MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఇది జ్వరమా? లేక కోవిడా? ఎలా గుర్తించాలంటే..?

ఇది జ్వరమా? లేక కోవిడా? ఎలా గుర్తించాలంటే..?

జ్వరం, కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ రెండింటి లక్షణాలు కొంచెం ఒకేలా ఉండటంతో జనాలు టెస్టులు కూడా చేయించుకోవడం లేదు. దీనివల్లే చాలా మంది కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించుకోవాలో తెలుసా? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 15 2023, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కేరళ సహా చాలా రాష్ట్రాల్లో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.  దీనికి తోడు కొంతకాలం నుంచి మళ్లీ దేశంలో కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. అందుకే చాలా మంది తమకొచ్చింది జ్వరమా? లేకపోతే కోవిడా? అన్నది గుర్తించలేకపోతున్నారు. కోవిడ్ వచ్చినవాళ్లు కూడా సాధారణ జ్వరంలాగే భావించి టెస్టులు చేయించుకోవడం మానేస్తుంటారు. హాస్పటల్లకు కూడా వెళ్లరు. దీనివల్లే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు జ్వరానికి, కోవిడ్ కు మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  
 

25

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కరోనా లక్షణాలో ఒకటి. ముఖ్యంగా ఈ సమస్య కోవిడ్ సోకిన వ్యక్తుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సంక్రమణ సమయంలో లేదా తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమస్య కరోనా సోకిన అందరికీ కనిపించకపోవచ్చు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తే అది మామూలు జ్వరం కాదని గుర్తించుకోవాలి. ఎందుకంటే జ్వరం వల్ల శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. అందుకే ఇది కోవిడ్ అని నిర్ధారించుకోవాలి. 

35

విపరీతమైన అలసట

చాలా మంది విపరీతమైన అలసటతో బాధపడుతున్నామని చెప్తుంటారు. అయితే ఇది కూడా జ్వరం సాధారణ లక్షణం కాదు. భరించలేని అలసట కలిగితే మీకు కోవిడ్ సోకినట్టేనంటున్నారు నిపుణులు. ఇలాంటి అలసట ఎక్కువ కాలం ఉంటుంది.

45

పొడి దగ్గు

జ్వరంతో బాధపడే వారిలో దగ్గు, జలుబు సమస్యలు కూడా కనిపిస్తాయి. కానీ అది కేవలం దగ్గు అయితే అందులోనూ పొడి దగ్గు అయితే అది ఖచ్చితంగా కోవిడ్ వల్లేనని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జ్వరం వల్ల పొడిదగ్గు రాదు. 

55

బాడీ టెంపరేచర్

సాధారణ జ్వరానికి కోవిడ్ కు శరీర ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. సాధారణ జ్వరం అయితే మీ శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. కానీ కోవిడ్ వల్ల అప్పుడప్పుడు కొద్దిగా మాత్రమే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. వీటి మధ్య తేడాను గుర్తిస్తే అది సాధారణ జ్వరమా? లేక కోవిడా అనేది సులువుగా గుర్తించొచ్చు. 

అయితే మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా అని టెన్షన్ పడకుండా.. మీరే స్వయంగా నిర్దారించుకోకండి. హాస్పటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త
Recommended image2
Stress Relief foods: ఒత్తిడిని తగ్గించే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో!
Recommended image3
Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved