MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నానిపై షాకింగ్‌ ట్రోల్స్.. `హిట్‌`ని ఆ దేవుడే కాపాడాలి? ఇదేందయ్యా ఇంత దారుణం..

నానిపై షాకింగ్‌ ట్రోల్స్.. `హిట్‌`ని ఆ దేవుడే కాపాడాలి? ఇదేందయ్యా ఇంత దారుణం..

హీరో నాని ఇప్పుడు ట్రోలర్స్ బారిన పడ్డారు. వివాదాలకు అతీతంగా ఉండే నాని ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. నెటిజన్లు ఆయనపై చేస్తున్న కామెంట్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 03 2022, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇండియన్‌ సినిమాల్లో సిరీస్‌, ఫ్రాంఛైజీల ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. తమిళనాట `లోకేష్‌ యూనివర్స్`(ఖైదీ, మాస్టర్‌, ఖైదీ), నీల్‌ యూనివర్స్(కేజీఎఫ్‌, కేజీఎఫ్‌2, సలార్‌), తెలుగులో `హిట్‌` ఫ్రాంఛైజీ ఓ ట్రెండ్‌ లా వస్తున్నాయి. ఈ జోనర్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు డైరెక్టర్స్. వాటిలో తెలుగులో హాట్‌ టాపిక్‌గా మారింది `హిట్‌`(Hit) సిరీస్‌. శుక్రవారం విడుదలైన `హిట్‌2`కి మంచి స్పందన లభిస్తుంది. మొదటి సినిమా హిట్‌ కావడం, `హిట్‌2` స్కేల్‌ పెంచడం, అడివి శేష్‌ నటించడం, దీన్ని ఏడు సిరీస్‌లుగా తీసుకురాబోతున్నారనే అంశాలు మరింత హైప్‌ తీసుకొచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇదిలా ఉంటే `హిట్‌3`(Hit3)ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. `హిట్‌2` క్లైమాక్స్ లోనే `హిట్‌ 3ః ది థర్డ్ కేసు` గురించి చెప్పారు. మూడో భాగంలో హీరోగా నాని(Nani)ని ప్రకటించారు. ఎండింగ్‌లో ఆ విషయాన్ని చూపించే సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్‌ ఓ రేంజ్‌లో ఇచ్చారు.  దీంతో థియేటర్లు హోరెత్తిపోయాయి. నానిని హీరోగా చూపించిన తర్వాత అసలు సమస్య స్టార్ట్ అయ్యింది. నాని అద్బుతమైన నటుడు. నేచురల్‌ స్టార్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. యాక్టింగ్ విషయంలో ఆయనకు వంక పెట్టడానికి లేదు. కానీ థ్రిల్లర్‌ చిత్రాలకు ఆయన సెట్‌ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. `హిట్‌` సినిమాకి హీరోగా నాని సెట్ కాడని, ఇక `హిట్‌`ని ఆ దేవుడే కాపాడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే విషయాన్ని వెల్లడిస్తూ నానిని ట్రోల్‌ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. 
 

35

ఇటీవల నాని `వీ` అనే చిత్రంలో నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించాడు. కానీ తన పాత్ర మేరకు బాగానే చేసినా, ఆ పాత్రలో నానిని చూడలేకపోయారు ఆడియెన్స్. దీంతో `వీ` డిజాస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత `టక్‌ జగదీష్‌`లోనూ సీరియస్‌ రోల్‌ చేశాడు నాని. అది కూడా పరాజయం చెందింది. నాని అంటే ఓ సరదా క్యారెక్టర్లు వస్తాయి. ఫన్నీ సీన్లు, అమాయకపు ఎక్స్ ప్రెషన్స్, సహజమైన కామెడీ, ఫ్యామిలీ సినిమాలు, అలాంటి పాత్రలు గుర్తొస్తాయి. అలానే నానిని చూస్తారు. ఆయన నటనని ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఇలాంటి సీరియస్‌ రోల్స్ లో నానిని చూడలేరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 
 

45

`హిట్‌2` ఎండింగ్‌లో నాని నటించే అర్జున్‌ సర్కార్‌ గురించి బిల్డప్‌ భారీగా ఇచ్చారు. ఆ హీరో ఎవరో ఎవరో అని ఆసక్తిగా చూశారు. నాని ని చూపించడంతో అప్పుడే థియేటర్లలో కొంత అసంతృప్తి కనిపించింది. బిల్డప్‌ ఇచ్చినంతగా సీన్‌ లేదని అంటున్నారు. `విక్రమ్‌` చిత్రంలో సూర్య ఎంట్రీ పీక్‌లో ఉంది. అంత క్రూయాలిటీగానూ ఉంది. అందుకే అది బెస్ట్ క్లైమాక్స్ గా నిలిచింది. కానీ `హిట్‌2`లో అది తేలిపోయిందంటున్నారు నెటిజన్లు. 
 

55

ఇదిలా ఉంటే ఈ ఫ్రాంఛైజీలో నానిని అప్పుడే నటింప చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చివర్లో వచ్చి ఉంటే బాగుండేదని, రవితేజ, రానా, విజయ్‌ సేతుపతి వంటి యాక్టర్స్ తో చేయించి, చివర్లో నానిని నటింప చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ మరో అనుమానం వ్యక్తమవుతుంది. `హిట్‌`తో పోల్చితే `హిట్‌2` ఆశించిన స్థాయిలో లేదనే టాక్‌ ఉంది. `హిట్‌3`తో ఆ క్రేజ్‌ మరింత పడిపోతుందని, ఇక ఈ సిరీస్‌ క్లోజ్‌ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ సిరీస్‌లో ఒక్క సినిమా ఆడకపోయినా పక్కన పెట్టేస్తారు. అందుకే సొంత హీరో కావడంతో `హిట్‌3`తో ఈ ఫ్రాంఛైజీని మమా అనిపిస్తారేమో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక హిట్‌ ఫ్రాంఛైజీపై ఇప్పుడు ఈ స్థాయిలో ట్రోల్స్, విమర్శలు రావడం బాధాకరం. మరి ఇది ఎంత వరకు రియాలిటీలో ఉంటుంది, ఈ సిరీస్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved