MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • World's Largest Snake: బాబోయ్ 250 కేజీల పామా? ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏదో తెలుసా?

World's Largest Snake: బాబోయ్ 250 కేజీల పామా? ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏదో తెలుసా?

World's Largest Snake: ప్రస్తుతం జీవించి ఉన్న వాటిలో అనకొండ పెద్దది కాగా, భూమి చరిత్రలోనే అతిపెద్దగా పాము టైటానోబోవా. సుమారు 6 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ పాము 42 నుండి 50 అడుగుల పొడవు, 1,100 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 28 2026, 06:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రపంచంలో అతిపెద్ద పాము.. మనుషులను నిజంగానే మింగేస్తాయా?
Image Credit : X?chatgpt

ప్రపంచంలో అతిపెద్ద పాము.. మనుషులను నిజంగానే మింగేస్తాయా?

సాధారణంగా ఒక చిన్న పాము కనిపిస్తేనే మనం భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది మనిషి నడుము కంటే లావుగా, దాదాపు 250 కిలోల బరువు ఉండే పాము మన కంటిముందు కనిపిస్తే? ఊహించుకోవడానికే వింతగా ఉంది కదా.. ఈ భూగోళంపై జీవించే కొన్ని ప్రాణులు తమ అపారమైన పరిమాణంతో సామాన్యులనే కాదు, సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు 'గ్రీన్ అనకొండ'. అయితే, పొడవు, బరువు ఆధారంగా చూస్తే పాముల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన రేస్ నడుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పొడవు ఒకరిది.. బరువు మరొకరిది: పాముల్లో అసలు విన్నర్ ఎవరు?
Image Credit : chatgpt

పొడవు ఒకరిది.. బరువు మరొకరిది: పాముల్లో అసలు విన్నర్ ఎవరు?

ప్రపంచంలో అతిపెద్ద పాము ఏది అనే విషయంలో జనాల్లో నిత్యం ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. పొడవు విషయంలో ఆసియాకు చెందిన 'రెటిక్యులేటెడ్ కొండచిలువ' మొదటి స్థానంలో నిలిచినా, ఓవరాల్‌గా బరువు, బాడీ సైజ్, మందం ఆధారంగా 'గ్రీన్ అనకొండ'నే ప్రపంచంలో అతిపెద్ద పాముగా గుర్తిస్తారు.

ఒక వైపు రెటిక్యులేటెడ్ పైథాన్లు సాధారణంగా 20 నుంచి 30 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరిగి రికార్డు సృష్టిస్తాయి. కానీ అనకొండతో పోలిస్తే వీటి శరీరం కాస్త సన్నగా ఉంటుంది. మరోవైపు గ్రీన్ అనకొండ పొడవు సాధారణంగా 15 నుంచి 20 అడుగులు ఉన్నప్పటికీ, దాని శరీరం చాలా భారీగా ఉంటుంది. ఒక్కో పెద్ద అనకొండ బరువు 100 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. దీని శరీరం చుట్టుకొలత సగటు మనిషి నడుము కంటే చాలా లావుగా ఉండటం విశేషం.

36
నీటి అడుగున తిష్టవేసే నిశాచర వేటగాడు
Image Credit : chatgpt

నీటి అడుగున తిష్టవేసే నిశాచర వేటగాడు

గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికాలోని అమెజాన్, ఒరినోకో నదీ ప్రాంతాలలో, మందకొడిగా పారే ప్రవాహాలు, చిత్తడి నేలల్లో నివసిస్తాయి. ఇవి రాత్రిపూట సంచరించే నిశాచర జీవులు. నీటిలో చాలా సునాయాసంగా ఈత కొట్టగలవు. ప్రకృతి వీటి శరీర నిర్మాణాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసిందంటే.. వీటి కళ్ళు, ముక్కు రంధ్రాలు సరిగ్గా తల పైభాగంలో ఉంటాయి. దీనివల్ల శరీరం మొత్తాన్ని నీటి అడుగున దాచేసి, కేవలం కళ్ళు మాత్రమే బయటకు ఉంచి వేటను ఏమార్చగలవు.

46
వేటా మొదలు పెడితే అంతే సంగతి..
Image Credit : Gemini AI

వేటా మొదలు పెడితే అంతే సంగతి..

అనకొండలకు ఎటువంటి విషం ఉండదు. కానీ వీటి వేటాడే పద్ధతి చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి కాన్‌స్ట్రిక్టర్లు రకానికి చెందినవి. అంటే..

1. స్ట్రాంగ్ గ్రిప్: ముందుగా తమ పదునైన, బలమైన దవడలతో వేటను గట్టిగా పట్టుకుంటాయి.

2. మరణ పాశం: తక్షణమే జంతువు శరీరం చుట్టూ తమ భారీ రక్షస శరీరాన్ని చుట్టేస్తాయి.

3. శ్వాస ఆడకుండా చేయడం: జంతువు ప్రతిసారీ శ్వాస బయటకు వదిలినప్పుడు అనకొండ తన పట్టును మరింత బిగిస్తుంది. దీంతో వేటకు ఊపిరి అందక, గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోతుంది.

4. నిలువునా మింగేయడం: అనకొండల దవడ ఎముకలు విడిపోయే విధంగా ప్రత్యేకంగా అమర్చబడి ఉంటాయి. దీనివల్ల జింకలు, ఇతర జంతువులు, చివరికి కేమన్ జాతి మొసళ్ళను కూడా నమిలే అవసరం లేకుండా నిలువునా మింగేస్తాయి.

56
సినిమాలు వర్సెస్ రియాలిటీ: మనుషులను వేటాడుతాయా?
Image Credit : AI Image

సినిమాలు వర్సెస్ రియాలిటీ: మనుషులను వేటాడుతాయా?

హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా అనకొండలు మనుషులపై బడి దాడులు చేసి మింగేయడం సాధారణంగా జరగదు. ఈ జీవులు వీలైనంత వరకు మనుషులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి. అయితే అడవుల్లోకి వెళ్ళినప్పుడు లేదా చిత్తడి ప్రాంతాల్లో సంచరించేటప్పుడు వీటితో అప్రమత్తంగా ఉండటం మంచిది.

66
భూమి చరిత్రలోనే అతిపెద్ద రాకాసి పాము: టైటానోబోవా
Image Credit : stockPhoto

భూమి చరిత్రలోనే అతిపెద్ద రాకాసి పాము: టైటానోబోవా

ఇక పాముల చరిత్ర పుటలు తిరగేస్తే ఒక అద్భుతమైన జీవి కనిపిస్తుంది. కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై టైటానోబోవా అనే అతిపెద్ద పాము జీవించేది. శిలాజాల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనా వేసిన దాని ప్రకారం.. ఇది సుమారు 12 నుంచి 13 మీటర్ల పొడవు (సుమారు 40 అడుగులు) ఉండేది. అంటే నేటి గ్రీన్ అనకొండ కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉంటుంది. ఏది ఏమైనా, వర్తమాన ప్రపంచంలో పొడవులో రెటిక్యులేటెడ్ పైథాన్, బరువులో గ్రీన్ అనకొండ ప్రకృతి సృష్టించిన అద్భుతమైన జీవులుగా నిలుస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చింతించడం, బాధపడటం మధ్య తేడా ఏంటి.? ఈ క‌థ చ‌దివితే జీవ‌త సారం తెలుస్తుంది
Recommended image2
Snake: మ‌నిషి కంటే వేగంగా ప‌రిగెత్తే పాము.. దీని విషం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా.?
Recommended image3
Indian Village: ఈ గ్రామంలో ఇంకా రాజు పెత్తనమే కొనసాగుతోంది, భారత చట్టాలు ఇక్కడ పనిచేయవు
Related Stories
Recommended image1
Rakhi: అక్క లేదా చెల్లెలు లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? చరిత్ర చెప్పే నిజాలు ఇవే
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved