MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ వచ్చే ఆదివారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. అయితే ఈ సారి హౌజ్‌లోకి స్టార‌‌ కమెడియన్స్ రాబోతున్నారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 29 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెప్టెంబర్‌ 6న స్టార్ట్ కాబోతున్న బిగ్‌ బాస్‌ తెలుగు 10
Image Credit : youtube/@starmaa

సెప్టెంబర్‌ 6న స్టార్ట్ కాబోతున్న బిగ్‌ బాస్‌ తెలుగు 10

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభానికి ఇంకో వారం రోజులే ఉంది. వచ్చే ఆదివారం ఈ షో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 6 నుంచి స్టార్ట్ కాబోతుందని, తాజాగా నాగార్జున వెల్లడించారు. ఈ మేరకు బిగ్‌ బాస్‌ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌ పది రెట్లు ఉంటుందని నాగార్జున తెలిపారు. అంతేకాదు ఈ సారి షో వేరే లెవల్‌లో ఉంటుందని, అంత ఈజీ కాదని కూడా వెల్లడించారు. ఇది షోపై ఆసక్తిని పెంచుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్లు
Image Credit : youtube/@starmaa

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్లు

ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అంతకు ముందు రకరకాల పేర్లు వినిపించాయి. టెంపర్‌ వంశీ, కృష్ణుడు, త్రిగుణ్‌, రామ్‌ ప్రసాద్‌, నరేష్‌, దేబ్జానీ, చైత్ర, వర్షిణి సౌందరాజన్‌ రాబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ గా ఇందులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఇద్దరు కామన్‌గా ఉన్నారు. కానీ ఊహించని విధంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. బుల్లితెర భామలు, కమెడియన్ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. గ్లామర్‌ డోస్‌, కామెడీ డోస్‌ పెంచబోతున్నట్టు సమాచారం.

34
కామెడీకి పెద్ద పీఠ వేసిన నాగార్జున
Image Credit : our own

కామెడీకి పెద్ద పీఠ వేసిన నాగార్జున

కొత్తగా వినిపిస్తున్న పేర్లలో జబర్దస్త్ నుంచి ప్రముఖమైన పేర్లు వినిపిస్తున్నాయి. స్టార్‌ కమెడియన్లుగా రాణిస్తున్న రాం ప్రసాద్‌ రాబోతున్నారట. ఆయనతోపాటు నూకరాజు కూడా వస్తారని అంటున్నారు. అలాగే రాకెట్‌ రాకేష్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురు వస్తే, బిగ్‌ బాస్‌ షోలో కామెడీ వేరే లెవల్‌ లో ఉంటుందని, వినోదానికి కొదవ లేదని తెలుస్తోంది. గత సీజన్ లో ఇమ్మాన్యుయెల్‌ తనదైన కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచారు. హైలైట్‌గా నిలిచారు. షోకి రేటింగ్‌ పెంచడంలో తనవంతు ప్రయత్నం చేశాడు. ఈ సారి ఆ డోస్‌ త్రిబుల్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇదంతా నాగార్జున ప్లాన్‌ అని సమాచారం. కామెడీకి పెద్ద పీఠ వేస్తున్నట్టు సమాచారం.

44
బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి గ్లామర్‌ బ్యూటీస్‌
Image Credit : instagram/kavya shree

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి గ్లామర్‌ బ్యూటీస్‌

ఇక గ్లామర్‌ విషయానికి వస్తే.. హాట్‌ బ్యూటీ కావ్య శ్రీ రాబోతుందట. ఆమె బిగ్‌ బాస్‌ విన్నర్‌ నిఖిల్‌ మాజీ లవర్‌ అనే విషయం తెలిసిందే. ఆమెతోపాటు మరో టీవీ నటి పల్లవి గౌడ, తేజస్విని రాబోతుందని సమాచారం. అలాగే మరో కమెడియన్‌ ఎక్స్ ప్రెస్‌ హరి కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. వీరితోపాటు ఆట సందీప్‌ భార్య జ్యోతి, యూట్యూబర్‌ నందూ, కడలి సత్యనారాయణ బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి సెలబ్రిటీ కేటగిరిలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. వీరు పది మంది, కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో మరో ఐదుగురుని హౌజ్‌లోకి పంపించే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా ఈ సారి బిగ్‌ బాస్‌ షోని గట్టిగానే ప్లాన్‌ చేశారని, ఆటకు ఆట, గ్లామర్‌కి గ్లామర్‌, వినోదానికి వినోదం, డ్రామాకి డ్రామా ఇలా అన్ని యాంగిల్స్ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. రేటింగ్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఎంత వరకు సక్సెస్‌ అవుతుందనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బిగ్ బాస్ తెలుగు
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 7 Dramas On Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్స్ మెచ్చే 7 బెస్ట్ చైనీస్ డ్రామాలు
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image3
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved