MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి

Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి

దేశభక్తి, ప్రేమ కథ అంశాలని మిళితం చేసి తెరకెక్కనుంచి చిత్రం పహల్‌గామ్ లవ్ స్టోరీ. ఈ చిత్రం నేడు ఆగష్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం.

3 Min read
Author : Tirumala Dornala
Published : Aug 21 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pahalgam Love Story Review
Image Credit : Asianet News

Pahalgam Love Story Review

దేశభక్తి సినిమాలు ఒకప్పుడు వరసగా వచ్చేవి. పెద్ద హీరోలు సైతం ఆ తరహా సినిమాలు చేసేవారు. అయితే ఆ తరహా కథల పట్ల బోర్ కొట్టిందో, ట్రెండ్ అయ్యిపోయిందనుకున్నారో, లేక దేశం బాగానే ఉందనుకున్నారో కానీ తగ్గించేశారు. అయితే సీనియర్ దర్శకుడు పి.ఎన్ రామచంద్రరావు మాత్రం ఇలాంటి కథతోనే తన రీఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అలా వచ్చిన సినిమానే ‘ పహల్‌గామ్ లవ్ స్టోరీ’.జాతీయ భద్రత, దేశభక్తి, నిఘా వర్గాల వ్యూహాల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా ఉంది. చూడదగినదేనా వంటి విషయాలు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కథాంశం
Image Credit : Asianet News

కథాంశం

సాగర్ (కృష్ణబాబు), చిత్ర (చిత్ర శుక్ల) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటూంటారు. తమ ప్రయాణంలో భాగంగా కాశ్మీర్ పర్యటనకు వెళ్తారు. అక్కడ మంచు కొండల నడుమ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న సమయంలో, వాళ్లకు తెలియకుండానే ఒక హత్య దృశ్యం కెమెరాలో రికార్డ్ అవుతుంది.

అయితే అది సాధారణ నేరం కాదు... సరిహద్దు దాటి వచ్చి మన దేశంలో పెద్ద విధ్వంసానికి ప్లాన్ చేస్తున్న ఒక ప్రమాదకరమైన ఉగ్రవాద ముఠా చేసిన హత్య. కెమెరాలోని ఆ ఫుటేజ్ బయటపడితే తమ కుట్ర బయటపడుతుందని భావించిన ఆ గ్యాంగ్, ఈ ప్రేమికులపై వేట మొదలుపెడుతుంది. చిత్రను కాపాడేందుకు సాగర్ ఆమెను ముందుగా స్వగ్రామానికి పంపించి, తాను మాత్రం ఆ ముఠా పన్నిన వలలో చిక్కుకుంటాడు. అమాయకుడైన సాగర్‌పై తీవ్రమైన నేరాలు మోపబడి, పోలీసుల దృష్టిలో అతడే ప్రధాన నిందితుడిగా మారతాడు.

మరోవైపు, ఆ ఉగ్రవాద ముఠా చిత్ర ఊరికి కూడా చేరుకుని ఆమె కుటుంబాన్ని బందీగా చేయడంతో అసలు ప్రమాదం అర్దం అవుతుంది.అప్పుడు ఆమె ఏం చేసింది. తన ప్రేమికుడిని, తన కుటుంబాన్ని చిత్ర ఎలా కాపాడుకుంది? తనపై పడిన దేశద్రోహి అనే నిందను సాగర్ ఎలా తుడిచేసుకున్నాడు? చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Related Articles

Related image1
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Related image2
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
35
ఎనాలిసిస్
Image Credit : Asianet News

ఎనాలిసిస్

స్క్రీన్‌ప్లే పరంగా సినిమా ఓ థ్రిల్లర్ డిజైన్ లో నడుస్తుంది.అలాగే ప్రేమ, కాశ్మీర్ ట్రిప్, ఫొటోగ్రఫీ, ఆ తర్వాత అనుకోకుండా మర్డర్ క్యాప్చర్ కావడం.. ఇలా ఒక సంఘటన నుంచి మరో సంఘటనకు వెళ్లే విధానం ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ప్రేమకథ నుంచి ఒక్కసారిగా ప్రమాదంలోకి కథ మారే పాయింట్ మంచి స్క్రీన్‌ప్లే టర్న్.

ఇక్కడ కెమెరా ఒక ‘ప్లాట్ డివైస్’గా పనిచేయడం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అదే కెమెరా మొదట ప్రేమ జ్ఞాపకాలను రికార్డ్ చేస్తుంది. తర్వాత ఉగ్రవాదుల వేటకు కారణమవుతుంది. చివరికి నిజాన్ని బయటపెట్టే కీలక ఆధారంగా మారుతుంది. ఈ కనెక్టింగ్ థ్రెడ్ స్క్రీన్‌ప్లేకు మంచి బేస్ ఇచ్చింది.

కానీ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే కొంత పరుగు పెడుతుంది. హీరోపై తప్పుడు కేసులు, హీరోయిన్ హీరోను వెతుక్కుంటూ వెళ్లడం, ఉగ్రవాదుల వేట..వీటితో ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. అయితే ఈ ట్రాక్‌లలో మరిన్ని ట్విస్టులు, రివర్సల్స్ ఉంటే ఉత్కంఠ మరింత పెరిగేది. ప్రేక్షకుడికి సమాచారం ముందుగానే ఎక్కువగా తెలిసిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో సస్పెన్స్ తగ్గినట్లు అనిపించింది.

హీరో-విలన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా మరింత బలంగా ఉండాల్సింది. విలన్ ఒక అడుగు వేస్తే హీరో దాన్ని తెలివితో ఎదుర్కోవడం, హీరో వేసిన ప్లాన్‌ను విలన్ ఊహించడం.. ఇలా ఇద్దరి మధ్య మైండ్ గేమ్ పెరిగి ఉంటే క్లైమాక్స్‌కు మంచి బిల్డ్-అప్ వచ్చేది.

అయితే హీరోయిన్ పాత్రలో మాత్రం స్క్రీన్‌ప్లే ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. మొదట ప్రేమకథలో భాగంగా కనిపించే చిత్ర.. తర్వాత పరిస్థితులు మారినప్పుడు తానే యాక్షన్ తీసుకుని సాగర్‌ను వెతుక్కుంటూ వెళ్లడం కథకు ఎమోషనల్ డ్రైవ్ ఇస్తుంది.

45
ఎక్కడ బాగా పనిచేసింది?
Image Credit : Asianet News

ఎక్కడ బాగా పనిచేసింది?

టెక్నికల్ గా ఈ సినిమా కు ఏది ఎంతవరకూ అవసరమో అన్నట్లుగా ఉంది. కాశ్మీర్ లొకేషన్స్ ని కెమెరా అందంగా చిత్రీకరించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా వరకూ సినిమాకు మ్యాచ్ చేసుకుంటూ వెళ్లింది. ఎక్కడా తేడా లేకుండా కలిసిపోయింది.

ప్లస్ లు :

కాశ్మీర్ అందాలు

నేచురల్ నేరేషన్ , ట్విస్ట్ లు

హీరోయిన్ ఎమోషన్ యాక్షన్

మైనస్ లు:

క్లైమాక్స్

కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గటం

55
ఓవరాల్ గా :
Image Credit : Asianet News

ఓవరాల్ గా :

‘పహల్‌గామ్ లవ్ స్టోరీ’ అనేది ఒక స్పష్టమైన ఆలోచనతో, మంచి ఉద్దేశంతో తెరకెక్కిన సస్పెన్స్ పేట్రియాటిక్ థ్రిల్లర్. కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ... కాశ్మీర్ అందాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, దేశభక్తి కోణం కోసం ఈ చిత్రాన్ని వీకెండ్‌లో ఒకసారి హ్యాపీగా చూడవచ్చు.

రేటింగ్: 2.75/5

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
సినిమా సమీక్షలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Recommended image2
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved