MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • World's Shortest Flight Journey : ప్రపంచంలో అతితక్కువ దూరం ప్రయాణించే విమానం ఏది? 53 సెకన్లే జర్నీ..!

World's Shortest Flight Journey : ప్రపంచంలో అతితక్కువ దూరం ప్రయాణించే విమానం ఏది? 53 సెకన్లే జర్నీ..!

World's Shortest Flight Journey : సాధారణంగా వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించేందుకు విమానం ఎక్కుతాం. కానీ 2-3 కి.మీ ప్రయాణానికి విమాన సర్వీస్ ఉంటే.. సెకన్లలోనే ఆ ప్రయాణం ముగిస్తే…!

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 23 2026, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరల్డ్ షార్టెర్ట్ ప్లైట్ జర్నీ ఏది?
Image Credit : Gemini AI

వరల్డ్ షార్టెర్ట్ ప్లైట్ జర్నీ ఏది?

Worlds Shortest Flight Journey : విమానం అంటే సాధారణంగా వందల కిలోమీటర్ల దూరాన్ని గంటల వ్యవధిలో ప్రయాణించే రవాణా సాధనంగా మనకు తెలుసు. విమానాశ్రయానికి వెళ్లడం, చెక్‌ఇన్ చేయడం, సెక్యూరిటీ తనిఖీలు పూర్తి చేయడం, విమానమెక్కి గంటల తరబడి ప్రయాణించి గమ్యానికి చేరడం... ఇలా ఫ్లైట్ జర్నీకి చాలానే సమయం పడుతుంది… కొన్ని దేశాల మధ్య గంటలు కాదు రోజుల తరబడి ప్రయాణం ఉంటుంది.

అయితే ప్రపంచంలో ఓ విమాన సర్వీస్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ విమానం ప్రయాణం మొదలైన కొన్ని సెకన్లకే ముగుస్తుంది… అంటే ప్లైట్ ఎక్కి సీట్లో కూర్చుని సర్దుకునేలోపే గమ్యస్థానం వస్తుంది. ఈ ప్లైట్ జర్నీ సమయం నిమిషం కంటే కూడా తక్కువే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం 53 సెకన్లే ఈ ప్లైట్ జర్నీ..
Image Credit : Getty

కేవలం 53 సెకన్లే ఈ ప్లైట్ జర్నీ..

స్కాట్లాండ్‌లోని రెండు చిన్న ద్వీపాలైన వెస్ట్రే (Westray), పాపా వెస్ట్రే (Papa Westray) మధ్య ఈ విమాన సర్వీస్ నడుస్తుంది. ఈ రెండు ద్వీపాల మధ్య దూరం కేవలం 2.7 కిలోమీటర్లు మాత్రమే. ఈ మార్గంలో నడిచే విమానం ప్రపంచంలోని అతి తక్కువ దూరం గల వాణిజ్య విమాన మార్గాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ విమానం ప్రయాణం సుమారు 53 సెకన్లలోనే పూర్తవుతుంది. గాలులు, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణ సమయం కొంత మారవచ్చు.

35
రెండు ద్వీపాల మధ్య విమానం సర్వీస్ ఇంత కీలకమా..!
Image Credit : ANI

రెండు ద్వీపాల మధ్య విమానం సర్వీస్ ఇంత కీలకమా..!

వెస్ట్రే, పాపా వెస్ట్రే ద్వీపాల మధ్య రవాణా అవసరం స్థానిక ప్రజలకు చాలా ముఖ్యమైనది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర స్థానికులు రాకపోకలకు ఈ విమాన సేవను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఈ చిన్న విమాన సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది. అనారోగ్యంతో ఉన్నవారిని అవసరమైన వైద్య సదుపాయాలున్న ప్రాంతాలకు త్వరగా తరలించేందుకు కూడా విమానాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల ఇది కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు అత్యవసర రవాణా వ్యవస్థగా కూడా పనిచేస్తోంది.

45
బ్రిడ్జి లేదా పడవ ఎందుకు లేదు?
Image Credit : PR

బ్రిడ్జి లేదా పడవ ఎందుకు లేదు?

ఈ వెస్ట్రే, పాపా వేస్ట్రే ద్వీపాల మధ్య దూరం కేవలం 2.7 కిలోమీటర్లే కాబట్టి ఓ బ్రిడ్జి నిర్మించి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించవచ్చుకదా? లేదా పడవలు నడపవచ్చుకదా? అనే ప్రశ్న రావడం సహజమే. అయితే ద్వీపాల భౌగోళిక పరిస్థితులు, అక్కడి జనాభా, మౌలిక సదుపాయాల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే భారీ వంతెన నిర్మాణం అంత సులభమైన విషయం కాదు. ఇలాంటి ప్రాజెక్టుకు భారీగా పెట్టుబడి అవసరమవుతుంది.

ఈ చిన్న ద్వీపాల్లో నివసించే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. వెస్ట్రేలో సుమారు 500 మంది, పాపా వెస్ట్రేలో సుమారు 95 మంది మాత్రమే నివసిస్తున్నట్లు సమాచారం. ఇంత తక్కువ జనాభా కోసం భారీ వంతెన నిర్మించడం ఆర్థికంగా, సాంకేతికంగా సమర్థవంతమైన పరిష్కారం కాకపోవచ్చు.

మరోవైపు పడవల ద్వారా ఈ రెండు ద్వీపాల మధ్య ప్రయాణించవచ్చు. కానీ సముద్ర మార్గంలో ప్రయాణానికి విమానంతో పోలిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకం. అందుకే తక్కువ సమయంలో ప్రజలను ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి తరలించేందుకు విమాన సేవ ఉపయోగకరంగా మారింది. తక్కువ దూరం అయినప్పటికీ విమానం అందించే వేగం స్థానిక రవాణా వ్యవస్థలో ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తోంది.

55
ప్రపంచంలోనే ప్రత్యేకమైన విమాన ప్రయాణం
Image Credit : X

ప్రపంచంలోనే ప్రత్యేకమైన విమాన ప్రయాణం

వెస్ట్రే, పాపా వెస్ట్రే ద్వీపాల మధ్య ఈ చిన్న విమాన మార్గానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1967 నుంచి ఈ రెండు ద్వీపాల మధ్య విమాన సర్వీస్ కొనసాగుతోంది. చిన్న దూరం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గం ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఒక్కసారి ఊహించుకోండి.. విమానం ఎక్కి సీటులో కూర్చొని, సీటు బెల్ట్ పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టగానే కొన్ని క్షణాల్లోనే పైలట్ ల్యాండింగ్‌కు సిద్ధమవుతారు. సాధారణ విమాన ప్రయాణాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం.

సాధారణంగా విమాన ప్రయాణం అంటే ఎక్కువ దూరాలను తక్కువ సమయంలో చేరుకోవడం. కానీ వెస్ట్రే–పాపా వెస్ట్రే విమాన మార్గం మాత్రం తక్కువ దూరాన్ని అత్యంత వేగంగా దాటేందుకు విమానాన్ని ఉపయోగించే ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది.

కేవలం 2.7 కిలోమీటర్ల దూరం.. సుమారు 53 సెకన్ల ప్రయాణం.. దశాబ్దాలుగా కొనసాగుతున్న విమాన సర్వీస్.. ఇవన్నీ కలిపి ఈ మార్గాన్ని ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన విమాన ప్రయాణాల్లో ఒకటిగా మార్చాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు స్ట్రెయిట్ గా వేస్తే దూరం తగ్గుతుందిగా.. మరి వంకరటింకరగా, మలుపులు తిప్పుతూ ఎందుకు వేస్తారు?
Recommended image2
మేఘాలను తాకే అనుభూతి కావాలా? ఏపీలోని ‘వంజంగి మేఘాల కొండ’ల మీదకు వెళ్లండి
Recommended image3
Snakes : పాములు రోజుకు ఎంత నీరు తాగుతాయి? వాటి దాహం ఎలా తీరుతుంది?
Related Stories
Recommended image1
World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన.. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved