MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • అడపాదడపా ఉపవాసం ఉంటున్నారా? అయితే వీటిని ఖచ్చితంగా తినండి.. ఎందుకంటే?

అడపాదడపా ఉపవాసం ఉంటున్నారా? అయితే వీటిని ఖచ్చితంగా తినండి.. ఎందుకంటే?

ప్రస్తుతం అడపాదడపా ఉపవాసం ఉండే వారు ఎక్కువయ్యారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ ఉపవాసం ఉండేవారు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలంటున్నారు నిపుణులు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 14 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అడపాదడపా ఉపవాసం ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఈ డైటింగ్ ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. మీరు ఎప్పుడు తినొచ్చనే దానిపై పరిమితులు ఉన్నప్పటికీ.. మీరు ఏం తినాలనేదానిపై నియమాలు లేవు. అయినప్పటికీ.. ఉపవాసం సమయంలో మీ శరీరానికి శక్తిని ఇవ్వడానికి సరైన ఆహార పదార్థాలను తినాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. 
 

25
Image: Getty Images

Image: Getty Images

అవకాడోలు

అవకాడోల్లో కేలరీల ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీనిలో అసంతృప్త కొవ్వు కంటెంట్ ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గేందుకు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 2017 నుంచి జరిపిన పరిశోధన ప్రకారం..అసంతృప్త కొవ్వులు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఉపవాసం ఉండేటప్పుడు మీకు ఆకలి అయినప్పటికీ.. మీ శరీరానికి మరీ ఎక్కువగా ఆకలి కానీయదు. 
 

35

క్రూసిఫరస్ కూరగాయలు

బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫరస్ కూరగాయలు అడపాదడపా ఉపవాసం ఉన్నవారికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని ఫైబర్ ఆకలి బాధలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఉపవాస షెడ్యూల్ కు కట్టుబడి ఉండటం సులభం చేస్తుంది. అంతేకాక ఈ కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 
 

45

బీన్స్, చిక్కుళ్లు

బీన్స్, చిక్కుళ్లు అడపాదడపా ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమమైన ఆహారాలు. మీరు తినే వాటిలో బీన్స్, చిక్కుళ్లు వంటి తక్కువ కేలరీల పిండి పదార్థాలను చేర్చడం వల్ల మీ ఉపవాస సమయంలో మీరు శక్తివంతంగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. 
 

55

అలాగే బ్లాక్ బీన్స్, చిక్పీస్, కాయధాన్యాలు, బఠానీలు వంటి ఆహారాలు కేలరీల పరిమితి లేకుండా కూడా శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే ఈ ఆహారాలను మీ అడపాదడపా ఉపవాసంలో చేర్చండి. ఇవి మిమ్మల్ని హెల్తీగా కూడా ఉంచుతాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త
Recommended image2
Stress Relief foods: ఒత్తిడిని తగ్గించే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో!
Recommended image3
Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved