MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఈ విషయాలను మర్చిపోతేనే ఎన్నో రోగాలొస్తయ్..!

ఈ విషయాలను మర్చిపోతేనే ఎన్నో రోగాలొస్తయ్..!

కొలెస్ట్రాల్ ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. కానీ చాలా  మంది దీనిగురించి పట్టించుకోవడమే మానేస్తుంటారు. ఇలాంటి వారికే ఎన్నో వ్యాధులు చుట్టుకుంటాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 24 2023, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
cholesterol and heart

cholesterol and heart

కొలెస్ట్రాల్ స్థాయిలు 200 మి.గ్రా / డీఎల్ కంటే ఎక్కువ ఉండటం ప్రమాదకరంగా పరిగణిస్తారు. సాధారణం కొలెస్ట్రాల్ లేదా రక్త లిపిడ్ నివేదిక శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ కూర్పును నిర్ణయించడానికి మూడు భాగాలు ఉంటాయి.అవి: అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్, ట్రైగ్లిజరైడ్స్.  ఎల్డిఎల్ సాధారణ పరిధి 100 మి.గ్రా / డీఎల్ కంటే తక్కువ. ఎల్డిఎల్ ను చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ వరుసగా 40 మి.గ్రా / డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ. అంటే ఇవి 150 మి.గ్రా / డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి విషయాలను పట్టించుకోమో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెగ్యులర్ చెకప్ ను విస్మరిస్తాం

ఎన్నో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాల్ని తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ విషయంలో రక్తంలోని లిపిడ్ ప్రొఫైల్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అలాగే జీవనశైలిలో మార్పులు, మందుల ద్వారా ఎల్డిఎల్ స్థాయిలను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. 
 

37

వ్యాయామాలను విస్మరిస్తాం

వర్కౌట్స్, శారీరక కార్యకలాపాల వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. కానీ వాటిని మాత్రం చేయం. మందులు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయని చాలా మంది నమ్ముతారు. ఇలాంటి వారు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి కేవలం మందులను మాత్రమే ఉపయోగిస్తారు. కానీ శరీరాన్ని శారీరకంగా చురుకుగా ఉంచడం చాలా ముఖ్యం. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కరగడంతో పాటుగా శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. వాకింగ్ వంటి 150 నిమిషాల శారీరక శ్రమ గుండె జబ్బులు వంటి అధిక కొలెస్ట్రాల్ తో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
 

47

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే అనర్థాలను విస్మరిస్తాం.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో రక్తపోటు పెరగడానికి కూడా ఇది దారితీస్తుంది. ఎక్కువసేపు నిశ్చలంగా ఉండటం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరంలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో హెచ్డిఎల్ ను అంటే మంచి కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఏదేమైనా ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

57
smoking

smoking

స్మోకింగ్ దుష్ప్రభావాలను విస్మరిస్తాం

స్మోకింగ్ కు అధిక కొలెస్ట్రాల్ మధ్య సంబంధాన్ని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. కొంతమంది బరువు పెరిగినప్పటికీ.. స్మోకింగ్ ను మానేయడం వల్ల వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగాయని అధ్యయనాలు వెల్లడించాయి. హెచ్డిఎల్, స్మోకింగ్ ఒకదానికొకటి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ధూమపానం రక్తంలో హెచ్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. 
 

67

బరువు పెరగడాన్ని విస్మరిస్తాం

మీరు కొద్దిగా బరువు పెరిగినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి అదనపు 10 పౌండ్లు శరీరంలో 10 మిల్లీగ్రాముల అదనపు కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్)  పెరుగుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

77

కొలెస్ట్రాల్ ను ఎలా నిర్వహించాలి?

పరిశోధనలు, డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి జీవనశైలి మార్పులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని చెబుతున్నారు. పని మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడవండి. పనిలో పడి మర్చిపోయే ఛాన్స్ ఉంటే ప్రతి 20-30 నిమిషాలకు అలారంలను సెట్ చేయండి. డెస్క్ ఉద్యోగం ఉన్నవారు స్టాండింగ్ డెస్క్ పై పనిచేయడానికి ప్రయత్నించండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved