MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఖర్జూరాలను తినే అలవాటు లేదా? మీరెన్ని లాభాలను మిస్ అయిపోతున్నారో తెలుసా?

ఖర్జూరాలను తినే అలవాటు లేదా? మీరెన్ని లాభాలను మిస్ అయిపోతున్నారో తెలుసా?

తీయగా, టేస్టీగా ఉండే ఖర్జూరాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిజానికి ఖర్జూరాల్లో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. అందుకే ఖర్జూరాలను ప్రపంచవ్యాప్తంగా  తింటున్నారు. ప్రతిరోజూ ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 08 2023, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
dates

dates

గుండెను రక్షిస్తుంది

ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే మీ గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. ఈ పండు కంటి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

27
dates

dates

క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఆరోగ్య నిపుణుల  ప్రకారం.. ఖర్జూరాల్లో ఉండే ఫినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఈ పండు కొన్ని ప్రాణాంతక క్యాన్సర్ల ప్రమాదాన్ని, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

37
dates

dates

ఎముకలను బలపరుస్తుంది

ఖర్జూరాల్లో రాగి, సెలీనియం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల వ్యాధులను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే దీనిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల జీవక్రియను సులభతరం చేస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది.

47
dates

dates

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

ఖర్జూరాలను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. 
 

57
dates

dates

మధుమేహానికి చెక్ పెడుతుంది

ఒక పరిశోధన ప్రకారం.. ఖర్జూరాలు రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి, పేగు నుంచి గ్లూకోజ్ శోషించబడే రేటు రెండూ దాని ద్వారా మందగించబడతాయి. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది.
 

67

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల మీ బరువు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్ద ప్రేగులలో పోషకాల శోషణను తగ్గిస్తుంది. అంతేకాదు  ఖర్జూరాలు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని తగ్గించి జీవక్రియను పెంచుతాయి.
 

77
dates

dates

ఐరన్ లోపాన్ని పోగొడుతుంది

మగవారి కంటే ఆడవాళ్ల శరీరంలోనే ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనివల్లే వీరికి రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు ఐరన్ లోపం ఉంటే ఐరన్ సప్లిమెంట్లను కొనడానికి బదులుగా, మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం మంచిది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: మంతెన చెప్పిన ఈ 30 డేస్ ఛాలెంజ్‍తో ఈజీగా వెయిట్ లాస్
Recommended image2
Health : ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్రవిసర్జన చేస్తాడు..? ఇంతకంటే ఎక్కువసార్లు చేస్తే..
Recommended image3
Honey Water: పరగడుపున హనీ వాటర్ తాగుతున్నారా?ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved