- Home
- Entertainment
- యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ క్యూట్ లుక్స్.. చిరునవ్వుతోనే కుర్రాళ్లను పడగొడుతున్న నితిన్ హీరోయిన్
యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ క్యూట్ లుక్స్.. చిరునవ్వుతోనే కుర్రాళ్లను పడగొడుతున్న నితిన్ హీరోయిన్
నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ (Megha Akash) క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.

తమిళ బ్యూటీ మేఘా ఆకాష్ ఇప్పుడిప్పుడే రైజ్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) సరసన ‘లై’చిత్రంలో నటించిన మేఘా ఆకాష్.. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంతోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ బ్యూటీకి ఇప్పటి వరకు మంచి బ్రేక్ పడకపోయినా.. ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో పార్లల్ గా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తొమ్మిది చిత్రాల్లో నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూ ఒకే చెప్పడంతో మేఘా ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్ అయ్యింది. ‘లై’ తర్వాత తెలుగులో ‘ఛల్ మోహన్ రంగ, పేట, రాజ రాజ చోర, డియర్ మేఘా’తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వరుస చిత్రాల్లో మేఘా బిజీగా ఉంది. అటు సినిమాలతో అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు ఈ బ్యూటీ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మైమరిపిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో పంచుకున్న క్యూట్ పిక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. రెడ్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో క్యూట్ లుక్ ను సొంతం చేసుకుంది. చిరునవ్వుతో సెల్ఫీలకు పోజులిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
కేరీర్ విషయానికొస్తే.. ఈ బ్యూటీ తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ‘మను చరిత్ర, గుర్తుందా శీతాకాలం, 31 అక్టోబర్ లేడీస్ నైట్, ప్రేమదేశం, రావణాసుర’లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మరో చిత్రానికి సైన్ చేసింది.