు

MBBS చ‌దివి స్విగ్గీ, జొమాటో ఎంటీ బ్రో.? ఇది చ‌దివితే మీ పిల్ల‌ల్ని డాక్ట‌ర్ చేయాల‌న్న ఆలోచ‌న మార్చుకుంటారు

MBBS in India: డాక్ట‌ర్ కావాలి ఇది చాలా మంది యువ‌త క‌ల‌. యువ‌త కంటే వారి త‌ల్లిదండ్రుల క‌ల అని కూడా చెప్పాలి. తాము కాలేక‌పోయామ‌ని త‌మ పిల్ల‌ల్ని డాక్ట‌ర్లు చేయాల‌ని ఆతృత‌ప‌డుతుంటారు. అయితే కొన్ని క‌ఠోర నిజాలు తెలిస్తే ఆ ఆలోచ‌న మార్చుకోవాల్సిందే.

4 Min read
Author : Amarnath Vasireddy
Published : Jul 24 2026, 10:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1000 మంది జనాభాకు ఒక్క డాక్టర్
Image Credit : Gemini AI

1000 మంది జనాభాకు ఒక్క డాక్టర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ... ప్రతి 1000 మంది జనాభాకు ఒక్క డాక్టర్ ఉండాలని సూచించింది. గోవాలో 353:1, కర్ణాటకలో 457:1, ఆంధ్ర ప్రదేశ్‌లో - 488:1, తమిళనాడులో - 495:1, కేరళలో - 509:1, తెలంగాణలో - 700:1 గా ఉంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు , గ్రామీణ ప్రాంతాల్లో మినహాయించి ఇప్పటికే అవసరానికి మించి డాక్టర్స్ ఉన్నారు .

మన దేశంలో 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఎంబీబీస్ సీట్ల సంఖ్య - 1,18, 000గా ఉంది. ఇందులో 62, 000 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మంచి స్టాండర్డ్ ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తక్కువే. ఎక్కువ కాలేజీలలో శంకర దాదా టైపు. ఇంకా ఘోరం ఏమిటంటే ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వ కాలేజీలలో కోళ్ల ఫారంలాగా బాగా ఉన్నాయి

ఇక్కడో ముఖ్యమయిన విషయం. గత రెండేళ్లలో దేశ వ్యాపితంగా 118 కాలేజీలు ప్రారంభించారు. వీరందరూ ఇంకా జాబ్ మార్కెట్ లోకి రాలేదు. వస్తే జనాభా డాక్టర్ నిష్పత్తి మరింత తగ్గిపోతుంది. ఇప్పటికే సరిగా ప్రాక్టీస్ జరగడం లేదని అనేక మంది డాక్టర్స్ చెబుతున్నారు. తమిళనాడులో అయితే కొంతమంది ఎంబీబీస్ పట్టభద్రులు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు అని వార్తలు. పీజీ చెయ్యని వారికి .. అంటే కేవలం ఎంబీబీస్ చేసిన వారికి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకు 15-25 వేల జీతం మాత్రమే. అదీ నైట్ షిఫ్ట్స్. ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
80 వేల మందికి మాత్ర‌మే..
Image Credit : AI

80 వేల మందికి మాత్ర‌మే..

ప్రతి సంవత్సరం 2.4 లక్షల మంది మెడికల్ పీజీ ఎంట్రన్స్ రాస్తారు. 80 వేల మందికి మందికి మాత్రమే పీజీ సీట్స్ వస్తాయి. ఇక్కడో ముఖమయిన విషయం. మొత్తం 80 వేల పీజీ సెట్స్ లో గత పదేళ్లలో 50 వేల సీట్స్ అదనంగా చేర్చారు. అంటే ఏంటి? మరి కొన్ని ఏళ్లకు పీజీ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగి డిమాండ్ తగ్గిపోతుంది .

మార్కెట్ వ్యవస్థలో డిమాండ్ సప్లై అనేది ఒకటి పని చేస్తుంది అనే అవగాహన ఎంతమందికి? "గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు కదా?" అని కొంతమంది సూచన . అంటే ఏంటి ? ఒక కోటి దాక ఎంబీబీస్ కోసం ఖర్చు చేసి .. అటు పై పిజి కి ఇంకో కోటి .. గ్రామంలో వచ్చి ప్రాక్టీస్ పెట్టుకొంటారా?

మనది కాకపోతే కాశీ దాక దేకచ్చు అన్నాడట వెనకటికి ఎవరో. చెప్పండి .. మీ బిడ్డను రెండు కోట్లు పెట్టి చదివించి ఒక గ్రామం లో ప్రాక్టీస్ చేయిస్తారా ? మీరు చెప్పినా వాళ్ళు ఒప్పుకొంటారా? ఒక వేళా వారు పెట్టినా కార్పొరేట్ ఆసుపత్రుల గేలంకు ఆకర్షితులు కాకుండా చిన్న షట్టర్ లో ఉన్న వారి దగ్గరికి రోగులు వస్తారా ? కాలికి ముళ్ళు గుచ్చుకొంటే ... చెన్నై అప్పులో ఆసుపత్రి .. హైడ్రా బాడ్ ఆ అయ్యా జీ ఆసుపత్రికి పోతేనే జనాలకు సంతృప్తి .

ఎక్కడున్నారు మీరు ? దేశంలోని విద్యా సంస్థలు ఆసుపత్రుల్ని విదేశీ ఈక్విటీ కంపెనీలు వందల కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నాయి ? హైదరాబాద్‌లోమేరు అనే బడిని 500 కోట్లు పెట్టి కొన్నారు అని నిన్నటి వార్త . ఎలాంటి లాభాపేక్ష లేకుండా బడి నడపాలి అని రూల్ .. మరి 500 కోట్లు పెట్టి పెద్దవారి బడిని విదేశీ కంపెనీ లు ఎందుకు కొంటున్నట్టు ?

Related Articles

Related image1
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Related image2
నలుపు, తెలుపు, నీలం.. ఇంటికి ఏ రంగు వాటర్ ట్యాంక్ మంచిది? కొనేముందు ఇవి తెలుసుకోండి
35
స‌గానికిపైగా ప్రైవేట్ కాలేజీలే
Image Credit : Getty

స‌గానికిపైగా ప్రైవేట్ కాలేజీలే

తమిళనాడులో మొత్తం 69 మెడికల్ కాలేజీలు ఉన్నాయి . వీటిలో 32 ప్రైవేట్‌లోనే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీస్ సీట్స్ కు 25 లక్షల దాక .. పీజీ సీట్ కు .. కోటి దాక ఖర్చవుతుంది . ఇవి కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు. ఒక క్యాంపస్ లో వేలమంది విద్యార్థులు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి .వాటి బడ్జెట్ కొన్ని ఈశాన్య రాష్రాలకన్నా ఎక్కువ. అవి ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తాయి . ఎమ్మెల్యే ఎంపీలకు ఫండింగ్ చేస్తాయి . మీడియాను చేతిలో పెట్టుకుంటాయి. వాస్తవాలు మీ దాక వస్తాయా ఏంటి.? టాప్ -50 మెడికల్ కాలేజీలలో చదివిన వారికి మంచి భవిషత్తు ఉంటుంది .నిజమే !

అట్టడుగు స్థాయి మెడికల్ కాలేజీ లో చదివిన వారికి బతుకు అగమ్య గోచరం కానుంది. 1997 -2020 సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగంగా నడిచింది. అప్పుడు ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్ కళశాలలు వెలిశాయి . అక్కడ లభించిన విద్య ఎంత డొల్ల అయినా.. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమీర్‌పేట‌లో ఆరు నెలలు కోడింగ్ నేర్చుకొంటే ఉద్యోగం వచ్చేది .

ఇప్పుడు AI యుగం. సర్టిఫికెట్ లు డిగ్రీ లు చూసి జాబ్స్ ఇచ్చే కాలం అయిపోయింది . ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఇంజనీరింగ్ లేదా మెడికల్ కాలేజీ లో సీట్ వస్తే అదే పది వేలు అని తల్లితండ్రులు అనుకొంటున్నారు అంటే లోపం ఎక్కడుంది. ఎవరి మార్కెటింగ్ మాయాజాలం ? సగానికి పైగా పనికి రాని మెడికల్ కాలేజ్ లు. వేస్ట్ సరుకు . అన్నిటికి కలిపి ఒక్క ఎంట్రన్స్ పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం ? దీని వల్ల లబ్ధి పొందుతున్నది సరుకు లేని ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు కావా ?

45
ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు నిజాయితీగా జ‌రుగుతాయా.?
Image Credit : AI

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు నిజాయితీగా జ‌రుగుతాయా.?

కోటా చైనా కోచింగ్ ఫ్యాక్టరీ ల బడ్జెట్ ఎంత ? వాటిని అవి ఎలా ఖర్చు చేస్తున్నాయి. వేల కోట్ల డబ్బులు స్టేక్ గా ఉన్నప్పుడు .. ఎంట్రన్సు పరీక్షలు నిజాయతీగా జరుగుతాయా ? జరపాలంటే వాటికి ఎలాంటి యంత్రాగం అవసరం ? విద్యార్థి బట్టీ సామర్త్యాన్ని .. పాటర్న్ రికగ్నిషన్ .. స్పీడ్ ... ఒత్తిడి తట్టుకొనే సామ‌ర్థ్యాన్ని మాత్రమే పరీక్షించేలా ఐఐటీ జేఈఈ పరీక్షలు ఉన్నాయి . ఐఐటీ లో సీట్ వచ్చినా ఇలాంటి వారికి కృతిమ మేథ‌ యుగంలో ఉద్యోగాలు వస్తాయా ? వచ్చిన ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయి ?

నిజం మాట్లాడుకొందాము బ్రో .. మీడియా లో ఇవన్నీ ఎందుకు చర్చకు రావు? ఎవరి ప్రయోజనాల కోసం ? నిన్న టీవీ లో ఒక ప్రకటన. ఎక్కడో గ్రామీణ ప్రాంతం లో ఉన్న కోళ్ల ఫారం ఇంజనీరింగ్ కళాశాలలో వందల క్యాంపస్ ప్లేసెమెంట్‌లు అట. అరే నాయనా .. ఐఐటీ ముంబై కే దిక్కు లేదు, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పడం లేదు.

55
వెయ్యి ఉద్యమాలతో సమానం
Image Credit : Getty

వెయ్యి ఉద్యమాలతో సమానం

18 నెలలుగా కాలికి బలపం కట్టుకొని సొంత ఖర్చుతో 75 చోట్ల బాలమిత్ర క్లాసులు నిర్వహించి వచ్చిన వారిని ఎడ్యుకేట్ చేస్తున్నాను . ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో .. ఎలా చేసుకోవాలో చెబుతున్నాను. నాదో చారిత్రిక పోరాటం. కొంత మందిది రాజకీయ ఆరాటం. రాజకీయాల పై నేను స్పందించను. రాజకీయ పార్టీల అభిమానులు ఉన్మాదులు . కాస్త అటుఇటుగా అన్ని పార్టీల అభిమానులు అంతే .. సభ్యత సంస్కారం లేని మనుషులు. మనం నిర్మాణాత్మక విమర్శ చేసినా సహించలేరు.

బూతులతో విరుచుకొని పడిపోతారు. వ్యక్తిత్వ హననం చేస్తారు. రాజకీయ బురతలోకి నేను దిగను. ఆ విషయంలో నేను అసమర్ధుడిని క్షమించండి. నేను చెప్పదలచుకొన్న విషయాలు .. కరోనా , దాని దొంగ వ్యాక్సీన్‌ . ఇప్పుడు కొత్త సెర్వికల్ దాని దాక .. ఇంకా ఎన్నో విషయాలు .. ప్రపంచమంతా అవతల . నేనొక్కడే ఇవతల .. జస్ట్ డోంట్ కేర్ . ధైర్యం గా చెబుతాను . ఒక్క ఇంచి తగ్గను. రాజకీయాల పై మాట్లాడితే ప్రజానాం సున్నా. నాదైన శైలిలో .. నా స్థాయి మేరకు అనేక విషయాల్లో ప్రజల్లో మార్పు తెస్తున్నాను. ఒక్క వాసిరెడ్డి అమర్నాథ్ .. వెయ్యి ఉద్యమాలతో సమానం .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్
Recommended image2
హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌పైగా జీతం, ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
Recommended image3
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Related Stories
Recommended image1
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Recommended image2
నలుపు, తెలుపు, నీలం.. ఇంటికి ఏ రంగు వాటర్ ట్యాంక్ మంచిది? కొనేముందు ఇవి తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved