MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Feature
  • Dogs Behavior : వీధికుక్కలు వెంటపడితే ఎలా తప్పించుకోవాలో తెలుసా?

Dogs Behavior : వీధికుక్కలు వెంటపడితే ఎలా తప్పించుకోవాలో తెలుసా?

మీ వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందా? మీరు లేదా మీ కుటుంబసభ్యులు బయటకు వస్తే వెంటపడి తరుముతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయా? అయితే కుక్కల దాడికి గురికావద్దంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకొండి.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 23 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వీధికుక్కల నుండి తప్పించుకునే ట్రిక్స్
Image Credit : Gemini AI

వీధికుక్కల నుండి తప్పించుకునే ట్రిక్స్

Dogs Behavior : మనం రోడ్డుపై వెళుతున్నప్పుడు కొన్నిసార్లు వీధికుక్కలు వెంటపడుతుంటాయి... కారులో ఉంటే పరవాలేదు కానీ నడుచుకుంటూ, బైక్ పై వెళుతుంటే మాత్రం ప్రమాదకరం. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారుతుంది... కుక్కకాటును తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళితే ప్రమాదానికి గురికావచ్చు, అలాకాదని మెళ్లిగా వెళితే కుక్కలకు దొరికిపోతామన్న భయం. నడుచుకుంటూ వెళ్లేవారి పరిస్థితి మరీ దారుణం… వీధికుక్కలు దాడికి ప్రయత్నిస్తాయి, గట్టిగా మొరుగుతూ వెంటపడి భయబ్రాంతులకు గురిచేస్తాయి.

ఇలా వీధికుక్కలు మనుషులు, వాహనాల వెంట ఎందుకు పడతాయి? అకారణంగా ఎందుకు దాడికి ప్రయత్నిస్తాయి? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కుక్కల ప్రవర్తన గురించి తెలిస్తే ఈ డౌట్ క్లియర్ అవుతుంది. వీధికుక్కలు ఎందుకు వెంటపడతాయి? వాటినుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుక్కలు ఎందుకు వెంటపడతాయి?
Image Credit : Getty

కుక్కలు ఎందుకు వెంటపడతాయి?

వీధికుక్కలు తాము నివాసముండే ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా భావిస్తాయి... అందుకే వేరే కుక్కలు తమ ప్రాంతంలోకి వస్తే తరమడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు మనుషులను కూడా శత్రువులుగా భావిస్తాయి... అందుకే వెంటపడతాయి, దాడికి ప్రయత్నిస్తాయి.

కుక్కలు తమ పరిధిని మూత్రం ద్వారా గుర్తిస్తాయి... అందుకే తరచూ అవి నివాసముండే ప్రాంతంలోని వాహనాలపై మూత్రం పోస్తాయి. అయితే ఈ వాహనం మరోచోటికి వెళ్లినప్పుడు అక్కడి కుక్కలు ఈ మూత్రం వాసనను పసిగడతాయి... అందుకే అవి వాహనం వెంటపడతాయి.

ఇక వాహనాలు వేగంగా వెళుతున్నప్పుడు తమ సరిహద్దుల్లోకి ఎవరో శత్రువులు ప్రవేశించారని కుక్కలు భావిస్తాయట. అందుకే తరిమికొట్టడానికి వాహనాల వెంటపడుతుంటాయి. కుక్కలకు పుట్టుకతోనే వేటాడే గుణం వస్తుంది... అందుకే వేగంగా వెళ్లే వాహనాలను పట్టుకునేందుకు పరుగెడతాయి.

ఇక గతంలో ఏదైనా వాహనం ఢీకొట్టినా, పిల్లల చావుకు కారణమైనా, వాహనంపై వెళ్లేవారు దాడికి పాల్పడినా కుక్కల్లో భయం నాటుకుపోతుంది. అందుకే ఏ వాహనం కనిపించినా భయపడిపోతుంటాయి... వెంటపడి దాడికి ప్రయత్నిస్తాయి. వాహనాల శబ్దం కూడా కొన్నిసార్లు కుక్కలను ఇరిటేట్ చేస్తుంది... ఇలాంటప్పుడు కూడా వెంటపడతాయి.

34
కుక్కల దాడి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

కుక్కల దాడి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి?

1. కుక్కలు వెంటపడితే అస్సలు పరుగెత్తకూడదు

దారిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వీధి కుక్కలు అకస్మాత్తుగా మొరగడం లేదా వెంటపడటం చేస్తే చాలామంది భయంతో అరుస్తూ పరిగెత్తుతారు. అలా పరిగెత్తడమే కుక్క కాటుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడి పరిగెత్తకండి. మీరు పరిగెత్తితే కుక్కలోని వేటాడే లక్షణం (Prey Drive) మేల్కొని మిమ్మల్ని కరవడానికి వెంటపడుతుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని, ప్రశాంతంగా ఒకే చోట నిలబడటానికి ప్రయత్నించండి.

2. కుక్క కళ్లలోకి నేరుగా చూడకండి

వెంటపడే కుక్కల కళ్లలోకి నేరుగా చూడకండి. కుక్కల భాషలో నేరుగా చూడటం అంటే సవాలు విసరడం లేదా బెదిరించడం అని అర్థం. మీ శరీరాన్ని కొద్దిగా పక్కకు తిప్పి (Side stance), నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయండి.

3. అరవకండి, కుక్కను బెదిరించకండి

గట్టిగా అరవడం లేదా చేతులు, కాళ్లు ఆడిస్తూ కుక్కను బెదిరించడానికి ప్రయత్నించకండి. మీ చేతిలో బ్యాగ్, బాటిల్, గొడుగు లేదా ఏదైనా వస్తువు ఉంటే దాన్ని మీకు, కుక్కకు మధ్య అడ్డంగా పెట్టుకోండి. మీ నుంచి ఎలాంటి ప్రమాదం లేదని గ్రహించి కుక్క దానంతట అదే వెళ్లిపోతుంది.

4. కింద పడిపోతే బంతిలా ముడుచుకోండి

ఒకవేళ కుక్క దాడి చేసి మిమ్మల్ని కింద పడేస్తే, నేలపై ఫ్లాట్‌గా పడుకోకండి. వెంటనే మీ ముఖం, మెడ, తల, చెవులను చేతులతో కప్పుకుని బంతిలా (Ball posture) ముడుచుకోండి. దీనివల్ల ప్రాణాపాయం కలిగించే సున్నితమైన అవయవాలను రక్షించుకోవచ్చు.

5. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి

పిల్లలను రోడ్డుపై ఒంటరిగా వదిలేయకండి. వీధి కుక్కల దగ్గరకు వెళ్లొద్దని పిల్లలను హెచ్చరించండి. పెంపుడు కుక్క అయినా సరే యజమాని అనుమతి లేకుండా పిల్లలను దాన్ని తాకనివ్వకండి. సహజంగా పిల్లలు చిన్నగా, బలహీనంగా కనిపిస్తారు కాబట్టి కుక్కలు ఈజీ టార్గెట్ గా బావిస్తాయి.

44
కుక్కలు కరిచినా, గీరినా ఏం చేయాలి?
Image Credit : Getty

కుక్కలు కరిచినా, గీరినా ఏం చేయాలి?

ఒకవేళ కుక్క కరిచినా లేదా గోళ్లతో గీరినా ఏమాత్రం అజాగ్రత్త వహించరాదు. వెంటనే ఆ గాయాన్ని మంచినీరు, సబ్బుతో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు కడగండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ (Anti-Rabies Vaccine - ARV) వేయించుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian River: మనదేశంలో కంటికి కనిపించకుండా ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏది?
Recommended image2
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image3
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Related Stories
Recommended image1
Dogs: వీధి కుక్కలు కార్ల వెనక ఎందుకు పడతాయి? అసలు కారణం తెలిస్తే షాకౌతారు..!
Recommended image2
Dogs Behavior : రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తున్నట్లు అరుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా? అసలు రీజన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved