MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Rakhi Special Songs: అన్నాచెల్లెలి ప్రేమానుబంధానికి కేరాఫ్ అడ్రస్.. రాఖీ పండుగ స్పెషల్ టాప్ 5 హిట్ సాంగ్స్ !

Rakhi Special Songs: అన్నాచెల్లెలి ప్రేమానుబంధానికి కేరాఫ్ అడ్రస్.. రాఖీ పండుగ స్పెషల్ టాప్ 5 హిట్ సాంగ్స్ !

Raksha Bandhan Special Songs: తెలుగు సినీ పరిశ్రమలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంగా వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి. ఈ రాఖీ పండుగ వేళ మీ ప్లేలిస్ట్‌లో తప్పక ఉండాల్సిన టాప్ 5 మ్యాజికల్ తెలుగు హిట్ పాటలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 28 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రక్షాబంధన్ మెలోడీస్: వినగానే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు నిలిచే హిట్ సాంగ్స్
Image Credit : Chatgpt

రక్షాబంధన్ మెలోడీస్: వినగానే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు నిలిచే హిట్ సాంగ్స్

రాఖీ పండుగ అంటేనే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే మాటల్లో చెప్పలేని ఆప్యాయత, తీపి జ్ఞాపకాల సమ్మేళనం. చిన్నప్పుడు పంచుకున్న చిలిపి అల్లర్లు, చిన్న చిన్న గొడవలు, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన క్షణాలన్నీ ఈ ఒక్క రోజు మళ్లీ కళ్లముందు మెదులుతాయి. మన తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ పవిత్రమైన బంధానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వెండితెరపై చాలా సినిమాల్లో చూపించాయి. టాలీవుడ్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌ను అద్భుతంగా ఆవిష్కరించాయి. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేకమైన పాటలు వింటే హృదయాలు భావోద్వేగంతో నిండిపోతాయి. ఈ రక్షాబంధన్ వేళ మీ ప్లేలిస్ట్‌లో తప్పక ఉండాల్సిన టాప్ 5 ఆల్‌టైమ్ ఫేవరెట్ తెలుగు పాటల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. అన్నయ్య అన్నావంటే (అన్నవరం)
Image Credit : Annavaram

1. అన్నయ్య అన్నావంటే (అన్నవరం)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సంధ్య అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘అన్నవరం’ చిత్రంలోని ఈ పాట ప్రతి రాఖీ పండుగకు రీసౌండ్ ఇస్తుంది. రమణ గోగుల సంగీత దర్శకత్వంలో గంగా ఆలపించిన ఈ పాటకి చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. చెల్లెలు తన అన్నయ్యను రక్షకుడిగా భావిస్తూ పాడే ఈ పాటలో, అన్నయ్య తన చెల్లి సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడనే బలమైన సందేశం ఉంటుంది. మాస్ అండ్ ఎమోషనల్ వైబ్‌తో సాగే ఈ ట్రాక్ రాఖీ వేడుకలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్.

36
2. కన్నీళ్లకే కన్నీరొచ్చే (హిట్లర్)
Image Credit : Asianet News

2. కన్నీళ్లకే కన్నీరొచ్చే (హిట్లర్)

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే కుటుంబ కథా చిత్రం ‘హిట్లర్’. తల్లిదండ్రులు లేని ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా, తండ్రి బాధ్యతను మోసే అన్నయ్య ఆవేదనను, ప్రేమను ఈ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం కంటికి కట్టినట్లు చూపుతుంది. కోటి కంపోజ్ చేసిన ఈ మెలోడీని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, సుజాత, అనుపమ, రేణుకలు అద్భుతంగా ఆలపించారు. ఈ పాట వింటే ఎంతటి వారికైనా కన్నీళ్లు ఆగవంటే అతిశయోక్తి కాదు.

46
3. అన్నా చెల్లెలి అనుబంధం (గోరింటాకు)
Image Credit : Instagram/__nithin_editz__

3. అన్నా చెల్లెలి అనుబంధం (గోరింటాకు)

రాజశేఖర్, మీరా జాస్మిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గోరింటాకు’ చిత్రం అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌కి కేరాఫ్ అడ్రస్. ఎస్.ఏ. రాజ్‌కుమార్ అందించిన స్వరాలకు అభినయ శ్రీనివాస్ రాసిన సాహిత్యం ప్రాణం పోసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర గాత్రంలో వచ్చిన ఈ పాట, చెల్లెలికి అన్నయ్య ఇచ్చే అభయం, వారిద్దరి మధ్య ఉండే పవిత్రమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. కుటుంబ సమేతంగా రాఖీ వేడుకలు జరుపుకునే వేళ ఈ పాట వినడం ఒక మరపురాని అనుభూతి.

56
4. చామంతి పూబంతి (పుట్టింటికి రా చెల్లి)
Image Credit : Instagram/darling_vannur

4. చామంతి పూబంతి (పుట్టింటికి రా చెల్లి)

అర్జున్, మధుమిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పుట్టింటికి రా చెల్లి’ చిత్రంలోని ఈ పాట చెల్లెలి మనసులోని ఆవేదనను, పుట్టింటి మీద ఉన్న మమకారాన్ని తెలియజేస్తుంది. శ్రీహర్ష రాసిన ఈ పాటకు ఎస్.ఏ. రాజ్‌కుమార్ బాణీలు అందించగా, నైటింగేల్ కె.ఎస్. చిత్ర తమ స్వరంతో మైమరిపించారు. పెళ్లై అత్తారింటికి వెళ్లిన చెల్లెలు తన అన్నయ్యను, సొంత ఇంటిని గుర్తుచేసుకుంటూ పాడే ఈ పాట రాఖీ రోజున ప్రతీ చెల్లెలి హృదయాన్ని తాకుతుంది.

66
5. అందాల చిన్ని దేవత (శివరామరాజు)
Image Credit : Instagram/Geminitv

5. అందాల చిన్ని దేవత (శివరామరాజు)

జగపతిబాబు, వెంకట్, శివాజీ అన్నదమ్ములుగా, మౌనిక చెల్లెలిగా నటించిన ‘శివరామరాజు’ చిత్రంలోని ‘అందాల చిన్ని దేవత’ పాట అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే నిస్వార్థమైన ప్రేమకు నిదర్శనం. చెల్లెలిని ఇంటి దేవతలా భావించే అన్నదమ్ముల అనురాగాన్ని చిర్రావూరి విజయ్‌కుమార్ చక్కని పదాలతో వర్ణించారు. ఎస్.ఏ. రాజ్‌కుమార్ మ్యూజిక్‌లో శంకర్ మహదేవన్, సుజాత పాడిన ఈ పాట రాఖీ పండుగ రోజున ఇంట్లో పండుగ వాతావరణాన్ని, సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

ఈ ఐదు పాటలు కేవలం వెండితెరపై మెరిసిన స్వరాలు మాత్రమే కావు.. తరాలు మారినా చెరిగిపోని అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image2
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Recommended image3
Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
Rakhi: అక్క లేదా చెల్లెలు లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? చరిత్ర చెప్పే నిజాలు ఇవే
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved