MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే

Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే

భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమా గురించి ఈ గ్యాలరీలో చూద్దాం. రూ.45 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.60 వేలు మాత్రమే వసూలయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 26 2026, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Biggest Flop Movie in India
Image Credit : Asianet News

Biggest Flop Movie in India

సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి, పెద్ద హిట్టు కొట్టాలని నిర్మాతలు ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు, పెద్ద స్టార్లు ఉన్నా, కోట్లు ఖర్చుపెట్టినా, ప్రేక్షకులకు నచ్చకపోతే సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవుతాయి. బాలీవుడ్‌లో ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై డిజాస్టర్ మూవీగా చెడ్డపేరు తెచ్చుకుంది.

ఆ సినిమా పేరే 'ది లేడీ కిల్లర్'. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్లలో మొత్తం మీద కేవలం రూ.60 వేలు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. 2023లో విడుదలైన 'ది లేడీ కిల్లర్' చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించారు. అర్జున్ కపూర్, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను టి-సిరీస్ సంస్థ నిర్మించింది. పెద్ద నిర్మాణ సంస్థ, ప్రముఖ నటీనటులు, భారీ బడ్జెట్.. ఇలా సినిమాపై మొదట్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, సినిమా విడుదలయ్యాక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.45 కోట్ల బడ్జెట్‌
Image Credit : Lady Killer movie

రూ.45 కోట్ల బడ్జెట్‌

'ది లేడీ కిల్లర్' సినిమాకు థియేటర్లలో చాలా దారుణమైన రెస్పాన్స్ వచ్చిందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా మొదటి రోజు కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని టాక్. దీని ద్వారా తొలిరోజు వసూళ్లు సుమారు రూ.38 వేలుగా నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా వసూళ్లు ఏమాత్రం పెరగలేదు. చివరికి, మొత్తం థియేట్రికల్ కలెక్షన్ సుమారు రూ.60 వేలకే పరిమితమైందని సమాచారం.

రూ.45 కోట్ల బడ్జెట్‌తో పోలిస్తే ఈ వసూళ్లు చాలా దారుణం. కనీసం సినిమా ప్రింట్, ప్రమోషన్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయిందని చెబుతున్నారు.

34
మూవీ రిలీజైన సంగతి కూడా తెలియదు
Image Credit : social media

మూవీ రిలీజైన సంగతి కూడా తెలియదు

ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు, రిలీజ్‌కు ముందు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సరిగ్గా చేయలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమా విడుదలైన విషయమే చాలా మంది సినీ అభిమానులకు తెలియకుండా పోయిందని అంటారు. థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోవడంతో, ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారని సమాచారం.

44
ఓటీటీ డీల్ రద్దు
Image Credit : X

ఓటీటీ డీల్ రద్దు

'ది లేడీ కిల్లర్' ఓటీటీ హక్కులను మొదట నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ ఒప్పందం రద్దయిందని చెబుతున్నారు. ఇతర ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. దీంతో నిర్మాతలకు వేరే దారిలేకపోయింది. చివరికి, ఈ సినిమాను యూట్యూబ్‌లో ఉచితంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఓ సినిమా, థియేటర్లలో కొన్ని వేల రూపాయలు మాత్రమే వసూలు చేయడం భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ వైఫల్యాలలో ఒకటిగా 'ది లేడీ కిల్లర్'ను నిలబెట్టింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved