MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి గతంలో హీరో శింబు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. 'మూవీ డేట్‌'కి ఏ హీరోతో వెళ్లాలనుకుంటున్నారు అని అడగ్గా, తాను శింబుతో వెళ్తానని ఆమె చెప్పారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 29 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ
Image Credit : Meenakshi Chaudhary Instagram

వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ బ్యూటీ మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ, 2021లో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘అనగనగా ఒక రాజు’ లాంటి సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి, వరుస విజయాలతో 'లక్కీ చార్మ్' అనే ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ దళపతి విజయ్‌తో కలిసి నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రస్తుతం కథ, పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మీనాక్షి, గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శింబుతో డేట్‌కి వెళ్తా- మీనాక్షి చౌదరీ
Image Credit : X

శింబుతో డేట్‌కి వెళ్తా- మీనాక్షి చౌదరీ

గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీనాక్షికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.`ఇండస్ట్రీలో ఏ హీరోతోనైనా 'మూవీ డేట్'కి, అంటే సినిమా చూడటానికి వెళ్లే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు?` అని అడిగారు. ఈ ప్రశ్నకు మీనాక్షి ఏమాత్రం తడుముకోకుండా వెంటనే కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు చెప్పారు. `నేను మూవీ డేట్‌కి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా శింబు గారితోనే వెళ్తాను` అని ఫుల్‌ ఎనర్జీతో బదులిచ్చారు. శింబు స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన తనకు చాలా ఇష్టమని కూడా మీనాక్షి ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీనాక్షి శింబు గురించి మాట్లాడిన ఈ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

34
శింబుతో ప్రేమలో మీనాక్షి చౌదరీ?
Image Credit : instagram/@meenakshichaudhary006

శింబుతో ప్రేమలో మీనాక్షి చౌదరీ?

గతంలో శింబు, మీనాక్షి చౌదరి ప్రేమలో ఉన్నారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు మీనాక్షి 'శింబుతో మూవీ డేట్‌కి వెళ్తా' అని చెప్పిన పాత వీడియో మళ్లీ వైరల్ అవ్వడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ముఖ్యంగా శింబు అభిమానులు ఈ కామెంట్‌పై ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరూ కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

44
శింబుతో మీనాక్షి రొమాన్స్
Image Credit : instagram/@meenakshichaudhary006

శింబుతో మీనాక్షి రొమాన్స్

ఈ ప్రచారం జరుగుతుండగానే కోలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు డైరెక్షన్‌లో శింబు హీరోగా రాబోతున్న చిత్రం ‘STR 49’లో మీనాక్షి చౌదరినే హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ కాంబినేషన్‌పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, శింబు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపిస్తే అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అవుతుంది. మీనాక్షి పాత కామెంట్స్ వైరల్ అవుతున్న టైంలోనే ‘STR 49’ సినిమాపై ఈ రూమర్స్ రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మీనాక్షి.. నాగచైతన్యతో `వృషకర్మ` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Recommended image2
Chiranjeevi: నాకు కులపిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదు.. సీనియర్‌ హీరో సంచలన వ్యాఖ్యలు
Recommended image3
6 రూపాయల రెమ్యునరేషన్‌తో 100 కోట్లకుపైగా ఆస్తులు సంపాదించిన నవ్వుల రారాజు
Related Stories
Recommended image1
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved