MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Snakes : వర్షాకాలంలోనే పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి..?

Snakes : వర్షాకాలంలోనే పాములు ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి..?

Snakes : సాధారణంగా వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి ఎక్కువగా వస్తుంటాయి. బొరియల్లో ఉండే పాములు బయటకు ఎందుకు వస్తాయి..? పాముకాటు కేసులు ఎందుకు ఎక్కువగా నమోదు అవుతుంటాయి..?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 02 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వర్షాకాలంలో పాముల బెడద..
Image Credit : Gemini AI

వర్షాకాలంలో పాముల బెడద..

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. ఇళ్లలోకి కూడా ఎక్కువగా పాములు వస్తుంటాయి... అందుకే పాముకాటు కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. మరి వర్షాకాలంలోనే పాములు ఎక్కువగా బయటకు ఎందుకు వస్తాయి? పాముకాటు మరణాలు ఎక్కువగా ఎందుకుంటాయి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బొరియల్లోకి నీరు చేరడం..
Image Credit : AI image

బొరియల్లోకి నీరు చేరడం..

వర్షాకాలంలో పాములు తమ స్థావరాలను కోల్పోయి ఆశ్రయం లేకుండా అయిపోతాయి. భారీ వర్షాల కారణంగా పాములు నివాసముండే బొరియలు, పుట్టల్లోకి వరదనీరు చేరుతుంది. దీంతో వాటికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది... ప్రాణాలను కాపాడుకోవడానికి అవి బయటకు వస్తాయి. ఈ క్రమంలో వెచ్చగా ఉండే ఇళ్లలోకి చేరతాయి.

Related Articles

Related image1
Snakes Village : ఈ ఊరంతా పాములే పాములు.. ప్రతి ఇంట్లో నాగుపాముల కోసమే ప్రత్యేక గది..!
Related image2
Snakes Food : పాములు కప్పలనే ఎందుకంత ఇష్టంగా తింటాయి..?
36
అహారం కోసం బయటకు...
Image Credit : Gemini AI

అహారం కోసం బయటకు...

వర్షాకాలంలో ఇంటిచుట్టూ వర్షపు నీరు చేరుతుంది... అందులోకి కప్పలు చేరతాయి. అంతేకాదు ఇళ్లలో ఎలుకలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటికోసం పాములు ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి... కొన్ని ఇళ్లలోకి వచ్చి భయోత్పాతం సృష్టిస్తాయి.

46
ఉష్ణోగ్రతల మార్పులు...
Image Credit : Gemini AI

ఉష్ణోగ్రతల మార్పులు...

పాములు శీతల రక్త జీవులు... అంటే చల్లని రక్తాన్ని కలిగివుంటాయి. అందుకే బొరియల్లో నివాసం ఉంటాయి... అయితే వర్షాకాలంలో వాటిలో తేమ ఎక్కువ అవుతుంది కాబట్టి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి తేమ లేని పొడి ప్రదేశాలను తరలివెళతాయి. ఈ క్రమంలోనే కొన్ని ఇళ్లలోకి చేరతాయి.

56
సంతానోత్పత్తి కోసం...
Image Credit : Gemini AI

సంతానోత్పత్తి కోసం...

కొన్ని పాములు గుడ్లు పెట్టడానికి, పిల్లలను కనడానికి పొడి వాతావరణం, సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని పాములు ఇళ్లలోకి చేరతాయి. ఇంటి పరిసరాల్లో దట్టమైన పొదలు, గుబురుగా ఉండే చెట్లే ఉన్నా వాటిలోకి చేరతాయి.. కాబట్టి వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

66
పాములు ఇంట్లోకి రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకొండి..
Image Credit : Stock Photo

పాములు ఇంట్లోకి రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకొండి..

వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి రాకుండా ఉండాలంటే చుట్టుపక్కల వాటికి అనుకూలమైన పరిస్థితులు లేకుండా జాగ్రత్తపడాలి. అంటే ఇంటిచుట్టు కన్నాలు, బొరియలు ఉంటే వాటిని వెంటనే మూసేయాలి. అలాగే ఇంటిచుట్టు గడ్డి దట్టంగా పెరగకుండా చూసుకోవాలి.

ఇంటి పరిసరాల్లో చెత్త వేయరాదు... మురీముఖ్యంగా మాంసాహారం వంటివి పారవేయకూడదు. ఇలా చేస్తే వాటిని తినేందుకు ఎలుకలు, పందికొక్కులు వస్తుంటాయి. వీటిని తినేందుకు పాములు వస్తుంటాయి. కాబట్టి పరిసరాల్లో అహారానికి సంబంధించిన చెత్త వేయలేదు.

ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటే వెచ్చగా ఉంటుంది... వాటిచాటున పాములు తిష్ట వేయవచ్చు. కాబట్టి ఇంట్లో వస్తువులను చిందరమందరగా పెట్టకూడదు… అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. 

ఇంట్లోకి వచ్చే మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మూత పెట్టి ఉంచాలి. వీటిద్వారా పాములు ఇళ్లలోకి చేరవచ్చు. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటి పరిసరాల్లో కుక్కల షెడ్లు, కోళ్ల గూళ్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం మిగిలిపోతే వాటిని తినడానికి ఎలుకలు వస్తాయి. ఆ ఎలుకలను వేటాడేందుకు పాములు వస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Snakes Village : ఈ ఊరంతా పాములే పాములు.. ప్రతి ఇంట్లో నాగుపాముల కోసమే ప్రత్యేక గది..!
Recommended image2
Snakes Food : పాములు కప్పలనే ఎందుకంత ఇష్టంగా తింటాయి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved