MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

Sowcar janaki Passed Away: తెలుగు సినిమా మొదటి తరం నటీమణుల్లో ఒకరైన తార షావుకారు కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 21 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తిరిగిరాని లోకాలకు షావుకారు జానకి..
Image Credit : our own

తిరిగిరాని లోకాలకు షావుకారు జానకి..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెరగని గుర్తింపును అందించిన నటీమనుల్లో ఒకరు, ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత 'షావుకారు' జానకి (94) మరణించారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మొదటి సినిమా ఇంటి పేరుగా..
Image Credit : X

మొదటి సినిమా ఇంటి పేరుగా..

షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనంలోనే రేడియో నాటికల ద్వారా కళారంగంలో ప్రవేశించిన ఆమె.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు సాధించింది. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సరసన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఒక్క సినిమాతోనే 'షావుకారు జానకి'గా సినీ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు.

Related Articles

Related image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Related image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
34
70 ఏళ్లకు పైగా సినీ జీవితంలో రికార్డు స్థాయిలో సినిమాలు..
Image Credit : stockPhoto

70 ఏళ్లకు పైగా సినీ జీవితంలో రికార్డు స్థాయిలో సినిమాలు..

సుదీర్ఘమైన సినిమా ప్రయాణం చేసిన అరుదైన హీరోయిన్లలో .. షావుకారు జానకి ఒకరు.దాదాపు 70 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేసన్, జెమిని గణేసన్, ఎంజీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజ నటులందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. షావుకారు, కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, ఉయ్యాల జంపాల, అక్కచెల్లెళ్లు, దేవుడు చేసిన మనుషులు, తాయారమ్మ బంగారయ్య, బడిపంతులు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆమె నటనా పటిమకు నిదర్శనాలు.

44
చివరి చిత్రం - పురస్కారాలు
Image Credit : our own

చివరి చిత్రం - పురస్కారాలు

పౌరాణిక, సాంఘిక, హాస్య, సెంటిమెంట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా జీవించడం ఆమె నైజం. వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బామ్మ పాత్రల్లోనూ మెప్పించారు. 2020లో వచ్చిన 'బిస్కోత్' చిత్రంలో ఆమె చివరిసారిగా కనిపించారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన విశేష సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2022లో దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో గౌరవించింది. వీటితో పాటు అనేక నంది పురస్కారాలు, కళాకారుల సంఘాల గౌరవాలు ఆమెను వరించాయి. ఇక వయోభారం, అనారోగ్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందుల వల్ల కొద్దిరోజుల క్రితం ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా, పరిస్థితి క్షీణించి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Related Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved