- Home
- Entertainment
- Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫస్ట్ డ్యూయోల్ రోల్ చేసిన సినిమా హాలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్టర్ చేసిన ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లోకనిపించడానికి.. ఆయన డూప్ గా ఓ స్టార్ హీరో నటించాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?

ఫస్ట్ టైమ్ నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన సినిమా..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ చేశారు. డ్యూయల్ కథలతో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నో వచ్చాయి. అలాంటి సినిమాలలో 'హలో బ్రదర్' కూడా ఒకటి. దివంగత స్టార్ డైరెక్టర్ ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం, వినోదానికి సరికొత్త నిర్వచనం చెప్పింది. 'దేవా', 'విక్రమ్' అనే ఇద్దరు కవల సోదరుల పాత్రల్లో నాగార్జున జీవించారు. ఈ చిత్రంలో ఇద్దరు నాగార్జునలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సన్నివేశాలు, వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టెక్నాలజీ లేని రోజుల్లో ఏం చేసేవారంటే?
హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఒక రకంగా అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ ఈ రెండు పాత్రలు చేయడానికి అటు టీమ్ కు ఇటు నాగార్జునకు ఎంత ఇబ్బంది అయ్యిందో తెలుసా? ఇప్పుడంటే ఒకే నటుడు రెండు వేర్వేరు పాత్రల్లో నటిస్తే విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతో సులభంగా తెరకెక్కిస్తున్నారు. కానీ, 1990ల కాలంలో డిజిటల్ సాంకేతికత ఇంతగా అందుబాటులో లేదు. ఆ రోజుల్లో డ్యూయల్ రోల్స్ చిత్రీకరించడం దర్శకులకు, కెమెరామెన్లకు అతిపెద్ద సవాలుగా ఉండేది. ట్రైపాడ్ సహాయంతో ఒకే షాట్‌ను రెండుసార్లు తీసి, రీల్స్ కట్ చేసి ఎడిట్ చేసే పద్ధతులు (స్ప్లిట్ స్క్రీన్) ఉపయోగించేవారు. ఇద్దరు హీరోలు పక్కపక్కనే నిలబడటం, ఒకరినొకరు తాకడం, వెనుక నుంచి షాట్స్ తీయడం వంటి సన్నివేశాల కోసం తప్పనిసరిగా 'బాడీ డ్యూప్' ను ఉపయోగించేవారు. అయితే హీరోలకు డూప్ లు గా జూనియర్ ఆర్టిస్ట్ లు చేసేవారు.
నాగార్జున డూప్ గా నటించిన శ్రీకాంత్
సాధారణంగా స్టార్ హీరోలకు డూప్ లు గా నటించేవారు వేరే ఉంటారు. లేదంటే జూనియర్ ఆర్టిస్టులను ఎవరినైనా తీసుకువస్తారు. కానీ హలో బ్రదర్ సినిమాలో మాత్రం నాగార్జునకు డూప్ గా ఓ స్టార్ హీరో నటించారు. ఆయన ఎవరో కాదు శ్రీకాంత్. ఈ సినిమాలో నాగార్జున శరీర ఆకృతికి, ఎత్తుకు సరిగ్గా సరిపోయే డూప్‌ను ఎంచుకోవడం ఎంతో కీలకమైంది. ఈ బాధ్యతను నాగార్జునతో సమానమైన ఎత్తు, ఫిజిక్ ఉన్న నటుడు శ్రీకాంత్ అయితేనే సరిపోతాడని డైరెక్టర్ అనుకున్నారు. కానీ అప్పటికే స్టార్ హీరోగా ఉన్న శ్రీకాంత్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా అనే ఆలోచన అందరిలో ఉంది. ఆ బాధ్యతను దర్శకుడు ఈవీవీ తీసుకున్నాడు.
శ్రీకాంత్ ఎలా ఒప్పుకున్నాడంటే?
నాగార్జున డూప్ గా హీరో శ్రీకాంత్ అయితే బాగుంటాడు అనిపిచింది ఈవీవీకి. కానీ, శ్రీకాంత్ హీరోగా చేస్తున్నాడు. మరి, నాగార్జునకు డూప్ గా చేస్తాడా ? ఈవీవీ మొహమాటపడుతూనే వెళ్లి శ్రీకాంత్ కి విషయం చెప్పారు. ఈవీవీతో శ్రీకాంత్ కి మంచి ప్రెండ్షిప్ ఉండటంతో.. ఆయన మాటను శ్రీకాంత్ కాదనలేకపోయాడు. అడిగిన వెంటనే చేస్తాను అని నాగ్ కి డూప్ గా నటించాడు. అలా ‘హలో బ్రదర్’ సినిమా మొదలైంది. టాలీవుడ్ లో మొదటి సారి ఒక హీరోకు మరో స్టార్ హీరో డూప్ గా నటించడం.
బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ..
కేవలం ₹2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో దాదాపు ₹11.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 1994లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అంతే కాదు ఈ సినిమాకు గాను నాగార్జునకు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డు దక్కింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజ్-కోటి, బెస్ట్ ఎడిటర్‌గా రవీంద్రబాబు నంది అవార్డులు అందుకున్నారు

