MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!

Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!

Actress Radha: చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీసులో తన అక్క, నటి అంబికపై రాధ చెక్ ఫ్రాడ్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఈ అక్కాచెల్లెళ్ల మధ్య ఏం జరిగిందో డీటెయిల్స్‌గా చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 21 2026, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంబిక vs రాధ
Image Credit : Asianet News

అంబిక vs రాధ

సౌత్ ఇండియాలో 80, 90వ దశకాల్లో అంబిక, రాధ ఇద్దరూ టాప్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో హిట్స్ కొట్టారు.

1981లో వచ్చిన 'అలైగల్ ఓయ్ వతిల్లై' సినిమాతో రాధ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అంబిక మాత్రం మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమాల్లో అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు
Image Credit : Instragram

సినిమాల్లో అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు

రాధ బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం అంబిక టీవీ సీరియల్స్ చేస్తుంటే, రాధ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా అంబిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఇప్పుడు ఈ చెక్ ఫ్రాడ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

35
అంబికపై రాధ కంప్లైంట్
Image Credit : Asianet News

అంబికపై రాధ కంప్లైంట్

చెన్నై వేప్పేరిలోని పోలీస్ కమిషనర్ ఆఫీసులో తన అక్క అంబిక, సోదరుడిపై రాధ కంప్లైంట్ ఇచ్చారు. తన సంతకం ఉన్న 5 చెక్కులను వాళ్లు మిస్‌యూజ్ చేశారని రాధ ఆరోపించారు. వీళ్లంతా ఒకే ఇంట్లో ఉంటున్న టైమ్‌లో ఈ చెక్కుల గోల్‌మాల్ జరిగినట్లు రాధ గుర్తించారు. వెంటనే తన బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్స్ చెక్ చేసుకున్నారు.

45
రూ.46 కోట్ల భారీ మోసం
Image Credit : Asianet News

రూ.46 కోట్ల భారీ మోసం

తన అకౌంట్ నుంచి ఏకంగా రూ.46 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగినట్లు రాధ తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో అంబిక, తన సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితే కానీ అసలు నిజాలు బయటకు రావు. సొంత అక్కపైనే రాధ ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కోలీవుడ్‌లో పెద్ద షాకింగ్‌గా మారింది.

55
చిరంజీవికి లక్కీ హీరోయిన్
Image Credit : Asianet News

చిరంజీవికి లక్కీ హీరోయిన్

తెలుగులో రాధా అనేక చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఆమె మెగాస్టార్ చిరంజీవికి లక్కీ హీరోయిన్. చిరంజీవితో ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా సూపర్ హిట్స్ అయ్యాయి. కొండవీటి దొంగ, అడవి దొంగ, యముడికి మొగుడు, దొంగ ఇలా వీరిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anali OTT Release: కోర్టు స్టేతో ఆగిపోయిన క్రైమ్ సిరీస్, అనలి ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
Recommended image2
Wild Card Entry List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 వైల్డ్ కార్డ్ అఫీషియల్‌ లిస్ట్.. ఏమాత్రం పసలేదు, ఇలా అయితే కష్టమే
Recommended image3
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved