MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఇదొక్కటి తింటే చాలు కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా తగ్గుతుంది..!

ఇదొక్కటి తింటే చాలు కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా తగ్గుతుంది..!

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే వెల్లుల్లిలోని సల్ఫర్ కొలెస్ట్రాల్ ఉన్న రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోజూ సగం లేదా ఒక వెల్లుల్లి రెబ్బను తింటే 10 శాతం  వరకు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయట.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 24 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వెల్లుల్లిని పరిమితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. వెల్లుల్లి వంటను రుచిగా చేయడమే కాదు  గుండెను కూడా  ఆరోగ్యంగా ఉంచుతుందని నమ్ముతారు. వెల్లుల్లి రెబ్బ కూడా హృద్రోగులకు మేలు చేస్తుందని పబ్మెడ్ సెంట్రల్ పరిశోధనలో తేలింది. ఇది రక్త నాళాలను శుభ్రపరిచేందుకు పనిచేస్తుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పబ్మెడ్ సెంట్రల్ చేసిన ఈ పరిశోధన ప్రకారం.. వెల్లుల్లిలో అల్లిన్, అల్లిసిన్, అజి, అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్, డయల్ ట్రైసల్ఫైడ్, ఎస్-అల్లిల్ మెర్కాప్టో సిస్టీన్ తో పాటుగా అనేక ఇతర ఎంజైమ్లు వంటి సుమారు 33 సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. అవన్నీ మన శరీరంలో వివిధ రకాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లిలో ఉండే 17 అమైనో ఆమ్లాలు శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు వెల్లుల్లిలోని  ఖనిజాలు సెలీనియం, జెర్మేనియం, టెల్లూరియం కణజాలాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

34

ఈ సమ్మేళనాలు డీఎన్ఏ ను తయారు చేయడానికి, మరమ్మత్తు చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా వెల్లుల్లి మన శరీర జీవక్రియను మెరుగుపర్చడానికి, పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

44

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

 కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి వెల్లుల్లిలోని సల్ఫర్ సహాయపడుతుంది. ఒక పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ సగం నుంచి 1 వెల్లుల్లి రెబ్బను తింటే కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గింది. ఇంతేకాదు  20 గ్రాముల వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి, అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇది సిరలను శుభ్రపరచడమే కాకుండా చెడు కొవ్వు లిపిడ్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మీరు రోజూ 1 వెల్లుల్లి రెబ్బను తినండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image2
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image3
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved