MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • USA Jobs: అమెరికాలో భారతీయులు ఎక్కువగా చేసే ఉద్యోగాలు ఏంటో తెలుసా?

USA Jobs: అమెరికాలో భారతీయులు ఎక్కువగా చేసే ఉద్యోగాలు ఏంటో తెలుసా?

USA Jobs: టెక్ జాబ్స్ మాత్రమే కాదు.. అమెరికాలో ఉన్న భారతీయ నిపుణులు, ఎన్‌ఆర్‌ఐ వర్గం అక్కడి ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో రాణిస్తున్నారు.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 28 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యూఎస్‌లో భారతీయుల ఉద్యోగాలు
Image Credit : chatgpt

యూఎస్‌లో భారతీయుల ఉద్యోగాలు

అమెరికా కల నెరవేర్చుకోవడం ఒకెత్తయితే.. అక్కడ ఏ ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలనేది మరొక ఎత్తు. మన దేశం నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు, నిపుణులు అమెరికా బాట పడుతుంటారు. మరి యూఎస్‌లో అడుగుపెట్టిన తర్వాత మనోళ్లు ఎక్కువగా ఏయే రంగాల్లో సెటిల్ అవుతున్నారు? కేవలం సాఫ్ట్‌వేర్ రంగమేనా లేక ఇతర రంగాల్లోనూ మనోళ్ల హవా నడుస్తోందా? అంటే.. అమెరికాలో మన భారతీయులు కేవలం ఒక్క రంగానికే పరిమితం కాకుండా టెక్నాలజీ, వైద్యం, ఫైనాన్స్, బిజినెస్ వరల్డ్‌లో టాప్ లెవెల్‌లో దూసుకెళ్తున్నారు. మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్(MPI), యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా అమెరికాలో భారతీయులు ఏ ఉద్యోగాలు ఎక్కువగా చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐటీ, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Image Credit : Chatgpt

ఐటీ, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

అమెరికాలో భారతీయుల పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది సాఫ్ట్‌వేర్ రంగమే. నిజానికి యూఎస్ ఐటీ విభాగానికి మనోళ్లే ప్రధాన బలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

• ముఖ్యమైన ఉద్యోగాలు: సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్లు, డేటా సైంటిస్టులు, AI/ML నిపుణులు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు.

• రంగం ప్రత్యేకత: అమెరికా మంజూరు చేసే H-1B వీసాల్లో దాదాపు 71% శాతం వీసాలు మన భారతీయులకే దక్కుతున్నాయి. అలాగే యూఎస్‌లోని మొత్తం సాఫ్ట్‌వేర్ డెవలపర్లలో సుమారు 16% మంది భారతీయ మూలాలు ఉన్నవారే కావడం విశేషం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాల్లో భారతీయులు కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు.

36
వైద్యం, ఆరోగ్య సంరక్షణ
Image Credit : Gemini AI

వైద్యం, ఆరోగ్య సంరక్షణ

అమెరికన్ల ఆరోగ్య సంరక్షణలో భారతీయ వైద్యుల పాత్ర అత్యంత కీలకమైనది. అక్కడి హెల్త్‌కేర్ సిస్టమ్‌లో మనోళ్లు లేకపోతే వ్యవస్థ నడవడం కష్టమనే రేంజ్‌లో మన ప్రభావం ఉంది.

• ముఖ్యమైన ఉద్యోగాలు: ఫిజిషియన్లు, సర్జన్లు, ఫార్మసిస్టులు, మెడికల్ పరిశోధకులు, రిజిస్టర్డ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులు.

• రంగం ప్రత్యేకత: అమెరికాలోని వలస వైద్యులు, సర్జన్లలో 21% నుండి 22% వరకు మన భారతీయులే ఉన్నారు. దాదాపు 59,000 మంది భారతీయ డాక్టర్లు అమెరికా ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు. అంటే అక్కడి ప్రతి 10 మంది డాక్టర్లలో ఒకరు మన భారతీయ మూలాలు ఉన్నవారే.

46
బిజినెస్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ లీడర్‌షిప్
Image Credit : Pixabay

బిజినెస్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ లీడర్‌షిప్

టెక్నాలజీ కోడింగ్ మాత్రమే కాదు, కంపెనీలను నడిపించే మేనేజ్‌మెంట్ స్థానాల్లోనూ భారతీయులు దుమ్మురేపుతున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన అనేకమంది యూఎస్ కార్పొరేట్ ప్రపంచాన్ని శాసిస్తున్నారు.

• ముఖ్యమైన ఉద్యోగాలు: ప్రొడక్ట్ మేనేజర్లు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, బిజినెస్ అనలిస్టులు, ఆపరేషన్స్ మేనేజర్లు, ఫైనాన్షియల్ ఆఫీసర్లు.

• రంగం ప్రత్యేకత: అనుభవంతో పాటు నైపుణ్యాలు పెంచుకుని అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీలకు సీఈఓ లుగా ప్రాతినిధ్యం వహించడంలోనూ భారతీయులు ముందు వరుసలో ఉన్నారు.

56
ఫైనాన్స్, బ్యాంకింగ్, వాల్ స్ట్రీట్
Image Credit : Asianet News

ఫైనాన్స్, బ్యాంకింగ్, వాల్ స్ట్రీట్

అమెరికా ఆర్థిక రాజధాని అయిన వాల్ స్ట్రీట్, ఇతర ప్రధాన బ్యాంకింగ్ కేంద్రాల్లో భారతీయులకు మంచి డిమాండ్ ఉంది.

• ముఖ్యమైన ఉద్యోగాలు: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు, ఫైనాన్షియల్ అనలిస్టులు, రిస్క్ మేనేజర్లు, సీపీఏ, సీపీఏ అకౌంటెంట్లు, స్టాక్ బ్రోకర్లు.

• రంగం ప్రత్యేకత: జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి దిగ్గజ ఫైనాన్షియల్ సంస్థల్లో పనిచేసే భారతీయ-అమెరికన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో ఉన్న మొత్తం భారతీయులలో 17% మంది అకౌంటింగ్, ఫైనాన్షియల్ విశ్లేషణ వంటి కీలక విధుల్లో ఉన్నారు.

66
విద్య, పరిశోధన, స్వయం ఉపాధి
Image Credit : Asianet News

విద్య, పరిశోధన, స్వయం ఉపాధి

విద్యా రంగంలోనూ, బిజినెస్ పరంగానూ భారతీయులు అమెరికాలో తమదైన ముద్ర వేస్తున్నారు. STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో దూసుకుపోతున్నారు.

• ఉద్యోగాలు, రంగాలు: టాప్ అమెరికన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, నాసా, బయోటెక్ సంస్థల్లో R&D శాస్త్రవేత్తలు, పోస్ట్-డాక్టోరల్ రీసెర్చర్లుగా సేవలందిస్తున్నారు. యూఎస్‌లోని పిహెచ్‌డి స్థాయి పరిశోధకులలో 12% మంది భారతీయులే.

• స్వయం ఉపాధి : ఉద్యోగాలే కాకుండా మోటెల్స్/హోటల్స్, గ్యాస్ స్టేషన్లు, కన్వీనియన్స్ స్టోర్లు, ఇండియన్ రెస్టారెంట్లు, ఐటీ కన్సల్టింగ్ ఏజెన్సీలు నడుపుతూ వేలాది మందికి భారతీయులు ఉపాధి కల్పిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. అమెరికాలో ఉన్న భారతీయ కమ్యూనిటీలో 70% కంటే ఎక్కువ మంది మేనేజ్‌మెంట్, బిజినెస్, సైన్స్ వంటి ప్రొఫెషనల్ రంగాల్లోనే పనిచేస్తున్నారు. ఒకప్పుడు భారతీయులు అంటే కేవలం ఐటీ ఉద్యోగాలు అనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు డాక్టర్ల నుంచి బిజినెస్ లీడర్ల వరకు, సైంటిస్టుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల వరకు అన్ని రంగాల్లోనూ అమెరికాలో మనోళ్లు జెండా పాతారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు వేసేందుకు వాడే నల్లటి తారు ఎలా తయారవుతుందో తెలుసా?
Recommended image2
Waterless Washing machine: చుక్క నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్.. దుస్తులు చక్కగా ఉతికి పొడిగానే అందిస్తుంది
Recommended image3
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Related Stories
Recommended image1
World's Largest Snake: బాబోయ్ 250 కేజీల పామా? ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏదో తెలుసా?
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved