MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic day 4 Collections: 300 కోట్లకు చేరువలో టాక్సిక్.. నాలుగో రోజు యశ్ సినిమాకు గట్టి దెబ్బ.. ఎంత వసూలు చేసిందంటే?

Toxic day 4 Collections: 300 కోట్లకు చేరువలో టాక్సిక్.. నాలుగో రోజు యశ్ సినిమాకు గట్టి దెబ్బ.. ఎంత వసూలు చేసిందంటే?

Toxic day 4 Collections: బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వసూళ్లలో నాలుగో రోజు మాత్రం తగ్గుదల కనిపించింది. యష్ సినిమా నాలుగోరోజు ఎంత వసూలు చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 30 2026, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తగ్గిన టాక్సిక్ వసూళ్లు..
Image Credit : X

తగ్గిన టాక్సిక్ వసూళ్లు..

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' శనివారం (4వ రోజు) కూడా థియేటర్లలో తన బాక్సాఫీస్ పరుగును కొనసాగించింది. యష్ - గీతు మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా నాలుగో రోజు భారతదేశంలో సాధించిన నెట్ వసూళ్లలో మునుపటి రోజుతో పోలిస్తే కొంత మేర తగ్గుదల నమోదైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియాలో టాక్సిక్ వసూళ్ల వివరాలు
Image Credit : X

ఇండియాలో టాక్సిక్ వసూళ్ల వివరాలు

ట్రాకింగ్ సైట్ 'సాక్నిల్క్' (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, 'టాక్సిక్' 4వ రోజు భారత్‌లోని 17,612 షోల ద్వారా సుమారు రూ. 24.50 కోట్ల నెట్ కలెక్షన్‌ను రాబట్టింది. శుక్రవారం (3వ రోజున) రూ. 27.20 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, శనివారం నాటి గణాంకాల ప్రకారం వసూళ్లలో 9.9 శాతం తగ్గుదల కనిపించింది.

తాజా వసూళ్లతో కలిపి ఈ సినిమా భారతదేశంలో మొత్తం రూ. 190.45 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 227.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు రూ. 101.10 కోట్ల నెట్ వసూళ్లతో భారీ ఓపెనింగ్ సాధించగా, రెండవ రోజు రూ. 37.65 కోట్లు, మూడవ రోజు రూ. 27.20 కోట్లు సాధించింది.

35
ప్రపంచవ్యాప్త గ్రాస్ బాక్సాఫీస్
Image Credit : X/@KvnProductions

ప్రపంచవ్యాప్త గ్రాస్ బాక్సాఫీస్

ఓవర్సీస్ మార్కెట్‌లో శనివారం రోజు ఈ చిత్రం రూ. 4 కోట్లు రాబట్టింది. దీంతో విదేశాల్లో మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 27.25 కోట్లకు చేరుకున్నాయి. ఇండియా - ఓవర్సీస్ వసూళ్లను కలిపితే 'టాక్సిక్' చిత్రం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 254.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 250 కోట్ల మార్కును దాటేసింది.

45
భాషల వారీగా 4వ రోజు కలెక్షన్లు & ఆక్యుపెన్సీ వివరాలు
Image Credit : X/@KvnProductions

భాషల వారీగా 4వ రోజు కలెక్షన్లు & ఆక్యుపెన్సీ వివరాలు

శనివారం అన్ని భాషకంటే ఎక్కువగా హిందీ వెర్షన్ అత్యధిక వసూళ్లను సాధించి ముందంజలో నిలిచింది.

హిందీ: రూ. 15.50 కోట్ల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 23%, నైట్ షోస్ 37.77%)

కన్నడ: రూ. 6.60 కోట్ల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 47%, నైట్ షోస్ 62.15%)

తెలుగు: రూ. 1.50 కోట్ల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 23%)

తమిళం: రూ. 75 లక్షల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 17%)

మలయాళం: రూ. 15 లక్షల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 21%)

ఐదు భాషల్లో కన్నడ వెర్షన్ అత్యధికంగా 47.23% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, రాత్రి షోలు 62.15% వరకు వెళ్లాయి. కన్నడలో ఉదయం షోలు 28.85%, మధ్యాహ్నం 44.62%, సాయంత్రం 49.46% నమోదు కాగా, హిందీలో ఉదయం 15.31%, మధ్యాహ్నం 26.69%, సాయంత్రం 25% గా నమోదయ్యాయి. తెలుగు వెర్షన్‌లో ఉదయం 15.38%, మధ్యాహ్నం 21.38%, సాయంత్రం 23%, రాత్రి 20.46% ఆక్యుపెన్సీ రికార్డైంది.

55
టాక్సిక్ రివ్యూ టాక్..
Image Credit : X

టాక్సిక్ రివ్యూ టాక్..

టాక్సిక్ సినిమాకు అంతట నెగెటీవ్ రివ్యూస్ వచ్చినా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. ' ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ ఎక్కువగా చూపించినప్పటికీ, కథా బలం తక్కువగా ఉండటం, స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, డ్యూరేషన్ ఎక్కువగా ఉండటం, పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం, ఎమోషన్స్ భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకపోవడం వంటి అంశాలు ప్రతికూలంగా మారాయని విశ్లేషకులు అంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
6 రూపాయల రెమ్యునరేషన్‌తో 100 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించిన నవ్వుల రారాజు
Recommended image2
Top 7 Dramas On Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్స్ మెచ్చే 7 బెస్ట్ చైనీస్ డ్రామాలు
Recommended image3
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Related Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved