BrahmaMudi 31st January episode:శ్వేత భార్త శాడిజం, అప్పూని మాటలతో బాధపెట్టిన అనామిక..!
అప్పూ వెళ్లిపోగానే.. కళ్యాణ్ కి ఐస్ క్రీమ్ తినడం ఆపేస్తుంది. అనామిక.. ప్రవర్తనకు కళ్యాణ్ షాకౌతాడు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నావ్ అంటే.. మా మూడ్ స్వింగ్స్ అలానే ఉంటాయి అని అనామిక బదులిస్తుంది.
Brahmamudi
BrahmaMudi 31st January episode: అత్త అపర్ణ సపోర్ట్ తో కావ్య ఆఫీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. వెళ్లడం వెళ్లడం..రాజ్ తో పేచీ పెట్టుకుంటుంది. తనకు పని చెప్పమని అడుగుతుంది. దానికి రాజ్.. టీ పెట్టుకొని రమ్మంటాడు. అయితే.. తాను అటెండర్ కాదని, డిజైనర్ ని అని చెబుతుంది. అయితే.. నాకు పని ఉంది.. నసపెట్టకు అని రాజ్ అంటే... నాకు పని చెప్పే వరకు నస పెడుతూనే ఉంటాను అని అనడంతో.. కూర్చోమని చెబుతాడు. తనకు పని ఇచ్చేంత వరకు నిన్ను చూస్తేనే ఉంటాను అని కావ్య అనడంతో.. శ్రుతి అని అరుస్తాడు. శ్రుతి రాగానే.. మీ మేడమ్ కి కుర్చీ చూపించి, వేయాల్సిన డిజైన్స్ ఎక్స్ ప్లెయిన్ చేయమని చెబుతాడు. దీంతో థ్యాంక్స్ అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.
Brahmamudi
కావ్య ఆఫీసుకు వచ్చినందుకు రాజ్ మమ్మీ అని అరుస్తాడు. మమ్మీని కాదు.. డాడీకి ఫోన్ చేయాలి అనుకుంటాడు. వెంటనే వాళ్ల నాన్న సుభాష్ కి కాల్ చేస్తాడు. వెంటనే కావ్యకు పది సంవత్సరాల కాంట్రాక్ట్ ఇవ్వడంపై ప్రశ్నిస్తాడు. ఇక.. సుభాష్ కూడా చాలా ఫన్నీగా సమాధానం చెబుతాడు. రాజ్ ఫ్రస్టేషన్ చాలా సరదాగా ఉంటుంది. రోజూ కావ్యను ఆఫీసులో భరించడం కష్టమని.. ఏదో ఒకటి చేయాలి అని రాజ్ అనుకుంటాడు.
Brahmamudi
ఇక.. ఫ్రెండ్ అన్నమాటలకు బాధపడుతూ అప్పూ ఇంటికి వచ్చి నిద్రపోతుంది. ఈ లోగా తనకు పని ఇచ్చిన సర్ ఫోన్ చేసి.. తిడతాడు. వెంటనే రమ్మని చెబుతాడు. దీంతో.. అన్నం కూడా తినకుండా అప్పూ బయలుదేరుతుంది. కనకం భోజనం చేయమని చెప్పినా నన్ను లేపలేదని.. టైమ్ మొత్తం నిద్రలోనే పోయిందని వసుక్కుంటూ వెళ్లిపోతుంది. ఇక. కనకం తాను ఏం చేశాను అని తన భర్తను అడుగుతుంది.
అప్పూ బాధతో అలా చేసిందని మూర్తి అంటాడు. అన్నీ మర్చిపోయి జాబ్ లో జాయిన్ అయ్యింది కదా అని కనకం అంటే.. జరిగింది మనం మర్చిపోయామా..? అప్పూ మర్చిపోవడానికి అంటాడు. పెళ్లి చేస్తే తప్ప మారదు అని అంటాడు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి చేయలేం అంటాడు. ఎందుకు అని కనకం అంటే.. కళ్యాణ్ పెళ్లి లో జరిగినదంతా అప్పూ కావాలని చేసిందని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మంచి సంబంధం రావడం కష్టమే అని బాధపడతాడు.
Brahmamudi
సీన్ కట్ చేస్తే... కళ్యాన్.. అనామికను తీసుకొని బయటకు వస్తాడు. బయటకు తీసుకువచ్చినా కూడా అనామిక ముఖం మాడ్చేస్తుంది. ఎందుకలా ఉన్నావ్ అని కళ్యాణ్ అడిగితే.. బావగారిలా నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్లొచ్చు కదా అంటుంది. నువ్వు నన్ను ఇష్టపడింది నా కవితలు చూసే కదా అని కళ్యాన్ అడుగుతాడు. లేకపోతే నీ ఆస్తిని చూసి అనుకున్నావా..? నువ్వు పరిచయం అయ్యే వరకు నీ డీటేల్స్ ఏమీ నాకు తెలీదు అని అనామిక అంటుంది. మరి.. ఇఫ్పుడు ఎందుకు మారిపోతున్నావ్ ని కళ్యాణ్ అడుగుతాడు. దానికి అనామిక దగ్గర సమాధానం ఉండదు. ఈలోగా వాళ్లు ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. అయితే.. ఆ పలావ్ బాలేదని.. మా వదిన చేస్తే బాగుంటుంది అని కళ్యాణ్ అంటాడు.
Brahmamudi
ఇక్కడ కూడా మీ వదిన జపం ఆపుతావా, ఇంటికి వెళ్లాక మీ వదినను అడిగి చేయిస్తానులే అంటుంది. నాకోసం నువ్వు చేయవచ్చు కదా అని కళ్యాణ్ అంటాడు.. అప్పుడే అక్కడికి అప్పూ వస్తుంది.వాళ్ల సార్ కి లేటు అయినందుకు క్షమాపణలు చెబుతుంది. అది అనామిక చూస్తుంది. అప్పూని మరింత బాధపెట్టాలని.. కళ్యాణ్ తో ప్రేమగా ఉన్నట్లు నటించి.. ఐస్ క్రీమ్ తినిపిస్తుంది. అది చూసి అప్పూ మరింత బాధపడుతుంది. అప్పూ వెళ్లిపోగానే.. కళ్యాణ్ కి ఐస్ క్రీమ్ తినడం ఆపేస్తుంది. అనామిక.. ప్రవర్తనకు కళ్యాణ్ షాకౌతాడు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నావ్ అంటే.. మా మూడ్ స్వింగ్స్ అలానే ఉంటాయి అని అనామిక బదులిస్తుంది.
Brahmamudi
ఇక.. రాజ్ ఆఫీసులో డిజైన్స్ బాలేవు అని అరుస్తాడు. కావ్య చెప్పిందని అలా చేశాను అని శ్రుతి చెబితే.. ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అని సీరియస్ అయ్యి వెళ్లిపోతాడు. అప్పుడే శ్వేత ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. అరవింద్ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని.. డివోర్స్ పేపర్స్ పంపడంతో కోపంగా ఉన్నాడు అనుకుంట అని చెబుతుంది. వెంటనే రాజ్ బయలుదేరి వెళతాడు. రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడానికి కావ్య కూడా ఫాలో అవుతుంది.
Brahmamudi
ఈలోగా అరవింద్.. శ్వేతను కొడుతూ ఉంటాడు. శాడిస్ట్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తన మాట వినడం లేదని.. విడాకులు ఇస్తావా అంటూ కొడుతూ ఉంటాడు. అదే సమయానికి రాజ్ అక్కడకు వెళతాడు. వెళ్లడమే... అరవింద్ ని కొడతాడు. దీంతో.. అరవింద్.. రాజ్, శ్వేతల బంధం గురించి చాలా చీప్ గా , తక్కువ చేసి మాట్లాడతాడు. ఇక.. రాజ్ అరవింద్ కి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. రేపటిలోగా విడాకుల పేపర్ మీద సంతకం పెట్టమని బెదిరిస్తాడు.
Brahmamudi
ఇక శ్వేత.. ఏఢుస్తూ కుప్పకూలిపోతుంది. అరవింద్ వెళ్లిపోయిన తర్వాత.. కావ్య ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే.. రాజ్ శ్వేతను ఓదారుస్తూ ఉంటాడు. నీకు నేను ఉన్నాను అని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసి కావ్య చాలా బాధపడుతుంది. అరవింద్ నీకు విడాకులు ఇచ్చిన తర్వాత నీ జీవితం అద్భుతంగా ఉంటుందని. నేను గ్యారెంటీ అని.. నీ లైఫ్ నాది అని, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని రాజ్ ఓదారుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని కావ్య తప్పుగా అర్థం చేసుకొని బాధపడుతుంది.
కమింగప్ లో.. కావ్య తనకు శ్వేత విషయం తెలుసు అని నిలదీస్తుంది. ఆ మాటలు విని రాజ్ షాకౌతాడు. మరి.. ఆ రచ్చ రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..