MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • టాయిలెట్ లో కూడా ఫోన్ వాడితే..!

టాయిలెట్ లో కూడా ఫోన్ వాడితే..!

ఫోన్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. కొంతమంది అయితే ఫోక్ ను వదిలి కొద్ది సేపు కూడా ఉండలేకపోతుంటారు. అందులోనూ టాయిలెట్ లో కూడా ఫోన్ ను వాడుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం..  టాయిలెట్ లో ఫోన్లను వాడే వారికి ఎన్నో రోగాలు వస్తాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2023, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుత కాలంలో చిన్నలు పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను వాడుతున్నారు. వాటికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత అయితే ఫోన్లను వాడకుండా ఉండలేకపోతున్నారు. అంతెందుకు టాయిలెట్ కు కూడా ఫోన్లను తీసుకెళుతుంటారు. రీల్స్ చూడటం, వర్క్ మెయిల్స్ కు రిప్లే ఇవ్వడం వంటి ఎన్నో పనులను చేస్తుంటారు టాయిలెట్ సీటుపై కూర్చొని.  కానీ టాయిలెట్ సీటుపై మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ అలవాటును ఎందుకు మానాలంటే? 

నిజానికి టాయిలెట్ సీటు తెల్లగా కనిపించినంత మాత్రాన అది శుభ్రంగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే టాయిలెట్ సీటుపై సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి. దానిపై కూర్చొని ఫోన్ లో పైకి కిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు మన చేతులకు ఎన్నో క్రిములు అంటుకుంటాయి. ఇవి కాస్త ముక్కు, కళ్లు, నోట్లోకి వెళతాయి. అయితే మొబైల్ ఫోన్ స్క్రీన్ పై ఉండే క్రిములు సుమారుగా 28 రోజులు బతికే ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాయిలెట్ సీట్ల కంటే స్మార్ట్  ఫోన్లపైనే పది రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములను మోసుకెళతాయని నిపుణులు చెబుతున్నాయి. టాయిలెట్ సీటును ముట్టుకుని ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ ను పట్టుకోవడం వల్ల దానిపై ఎన్నో క్రిములు ఉంటాయి. ఈ సూక్ష్మక్రిములు ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. 
 

35
<p>Smart Phone in toilet</p>

<p>Smart Phone in toilet</p>

టాయిలెట్ లో ఉండే క్రిములేంటి? 

స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే సూక్ష్మక్రిములు  టాయిలెట్ సీటుపై ఉంటాయి. అయితే టాయిలెట్ సీట్లపై ఉండే స్టెఫిలోకాకస్ ఇతర జాతులు మనుషులకు ఎంతో హానిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయి. టాయిలెట్ సీటులో ఇ.కోలి, ఎంటరోకోకస్, సాల్మొనెల్లా, షిగెల్లాలల, క్యాంపిలోబాక్టర్ లు కూడా ఉంటాయి. 
 

45
mobile phone

mobile phone

మీకొచ్చే అంటువ్యాధులేంటి? 

టాయిలెట్ లో ఉండే సూక్ష్మక్రిములు మీ ఫోన్ కు అంటుకుని.. అవి మీకు అంటుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. గడ్డలు, సైనసైటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. 
 

55
phone

phone


టాయిలెట్ కు ఫోన్ ను తీసుకెళితే మీరు టాయిలెట్ సీటుపై అవసరానికి మించి ఎక్కువ సేపు కూర్చుంటారు. ఈ అలవాటుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఎందుకంటే టాయిలెట్ సీట్లలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్స్ ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఇది పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మీ పాయువు చుట్టూ ఉన్న సిరలు ఒత్తిడికి గురవుతాయి. ఉబ్బుతాయి. మరుగుదొడ్డిపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల దిగువ పురీషనాళంలో పెరిగిన ఒత్తిడి నుంచిచ హేమోరాయిడ్లు అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. 


 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved