- Home
- Entertainment
- Nagarjuna: వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది, నాగార్జునని ఏకిపారేసిన అన్వేష్..వెధవలు స్కూల్స్ కి వెళ్లడం ఏంటి ?
Nagarjuna: వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది, నాగార్జునని ఏకిపారేసిన అన్వేష్..వెధవలు స్కూల్స్ కి వెళ్లడం ఏంటి ?
కింగ్ నాగార్జున హౌస్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 షోపై యూట్యూబర్ అన్వేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాగార్జున పై అన్వేష్ చేసిన విమర్శలు వివాదం అయ్యేలా ఉన్నాయి.

నాగార్జున
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయింది. తొలి వారంలోనే హౌస్ లో హోరాహోరీ పోరు మొదలైంది. బిగ్ బాస్ షోపై ప్రతి సీజన్ లో ట్రోలింగ్ జరగడం సాధారణమే. కొందరు ప్రముఖులు బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ షో చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర వివాదం అవుతుంటాయి.
స్కూల్స్ కి వెళ్లి ప్రచారం
బిగ్ బాస్ షోలో తమకి కావలసిన వారిని, అభిమానించే వారిని గెలిపించుకోవడం కోసం బయట ఉన్న వాళ్ళు తీవ్రంగా క్యాంపెనింగ్ చేస్తుంటారు. ఆ ప్రచారం ప్రతి సీజన్ కి కొత్త పుంతలు తొక్కుతోంది. ఈసారి కొందరు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కూడా ప్రచారం చేస్తున్నారట. బిగ్ బాస్ 10లో తమకి కావలసిన వాళ్ళని గెలిపించామని అడుగుతున్నారట.
అన్వేష్ తీవ్ర విమర్శలు
దీని గురించి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ లో ప్రస్తావించారు. అన్వేష్ చాలా ఘాటుగా నాగార్జునపై విమర్శలు గుప్పించారు. అతడు చేసిన విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అన్వేష్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా అగ్ని పరీక్షలో పాల్గొన్న వాళ్ళు ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లి బిగ్ బాస్ లో మమ్మల్ని గెలిపించండి అని స్టూడెంట్స్ దగ్గర క్యాంపెయిన్ చేస్తున్నారు.
నాగార్జునకి బాధ్యత లేదా ?
అసలు ఈ వెధవలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏంపని ? వీళ్ళని కాదు ఇలాంటి వెధవల్ని తయారు చేస్తున్న నాగార్జున గారిని అనాలి. నాగార్జున గారు బిగ్ బాస్ షోకి హోస్ట్ మాత్రమే. యజమాని కాదు. అయినప్పటికీ ఆయనకీ బాధ్యత ఉంటుంది. ఆయనకి పెళ్ళైన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్స్ లో మీకు ఏంపని అని ఈ వెధవలు చెప్పలేరా ?
నవదీప్ జడ్జి ఏంటి ?
అసలు అగ్ని పరీక్షలో ఆ జడ్జీలు ఏంటి ? నవదీప్ జడ్జి ఏంటి అసలు ? బిందు మాధవి, అభిజీత్ అసలు సినిమాల్లో నటించారా అంటూ అన్వేష్ ప్రశ్నించారు. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే. ఆ షోకి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధం ఏంటి అంటూ అన్వేష్ దుమ్మెత్తి పోశారు. అన్వేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

