MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Tooth Powder: 90s లో పళ్ళు తోమడానికి వాడే పళ్లపొడి గుర్తుందా? ఇప్పటికీ అవి వాడుతున్నారా?

Tooth Powder: 90s లో పళ్ళు తోమడానికి వాడే పళ్లపొడి గుర్తుందా? ఇప్పటికీ అవి వాడుతున్నారా?

Tooth Powder: 90s కిడ్స్ ఎవరికైనా గుర్తుండి ఉంటుంది. చిన్నతనంలో పళ్లు తొమడానికి ఉపయోగించే పళ్లపొడులు గుర్తున్నాయా. పేపర్ ప్యాకెట్స్ , కోల్గేట్,డాబలర్ లాల్ లాంటి పళ్లపొడుల గురించి ఒక్క సారి గుర్తు చేసుకుందాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 17 2026, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చూపుడు వేలితో పళ్లు తోముకున్న రోజులు..
Image Credit : Gemini AI

చూపుడు వేలితో పళ్లు తోముకున్న రోజులు..

90ల కాలంలో ఉదయాన్నే లేవగానే పళ్లపొడితో పళ్లు తోముకోవడం ఓ జ్ఞాపకం. ముఖ్యంగా పల్లెటూర్లలో ఎటువంటి బ్రష్ లేకుండా పేపర్ ప్యాకెట్స్ లో వచ్చే తియ్యటి బూడిద పళ్లపొడి, లేదా వేప పుల్లలతో పళ్లు తోమిన రోజులు చాలామందికి గుర్తుండే ఉంటేంది. ఇంకాస్త ముందుకు వెళ్తే.. టీవీ ప్రకటనల్లోవచ్చేవి.. ఇంట్లోని పెద్దల చేతుల్లో కనిపించే 'పళ్లపొడి' (Tooth Powder) ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకం. నాటి రోజుల్లో పేస్ట్‌ల కంటే పళ్లపొడితో పళ్లు తోముకోవడమే భారతీయులకు ఒక అలవాటుగా ఉండేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
90వ దశకంలో వినియోగించిన పళ్లపొడుల రకాలు
Image Credit : Gemini AI

90వ దశకంలో వినియోగించిన పళ్లపొడుల రకాలు

90s కిడ్స్ కు పళ్లపొడులు మర్చిపోలేని జ్ఞాపకం. ప్రస్తుతం కాస్ట్లీ టూత్ పేస్ట్ లు తయారు చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు..అప్పట్లో ఫౌడర్లే తయారు చేసేవి. అందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది కోల్గేట్ టూత్ పౌడర్ (Colgate Tooth Powder) గురించి. కోల్గేట్ పళ్లపొడి... తెల్లటి పళ్లకు శ్రీరామరక్ష" అని వచ్చిన టీవీ ప్రకటనలతో తెల్లటి, ఎర్రటి డబ్బాల్లో లభించే ఈ పళ్లపొడి ప్రతీ ఇంట్లో ఉండేది. దీని తర్వాత పెద్దలు ఎక్కువగా వాడే మరో పళ్లపొడి డాబర్ రెడ్ టూత్ పౌడర్ (Dabur Red Tooth Powder). లవంగం, కర్పూరం, ఘాటైన మూలికల మిశ్రమంతో కూడిన ఈ ఎర్రటి పళ్లపొడి చిగుళ్ల దృఢత్వానికి ఎంతో పేరుగాంచింది. ఈ రెండింటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వీటితో పాటు మంకీ బ్రాండ్ బ్లాక్ టూత్ పౌడర్ (Monkey Brand) కూడా వాడుకలో ఉండేది. నల్లటి బొగ్గు పొడితో చేసే ఈ పళ్లపొడి 90ల ఐకానిక్ ఉత్పత్తుల్లో ఒకటి. పళ్లను తెల్లగా మెరిపించడానికి దీనిని ఎక్కువగా వాడేవారు.

Related Articles

Related image1
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Related image2
Savitri: సావిత్రిని ఆ పరిస్థితుల్లో చూసి బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
34
పళ్లు తోమడానికి పల్లెటూరి చిట్కాలు
Image Credit : Gemini AI

పళ్లు తోమడానికి పల్లెటూరి చిట్కాలు

పట్టణాలలో ఇటువంటి కంపెనీ టూత్ ఫౌడర్ డబ్బాలు వాడితే, గ్రామాల్లో సహజమైన పద్ధతులను అనుసరించేవారు. మసి పొడి / బొగ్గు పొడి ని వినియోగించేవారు. కట్టెల పొయ్యి మసి లేదా బొగ్గును పొడి చేసి వేలితో తోముకునేవారు. అంతే కాదు ఉప్పును కొద్దిగా ఆవనూనెతో కలిపి చిగుళ్లను మసాజ్ చేస్తూ పళ్లు తోముకునేవారు.

అన్నింటికంటే ఎక్కువగా.. పల్లెటూరిలో వేపపుల్ల కానీ, గానుగ చెట్టు పుల్ల కానీ నమిలి దాంతోనే బ్రష్ చేయడం లేదా వేపాకు, లవంగాల పొడిని వాడటం గ్రామాల్లో సర్వసాధారణం. ఇప్పటికీ వీటిని పల్లెటూరిలో వాడుతూనే ఉన్నారు.

44
ఇప్పుడు కూడా పళ్లపొడిని వాడుతున్నారా?
Image Credit : Gemini AI

ఇప్పుడు కూడా పళ్లపొడిని వాడుతున్నారా?

పళ్లపొడులు పూర్తిగా కనుమరుగవ్వలేదు. ఇప్పటికీ కొంత మంది పెద్దలు ఈ పొడులను వాడుతున్నారు. ముఖ్యమంగా డాబర్ రెడ్ ఫౌడర్ వంటి బ్రాండ్లు ఇప్పటికీ సూపర్‌మార్కెట్లు, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కెమికల్స్ (SLS, ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ నురుగు) లేని సహజ ఉత్పత్తుల పై అవగాహన పెరగడంతో చార్కోల్ (Charcoal) పౌడర్లు, ఆయుర్వేద దంతమంజన్ ఉత్పత్తులకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వృద్ధులు , 90 స్ సీనియర్స్ పేస్ట్ కంటే ఉప్పు-పళ్లపొడి లేదా వేలితో దంతమంజన్ వాడటానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆధునిక పేస్ట్‌లు మార్కెట్‌ను ఏలుతున్నప్పటికీ, 90ల నాటి పళ్లపొడి ఇచ్చే సహజమైన తాజాదనం, జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Recommended image2
Savitri: సావిత్రిని ఆ పరిస్థితుల్లో చూసి బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved