MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?

Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?

పాములంటే చాలామందికి భయం. కానీ వాటి జీవనశైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా 'పాములు కూడా మనలాగే స్నానం చేస్తాయా?' అనే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 28 2026, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాములు స్నానం చేస్తాయా?
Image Credit : AI Image

పాములు స్నానం చేస్తాయా?

పాములంటే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. ప్రపంచంలో పామును చూసి భయపడని వారుండరు… కనిపిస్తే చాలు పరుగు తీస్తుంటారు. పాములు విషపూరిత జంతువులు కాబట్టి ఇంతలా భయపడిపోతారు. అయితే భయంతో పాటే ఈ రహస్య జీవుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా జనాల్లో అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో 'పాములు కూడా మనలాగే స్నానం చేస్తాయా?' అనే ప్రశ్న తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇది స్నానం కాదు 'హైడ్రేషన్' ప్రక్రియ
Image Credit : AI Image

ఇది స్నానం కాదు 'హైడ్రేషన్' ప్రక్రియ

పాములకు నీటితో ప్రత్యేక సంబంధం ఉంది. కొన్ని జాతుల పాములు నీటిలో ఈదడం, సేద తీరడం చేస్తుంటాయి. కానీ దీన్ని మనం మనుషులు చేసే 'స్నానం'తో పోల్చలేమని నిపుణులు అంటున్నారు.

పాములు నీటిలోకి వెళ్లడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అవి తమ శరీరంలోని తేమను (Hydration) కాపాడుకోవడానికి నీటిని ఉపయోగిస్తాయి. పాముల చర్మం పొడిబారినట్లు అనిపించినా లేదా వాటి శరీరంలో నీటి శాతం తగ్గినా, అవి నీటిలో నానడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి.

34
పాములు నీటిలో సేదతీరతాయా?
Image Credit : AI Image

పాములు నీటిలో సేదతీరతాయా?

పాములు శీతల రక్త జీవులు (Cold-blooded animals)… అంటే వాటి శరీర ఉష్ణోగ్రత బయటి వాతావరణాన్ని బట్టి మారుతుంది. ముఖ్యంగా వేసవిలో కటిక ఎండలో లేదా అధిక వేడి ఉన్నప్పుడు తమ శరీరాన్ని చల్లబరుచుకోవడానికి పాములు చల్లని నీటి ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తాయి. ఇది వాటికి ఒకరకమైన 'థర్మల్ బాత్' లాంటిది.

సాధారణంగా పాములు వేసవి కాలంలో నీటిలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాయి. శరీర వేడిని తగ్గించుకోవడానికి చెరువులు, కాలువలు లేదా తేమ ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. కొన్ని పాములు గోరువెచ్చని నీటిలో పడుకోవడాన్ని కూడా ఇష్టపడతాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

44
చివరిగా చెప్పేదేంటంటే..
Image Credit : AI Image

చివరిగా చెప్పేదేంటంటే..

మొత్తం మీద చెప్పాలంటే, పాములు మనుషుల్లా సబ్బు పెట్టి స్నానం చేయకపోయినా, తమ ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి నీటిలో సమయం గడపడం వాటికి చాలా అవసరం. మొత్తంగా మనుషులు శుభ్రంగా ఉండేందుకు స్నానం చేస్తే పాములు ప్రాణాలు కాపాడుకునేందుకు స్నానం చేస్తాయన్నమాట.

గమనిక 

ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ కథనాల ఆధారంగా ఇచ్చాం. దీన్ని ఏదైనా శాస్త్రీయ ప్రయోగం తుది రిపోర్ట్ గా భావించకూడదు…. కేవలం అందుబాటులో ఉన్న సమాచారంగానే భావించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్డుపై ఎప్పుడైనా ఈ సింబల్‌ని గ‌మ‌నించారా.? చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Recommended image2
రోడ్లు వేసేందుకు వాడే నల్లటి తారు ఎలా తయారవుతుందో తెలుసా?
Recommended image3
Waterless Washing machine: చుక్క నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్.. దుస్తులు చక్కగా ఉతికి పొడిగానే అందిస్తుంది
Related Stories
Recommended image1
Snakes : పాముకు కాటేయడమే కాదు కాపాడటం తెలుసు.. ప్రాణాలు తీసే ఈ జీవులు ప్రాణం ఎలా పోస్తాయో తెలుసా?
Recommended image2
Snakes : వర్షాకాలంలోనే పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved