MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • మీరు డయాబెటీస్ పేషెంటా? బరువు తగ్గాలంటే ఇలా చేయండి..

మీరు డయాబెటీస్ పేషెంటా? బరువు తగ్గాలంటే ఇలా చేయండి..

చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు ఊబకాయంతో బాధపడుతున్నారు.  దీనివల్ల వీరికి గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్, నరాలు, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 29 2023, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
weight loss tips

weight loss tips

భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిస్ రాజధాని అని అంటారు. మన దేశంలో సుమారుగా 77 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. కాగా స్థూలకాయం అనేది డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువగా కనిపించే సాధారణ సమస్య. బీఎమ్ఐ కంటే ఉదర ఊబకాయం డయాబెటిక్ ప్రమాదానికి ఎక్కువ దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయం ఉన్న డయాబెటీస్ పేషెంట్లకు గుండె జబ్బులు, స్ట్రోక్, నరాల, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 

పర్యావరణ మార్పులు, జీవనశైలి మార్పులతో పాటుగా జన్యుపరమైన కారకాలు, కేలరీల ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా ఊబకాయం, డయాబెటిస్ రెండింటి ప్రాబల్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ బరువు తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తక్కువ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తినండి

శుద్ధి చేసిన చక్కెర, స్వీట్లు, కోలా, రసాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి.  వైట్ రైస్, వైట్ బ్రెడ్, పిజ్జా, పేస్ట్రీలు, పాస్తా వంటి ప్రాసెస్ చేసిన, శుద్ధి చేసిన ఆహారాలను తినడాన్ని తగ్గించండి. వీటిలో ఫైబర కంటెంట్, పోషకాలు తక్కువగా ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీరు వేగంగా బరువు పెరుగుతారు. 
 

37
weight loss

weight loss

తక్కువ జీఐ ఉన్న ఆహారాన్ని తీసుకోండి

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. పప్పుధాన్యాలు, పప్పులు, పాలు, సోయాబీన్ వంటి తక్కువ జీఐ అంటే 55, అంతకంటే తక్కువున్న ఆహారాలను తినండి. అయితే గోధుమలు, బియ్యం, రూట్ వెజిటేబుల్స్, కోలాలు, నూడుల్స్ వంటి అధిక జీఐ అంటే 70 కంటే ఎక్కువ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అందుకే వీటిని తీసుకోవడం మానేయండి. 
 

47

ఫైబర్ 

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, కాయలు, పండ్లు, కూరగాయలు, అవిసె గింజలు, మెంతి గింజలు, ఓట్ మీల్ వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నఆహారాన్ని మీ భోజనంలో చేర్చండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం కడుపును తొందరగా నింపుతుంది. దీంతో మీరు ఫుడ్ ను తీసుకోవడం చాలా వరకు తగ్గిస్తారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

57

తక్కువ సార్లు తినండి

నిపుణుల ప్రకారం.. మార్కెట్ నుంచి కొన్ని వాటిని కాకుండా ఇంట్లోనే కాల్చిన వస్తువులను తినండి. ఇది చక్కెరలను మాత్రమే కాకుండా హైడ్రోజనేటెడ్ ఆయిల్ ను కూడా తగ్గించడానికి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

67
weight loss

weight loss

అతిగా వద్దు

మీకు ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే ఎక్కువగా తినకండి. 
మీ ఫుడ్ ప్లేట్ చిన్నగా ఉండేలా చూసుకోండి. అంతేకాదు ఎక్కువ సేపు నమలండి. ఫుడ్ ను ఎక్కువ సేపు తినండి. ఇది మీరు తక్కువ తినడానికి సహాయపడుతుంది.
మీరు నాన్ వెజ్ తింటే సన్నని మాంసాలు,  చేపలనే ఎక్కువగా తినండి.
క్రీమీ గ్రేవీ వెజిటేబుల్స్ కు బదులుగా ఉడికించిన, వేయించి లేదా గ్రిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి.
 

77
walking and weight loss

walking and weight loss

మరింత చురుకుగా ఉండండి

శారీరక శ్రమ మీ బరువును నియంత్రించడానికి మీకు సహాయపడుతుంది. శక్తి కోసం మీ శరీరం చక్కెరను ఉపయోగిస్తుంది. శరీరం ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన లేదా 75 నిమిషాల శక్తివంతమైన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయండి. తొందరగా బరువు తగ్గుతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved