MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో

OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో

OG Universe: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను సుజీత్ విడుదల చేశారు. ఓజీ సీక్వెల్‌పై ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 02 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
OG Universe
Image Credit : Asianet News

OG Universe

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ
Image Credit : Asianet News

ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ

ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు.

35
మనం మన బెస్ట్ ఇవ్వాలి
Image Credit : Asianet News

మనం మన బెస్ట్ ఇవ్వాలి

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్‌లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

45
ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం
Image Credit : Asianet News

ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం

వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్‌ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్‌పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు. వీడియోలో వినిపించిన ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

From the #OGUniverse
To the #OG…

ALL LOVE for everything so far…
And everything that begins from here :) 🧿🧿♥️♥️

Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk

— Sujeeth (@Sujeethsign) September 2, 2026

55
కథలో సుభాష్ చంద్రబోస్
Image Credit : Asianet News

కథలో సుభాష్ చంద్రబోస్

ఇప్పటికే ఓజీ యూనివర్స్‌పై అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వీడియో అభిమానులకు రాబోయే ప్రాజెక్టులపై ఒక చిన్న గ్లింప్స్‌ను అందించింది. ఓజీకి కొనసాగింపుగా రాబోయే సినిమాల్లో ఎలాంటి కొత్త అంశాలు ఉంటాయి, సమురాయ్ కోణం ఎంత కీలకంగా ఉంటుంది, సుభాష్ చంద్రబోస్ ప్రస్తావనను కథలో ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓజీ 2 వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తంగా సుజీత్ రిలీజ్ చేసిన ఓజీ యూనివర్స్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Recommended image2
Vishnu Priya: విష్ణుప్రియ గ్లామర్‌కు ఇంత డిమాండా? ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా భారీ మొత్తం, నిజమేనా
Recommended image3
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Related Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved