MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Drive Through ATM: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?

Drive Through ATM: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?

Drive Through ATM: ఒకప్పుడు బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఫోన్‌లోనే అన్నీ అయిపోతున్నాయి. మరి రోడ్డు మీదనే మీకు డబ్బుల బాక్సులు కనిపిస్తే..? కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకునే పద్ధతి మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 25 2026, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కారులోంచి బయటకు దిగకుండానే బ్యాంకింగ్ సేవలు..
Image Credit : Asianet News

కారులోంచి బయటకు దిగకుండానే బ్యాంకింగ్ సేవలు..

సాంకేతికత, సౌకర్యం జతకలిస్తే మానవ జీవితం ఎంత సులభతరమవుతుందో చెప్పడానికి అమెరికాలోని బ్యాంకింగ్ వ్యవస్థ ఒక గొప్ప నిదర్శనం. నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను తొలగిస్తూ, వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడంలో పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిందే 'డ్రైవ్-త్రూ ATM' (Drive-Through ATM) విధానం. సాధారణంగా మనం షాపింగ్ మాల్స్‌లోనో లేక రెస్టారెంట్లలోనో డ్రైవ్-త్రూ సేవలను చూస్తుంటాం. కానీ కారులోంచి బయటకు దిగకుండానే బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసే ఈ పద్ధతి అక్కడి ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డ్రైవ్ త్రూ ATM ఎలా పనిచేస్తుంది?
Image Credit : Asianet News

డ్రైవ్ త్రూ ATM ఎలా పనిచేస్తుంది?

డ్రైవ్ త్రూ ఏటీఎంలు ప్రత్యేకంగా వాహనదారుల సౌకర్యార్థం డిజైన్ చేయబడతాయి. ఒక లేన్ గుండా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, నేరుగా ఏటీఎం మిషన్ పక్కన ఆపవచ్చు. కారు విండో (అద్దం) కిందకు దించి, సీట్లో కూర్చునే లావాదేవీలన్నీ పూర్తి చేయవచ్చు. సాధారణ ఏటీఎంలాగే డెబిట్/క్రెడిట్ కార్డును మిషన్‌లో ఉంచి, పిన్ నంబర్ నమోదు చేసి కావాల్సిన నగదును డ్రా (Cash Withdrawal) చేయవచ్చు. అంతేకాదు, కేవలం డబ్బులు తీసుకోవడమే కాకుండా, మన ఖాతాలో డబ్బులు వేయడం, చెక్కులను డిపాజిట్ (Cash & Check Deposit) చేయడం కూడా కారు దిగకుండానే చేసేయవచ్చు. మిషన్ లోపల నోట్లను లేదా చెక్కును ఉంచితే, అది వెంటనే స్కాన్ చేసి ఖాతాలో జమ చేస్తుంది.

Related Articles

Related image1
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Related image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
34
ఈ విధానం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు
Image Credit : Asianet News

ఈ విధానం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు

సమయం ఆదా

బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి అక్కడ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. పార్కింగ్ స్థలం కోసం వెతకాల్సిన పనిలేదు. కారు నిలిపి, కిందకు దిగి, లైనులో నిలబడే అవసరం ఉండదు కాబట్టి సమయం చాలా ఆదా అవుతుంది.

వాతావరణ నుంచి రక్షణ

అమెరికాలో తీవ్రమైన చలి, మంచు వర్షం (Snowfall) తో పాటు భారీ వర్షాలు పడే సమయాల్లో కారులోంచి బయటకు రావడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి సమయాల్లో ఈ డ్రైవ్-త్రూ ఏటీఎంలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

భద్రత - సౌకర్యం

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వాహనం దిగి ఏటీఎం వద్దకు వెళ్లడం కంటే, లాక్ చేసిన కారులోనే కూర్చుని లావాదేవీలు నిర్వహించడం ఎంతో సురక్షితం.

వికలాంగులు - వృద్ధులకు ప్రయోజనం

మరీ ముఖ్యంగా దివ్యాంగులకు, వయసు పైబడి నడవలేని వారికి, పసిపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఇది ఒక వరమని చెప్పవచ్చు. ఇలాంటి వారు ఎటువంటి భయం లేకుండా కారులో ఉండే డబ్బులు డ్రా చేసుకోండం, క్రెడిట్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు.

44
ఇండియాలో ఇది సాధ్యమేనా..?
Image Credit : Gemini AI

ఇండియాలో ఇది సాధ్యమేనా..?

ఆధునిక జీవనశైలిలో సమయానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి రూపుదిద్దుకున్న ఈ డ్రైవ్-త్రూ బ్యాంకింగ్ విధానం వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం. డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ రంగానికి ఇటువంటి వినూత్న ఆలోచనలు మరింత ఊతాన్ని ఇస్తున్నాయి. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి డ్రైవ్-త్రూ సేవల వినియోగం పెరిగితే, ప్రజలకు మరిన్ని సులభతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. మరి మన దగ్గర ఇది సాధ్యమేనా..?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వ్యాపారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Temples in North India: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. ఉత్తర భారతంలో ఈ 5 దివ్య క్షేత్రాలు చూశారా?
Recommended image2
Train : రైలులో నాన్ స్టాప్ గా వాటర్ సప్లై అవుతుంది.. అసలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?
Recommended image3
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Related Stories
Recommended image1
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved