MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?

Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?

మనం సాధారణంగా జైలులో చిప్పకూడు పెడతారనే మాట తరచూ వింటుంటాం. మరి నిజానికి జైలు ఫుడ్ ఎలా ఉంటుంది? ఖైదీలకు ఎలాంటి అహారం పెడతారు? టైమింగ్స్ ఎలా ఉంటాయి? తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 29 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జైల్లో ఎలాంటి ఫుడ్ పెడతారు?
Image Credit : Gemini AI

జైల్లో ఎలాంటి ఫుడ్ పెడతారు?

జైలు జీవితం అంటే శిక్ష... తప్పు చేసినవారిని శిక్షించేందుకు జైల్లో పెడతారు. అందుకే జైలు పేరు వింటేచాలు చాలామంది బయపడుతుంటారు. అయితే జైలు అనేది జీవితంలో చాలా పాఠాలను నేర్పిస్తుందని... మరిచిపోలేని అనుభవాలను ఇస్తుందని చాలామంది చెబుతుంటారు. కఠిన నిబంధనలు, కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండటం, సమాజంలో పరువు పోవడం వంటివి పక్కనబెడితే జైలు క్రమశిక్షణగా ఎలా జీవించాలో నేర్పిస్తుందని వెళ్లివచ్చినవాళ్లు చెబుతారు. ముఖ్యంగా మనం బైట ఉన్నప్పుడు సమయపాలన అస్సలు పాటించం... కానీ జైల్లో మాత్రం కచ్చితంగా ప్రతిదానికి ఓ టైమ్ ఉంటుంది, దాన్ని తప్పకుండా పాటించాల్సిందే.

ఇక ఫుడ్ విషయంలో జైలులో ఉన్నంత డైట్ ప్లాన్ ఎక్కడా ఉండదని చాలామంది చెబుతుంటారు. టైమ్ టు టైమ్ ఓ మనిషికి సరిపోయే పోషకాలతో అహారం లభించేది జైల్లో మాత్రమే. మరి ఉదయం నుండి రాత్రి వరకు జైల్లోని ఖైదీల ఫుడ్ టైమింగ్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్ అందిస్తారు? అనేది ఇక్కడి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జెల్లోని ఖైదీల ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి?
Image Credit : ChatGPT

జెల్లోని ఖైదీల ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి?

ఇండియాలో జైళ్ళ నిర్వహణ అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశం. కాబట్టి ఒక్కో రాష్ట్రంలో జైలు నిబంధనలు ఒక్కోలా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) లోని జైళ్ల నిబంధనలు ఎలా ఉంటాయో చూద్దాం.

ఉదయం సూర్యోదయానికి ముందే ఖైదీలందరు నిద్ర లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్ చేయగానే టీ రెడీగా ఉంటుంది. ఇలా ఉదయం 6 గంటలకే ఖైదీలకు టీ ఇస్తారు... డాక్టర్ల సూచన లేదా కోర్డు అనుమతితో కొందరు ఖైదీలకు పాలు కూడా అందిస్తారు. టీతో పాటు బ్రెడ్ కూడా అందిస్తారు.

ఇక 7 నుండి 7.30 గంటలోపే ఖైదీలకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తారు. తర్వాత 11 నుండి 11.45 గంటలకు భోజనం ఉంటుంది. మధ్యలో 12. నుండి 1 గంట మధ్య మళ్లీ టీ బ్రేక్ ఉంటుంది. సాయంత్రం 5 నుండి 5.45 లోపు అందరు ఖైదీల డిన్నర్ పూర్తవుతుంది. అంటే ఖైదీలు పడుకునేలోపే తిన్నది అరిగిపోతుంది. ఇలా పర్పెక్ట్ టైమింగ్ తో ఖైదీలకు భోజనం అందుతుంది.

35
ఖైదీలకు ఎలాంటి భోజనం పెడతారు?
Image Credit : Gemini AI

ఖైదీలకు ఎలాంటి భోజనం పెడతారు?

జైల్లో ఖైదీలకు ఉదయం టీ అందిస్తారు.. తర్వాత అల్పాహారం ఉంటుంది… ఇందులో చపాతి, ఇడ్లి, ఉప్మా వంటి టిఫిన్స్ అందిస్తారు. కొన్ని జైళ్లలో పులిహోర కూడా పెడతారు. ఇలా ఉదయమే టైమ్ కి టీ, టిఫిన్ తినేస్తారు ఖైదీలు.

మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, సాంబార్ లేదా చారు ఉంటుంది. వీటితోపాటు రోజుకో రకమైన కూర పెడతారు. పప్పు కూడా ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది... కంది, శనగ, మినపపప్పు మార్చిమార్చి పెడతారు. కొన్ని జైళ్ళలో చపాతి కూడా పెడతారు. ఇక ఆదివారం చికెన్, మటన్... బుధవారం కోడిగుడ్డు పెడతారు. కోర్డు అనుమతితో ఇంటి నుండి కూడా భోజనం తెచ్చుకోవచ్చు.

లంచ్, డిన్నర్ మధ్యలో మరో టీ బ్రేక్ ఉంటుంది. ఇక రాత్రి భోజనంలో అన్నం, రసం లేదా సాంబార్ ఉంటుంది. సాయంత్రం 5 నుండి 5.45 లోపు అందరు ఖైదీలు డిన్నర్ పూర్తిచేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక డైట్ ఉంటుంది... స్పెషల్ ఫుడ్ అందిస్తారు.

45
పండగలకు స్వీట్స్, పండ్లు
Image Credit : AI

పండగలకు స్వీట్స్, పండ్లు

జైల్లోని ఖైదీలకు కొన్ని పండగలకు ప్రత్యేకంగా స్వీట్స్ అందిస్తారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలోనూ స్వీట్స్ ఇస్తారు. ఇక బ్రెడ్, పండ్లు వంటివాటిని అనుమతిస్తారు. కొన్ని సెంట్రల్ జైళ్ళలో సూపర్ మార్కెట్స్ ఉంటాయి... ఇక్కడ అహార పదార్థాలు కొనుక్కుని తినే వెసులుబాటు ఉంటుంది.

55
జైల్లో నాణ్యమైన అహారం ఖైదీల హక్కు
Image Credit : Gemini

జైల్లో నాణ్యమైన అహారం ఖైదీల హక్కు

భారత రాజ్యాంగం ప్రకారం ఆహారం అనేది ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు. జైళ్లలో ఉన్న ఖైదీల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. 2016 మోడల్ ప్రిజన్ మాన్యువల్ ప్రకారం ఖైదీలకు పోషక విలువలతో కూడిన, పరిశుభ్రమైన ఆహారం అందించాలి. రోజుకు కనీసం 2400 క్యాలరీల ఆహారం లభించేలా చూడాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు చాలా జైళ్లలో పాటించడం లేదు… అనేక సందర్భాల్లో, ఆహార పదార్థాల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల నాణ్యత దెబ్బతింటుందని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

నిబంధనలు ఉన్నప్పటికీ అనేక జైళ్లలో ఖైదీలకు లభించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత చాలా దారుణంగా ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటం, ఆహార పదార్థాల కొనుగోలులో పారదర్శకత లేకపోవడం ప్రధాన సమస్యలు. జైళ్లలో ఆహారాన్ని వండే సిబ్బందికి సరైన శిక్షణ ఉండదు. అంతేకాకుండా వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, పారిశుద్ధ్య లోపాలు సాధారణం. ఇటువంటి వాతావరణంలో తయారైన ఆహారం ఖైదీల ఆరోగ్యానికి హానికరం. మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్స్ ఈ సమస్యలను తరచుగా ప్రస్తావిస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు వేసేందుకు వాడే నల్లటి తారు ఎలా తయారవుతుందో తెలుసా?
Recommended image2
Waterless Washing machine: చుక్క నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్.. దుస్తులు చక్కగా ఉతికి పొడిగానే అందిస్తుంది
Recommended image3
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Related Stories
Recommended image1
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image2
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved