- Home
- Entertainment
- ఎన్టీఆర్, మహేష్ తో పాటు ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసింది వీళ్ళే..అతడైతే ఏకంగా 8 ఏళ్ళు గ్యాప్
ఎన్టీఆర్, మహేష్ తో పాటు ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసింది వీళ్ళే..అతడైతే ఏకంగా 8 ఏళ్ళు గ్యాప్
సీనియర్ హీరోలు తమకంటే చాలా చిన్నవారైనా హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా హీరోయిన్లు కూడా తమకంటే వయసు తక్కువ ఉన్న హీరోలతో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు తమకంటే వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్లతో నటించారు. .

సీనియర్ హీరోలు తమకంటే చాలా చిన్నవారైనా హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా హీరోయిన్లు కూడా తమకంటే వయసు తక్కువ ఉన్న హీరోలతో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు తమకంటే వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్లతో నటించారు. .
నితిన్- రైమా సేన్ : ధైర్యం చిత్రంలో నితిన్, రైమా సేన్ కలసి నటించారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. నితిన్ కంటే రైమా సేన్ వయసు మూడేళ్లు ఎక్కువ.
మహేష్ బాబు - నమ్రత : రియల్ లైఫ్ కపుల్ అయిన నమ్రత, మహేష్ గతంలో ఒక చిత్రంలో కలసి నటించారు. వంశి చిత్రంలో వీళ్ళిద్దరూ నటించడంతోనే ప్రేమ మొదలై పెళ్లి చేసుకున్నారు. మహేష్ కంటే నమ్రత ఐదేళ్లు వయసులో పెద్దదనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్-భూమిక : ఎన్టీఆర్ తో కలసి భూమిక సింహాద్రి, సాంబ చిత్రాల్లో నటించింది. తారక్ కంటే భూమిక వయసు ఐదేళ్లు ఎక్కువ. సింహాద్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
బెల్లంకొండ శ్రీనివాస్- కాజల్ : వీళ్ళిద్దరూ సీత, కవచం చిత్రాల్లో నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ కంటే కాజల్ ఏకంగా ఏడేళ్లు వయసులో పెద్దది.
సమంత - విజయ్ దేవరకొండ : విజయ్ దేవరకొండ కంటే సమంత రెండేళ్లు వయసులో పెద్దది. వీరిద్దరూ మహానటి, ఖుషి లాంటి చిత్రాల్లో నటించారు.
నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి : గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో నవీన్, అనుష్క మెప్పించారు. వీళ్లిద్దరి మధ్య కూడా 8 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. ఎమోషనల్ గా సాగే ప్రేమకథతో వీళ్ళిద్దరూ ఆకట్టుకున్నారు.
వరుణ్ సందేశ్- విమలారామన్ : వరుణ్ సందేశ్ తో కలసి ముదురు హీరోయిన్ విమలారామన్ ఎవరైనా ఎపుడైనా చిత్రంలో నటించింది. వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 8 ఏళ్ళు. తనకంటే 8 ఏళ్ళు చిన్నవాడైన హీరోతో విమలారామన్ రొమాన్స్ అదరగొట్టింది.