MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • డయాబెటీస్ రావొద్దంటే ఇలా చేయండి

డయాబెటీస్ రావొద్దంటే ఇలా చేయండి

డయాబెటీస్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నయం చేసుకోలేం. అందుకే ఈ వ్యాధి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 22 2023, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
diabetes

diabetes

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ డయాబెటిస్ కూడా ఎన్నో రోగాలకు కారణమవుతుంది. మీకు తెలుసా? దీన్ని పూర్తిగా నయం చేసుకోలేం. కేవలం నియంత్రించగం అంతే. మధుమేహం ఒకసారి వచ్చిందంటే మనం బతికున్నంత వరకు ఉంటుంది. ఈ రోగాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే లేనిపోని రోగాలు వస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
diabetes

diabetes

డయాబెటీస్ వ్యాధిని మందులు, జీవన శైలి ద్వారా నియంత్రణలో ఉంచొచ్చు. దీనికంటే ముందు అసలు డయాబెటీస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వారసత్వంగా. ఇలా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. రెండోది మన జీవనశైలి వల్ల వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణమవుతుంది. టైప్ 1 డయాబెటీస్ రాకుండా ఆపలేం. కానీ టైప్ 2 డయాబెటీస్ రాకుండా మాత్రం ఆపొచ్చు. టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
diabetes

diabetes

శరీర బరువు

స్థూలకాయం, ఊబకాయం ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ వయస్సు, ఎత్తును బట్టి మీ బరువును అదుపులో ఉంచుకోండి. అధిక బరువు గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో రోగాలకు దారితీస్తుంది కూడా. 
 

47

చెకప్ లు

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల  కూడా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటే ఆహారంతో సహా మన జీవనశైలి గురించి జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది మధుమేహాన్ని నివారిస్తుంది. 

57
diabetes

diabetes

ధూమపానం

ధూమపానం ఎన్నో ప్రమాదకరమైన రోగాలను కలిగిస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలుసు. ధూమపానం క్యాన్సర్ ప్రమాదాన్నే కాదు డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే స్మోకింగ్ అలవాటును వీలైనంత తొందరగా మానడానికి ప్రయత్నించండి. 

67
diabetes diet

diabetes diet

వాటర్

మన శరీరం అన్ని విధాలా  ఆరోగ్యంగా ఉండాలంటే మనం నీటిని పుష్కలంగా తాగాలి. నీటిని సరిగ్గా తాగకపోతే మన ఆరోగ్యం ఎన్నో విధాలుగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా డయాబెటిస్ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

77
diabetes diet

diabetes diet

ఆహారం

మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా మధుమేహం ముప్పు ఎంతో ఉంది. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. మీరు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది మీరు డయాబెటిస్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే సమతుల్యమైన, పోషకాలన్నీ ఉన్న ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను తినకుండా ఉండండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved