MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?

Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?

Naa Anveshana: సినిమా రివ్యూలు ఇచ్చే యూట్యూబర్లపై.. స్టార్ ట్రావెల్ వ్లాగర్.. అన్వేష్ సంచలన కామెంట్స్ చేశారు. రివ్యూలు మానేసి వారు ఏం చేయాలో క్లియర్ కట్ గా సలహాలు కూడా ఇచ్చాడు. ఇంతకీ అన్వేష్ ఏమంటున్నాడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 14 2026, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోషల్ మీడియా సంచలనం..
Image Credit : Asianet News

సోషల్ మీడియా సంచలనం..

తెలుగులో ఎక్కువ మంది ఫాలో అవుతున్న ట్రావెల్ వ్లాగర్లలో అన్వేష్ ముందున్నాడు. యూట్యూబ్ ట్రావెలర్స్ కు అతను రోల్ మోడల్, సెలబ్రిటీ కూడా. అన్వేష్ కు సినిమా స్టార్స్ కు ఉన్నంత ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. ఈక్రమంలో అతను అప్పుడుప్పుడు చేసే కామెంట్స్ పై కూడా విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా అతను వాడే భాషపై అభ్యంతరాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అన్వేష్ మహిళల వస్త్రధారణపై చెలరేగిన వివాదం ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఏదో ఒక రకంగా తన వీడియోలతో వివాదం అవుతూనే ఉన్నాడు అన్వేష్. ఇక రీసెంట్ గా ఓ వీడియో ద్వారా యూట్యూబర్లపై చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమా రివ్యూలు చేయొద్దన్న అన్వేష్..
Image Credit : Asianet News

సినిమా రివ్యూలు చేయొద్దన్న అన్వేష్..

నేటి సోషల్ మీడియా ప్రపంచంలో వ్యూస్, ఆదాయం కోసం యూట్యూబర్లు ఎంచుకుంటున్న మార్గాలు, ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లపై 'నా అన్వేషణ' అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. రివ్యూలు ఇచ్చే యూట్యూబర్లకు ఆయన ఓ రకమైన వార్నింగ్ ఇచ్చాడు. పలు సూచనలు కూడా చేశాడు. సినిమా రివ్యూల వెనుక పడి లీగల్ సమస్యల్లో చిక్కుకోవద్దని, దానికి బదులుగా మంచి కంటెంట్ ఎంచుకుని ఆదాయం ఎలా సంపాదించవచ్చో తన శైలిలో పంచ్ లతో వివరించారు.

35
యూట్యూబర్లను హెచ్చరించిన అన్వేష్..
Image Credit : Naa Anveshana/YT

యూట్యూబర్లను హెచ్చరించిన అన్వేష్..

ఆరు నెలల క్రితమే సినిమా రివ్యూలు చేయవద్దని హెచ్చరించిన విషయాన్ని అన్వేష్ గుర్తుచేశారు. వందల, వేల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసే భారీ నిర్మాతలు, దర్శకులు లీగల్ చర్యలకు దిగితే సాధారణ యూట్యూబర్లు కోర్టు కేసులు తట్టుకోవడం సాధ్యం కాదని అన్వేష్ అన్నాడు. ఇప్పటికే కొందరు రివ్యూయర్లపై అనేక కేసులు నమోదయ్యాయని, కాబట్టి రివ్యూల గ్యాంగ్ తమ పంథాను మార్చుకోవాలని సూచించారు.

45
కంటెంట్ మేకింగ్‌లో మారుతున్న పంథా
Image Credit : Youtube/Naa anveshana

కంటెంట్ మేకింగ్‌లో మారుతున్న పంథా

సోషల్ మీడియాలో సక్సెస్ సాధించడానికి కొందరు క్రియేటర్లు ఎంచుకుంటున్న కొత్త వ్యూహాలను అన్వేష్ ఉదాహరణలతో ఎత్తిచూపారు గతంలో చిల్లర కంటెంట్ చేసినవారు కూడా ఇప్పుడు వ్యూహం మార్చి, వీడియోల ముందు 'జై శ్రీరామ్', చివరన 'జై హింద్' అంటూ దేశభక్తి, ధార్మిక విషయాలు ప్రచారం చేయడం ద్వారా నెలకు రూ. 20 లక్షలు ఈజీగా సంపాదిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశాడు అన్వేష్. ఇవి కాక అడవులు, వింతలు లేదా ఆసక్తికరమైన విషయాలపై కంటెంట్ తయారుచేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారని అన్వేష్ అన్నాడు.

55
ఇన్ఫర్మేషన్ & హిస్టరీ కంటెంట్‌తో భారీ ఆదాయం
Image Credit : Google

ఇన్ఫర్మేషన్ & హిస్టరీ కంటెంట్‌తో భారీ ఆదాయం

కేవలం ఒక చోట కూర్చుని ఆసక్తికరమైన చరిత్ర చెప్పడం ద్వారా లేదా స్కామ్‌ల గురించి చెప్పడం ద్వారా కూడా భారీగా సంపాదించవచ్చని అన్వేష్ తన సొంత అనుభవాన్ని పంచుకున్నాడు.

తాను హర్షద్ మెహతా స్కామ్ గురించి చెపితే 10 లక్షల మంది చూశారని.. ఆ వీడియోకి రూ. 3 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. అంతే కాదు. విజయ్ మాల్యా కథ గురించి వీడియో చేస్తే.. 1 లక్ష వరకు సంపాదించానన్నాడు. ఇక మహాభారతం కథనాలు గురించి చేసిన వీడియో తనకు 4 లక్షల ఆదాయం తెచ్చిపెట్టినట్టు అన్వేష్ వెల్లడించాడు.

బెట్టింగ్ ప్రోమోషన్ల వల్ల నష్టాలు..

అడ్డదారిలో వేగంగా డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన పెద్ద పెద్ద యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు క్రికెటర్ల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయిపోయాయని అన్వేష్ స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ ప్రచారాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. అన్వేష్ తన మార్క్ భాషను వాడుతూ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. సినిమా రివ్యూలు లేదా బెట్టింగ్ యాప్‌ల ప్రచారాల జోలికి వెళ్లకుండా, ప్రేక్షకులు ఇష్టపడే జ్ఞానాన్ని, సమాచారాన్ని అందించే కంటెంట్‌ను ఎంచుకోవాలని అన్వేష్ పిలుపునిచ్చారు. కొంత మంది అతనికి సపోర్ట్ గా కామెంట్స్ పెట్టగా.. మరికొంత మంది మాత్రం తిట్టిపోస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Recommended image2
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Recommended image2
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved