MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన శైలేంద్ర.. సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ధరణి భర్త!

Guppedantha Manasu: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన శైలేంద్ర.. సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ధరణి భర్త!

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొడుకు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Apr 26 2023, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో రిషితో మాట్లాడాలనుకుంటారు మహేంద్ర దంపతులు. కానీ రిషి కోపంగా ఉండడం చూసి తర్వాత మాట్లాడదాం అనుకొని డాబా మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్లని ఆపి జగతికి థాంక్స్ చెప్తాడు రిషి. ఒకసారి గా షాక్ అవుతుంది జగతి. అవును మేడమ్ మీరు నాకు చెప్పి చేసినా,చెప్పకుండా చేసినా మంచి పనే చేశారు. మీరు గెలిచి నన్ను గెలిపించారు.కాలేజీ పరువు నిలబెట్టారు అందుకే థాంక్స్ అంటాడు రిషి. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావు అదే మాకు చాలా సంతోషం ఉంటుంది జగతి. ఇంతకీ వసు ఏది తను మీతో రాలేదా అని అడుగుతాడు రిషి.

28

మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బస్తీకి వెళ్ళింది అని చెప్తుంది జగతి. వసు ఎంతకీ రాకపోవడంతో చాలాసార్లు ఫోన్ చేస్తాడు రిషి. ఫోన్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో  ఏం జరిగిందో అని కంగారు పడతాడు. మరోవైపు మహేంద్ర వాళ్ళు కూడా ఏం జరిగిందో వసు ఇంకా రాలేదు అంటూ కంగారు పడతారు. మరోవైపు టూ వీలర్ మీద వస్తున్న వసు నాకోసం ఇంట్లో కంగారు పడుతుంటారు ఫోన్ చేసి విషయం చెప్పాలి అనుకొని రిషికి ఫోన్ చేస్తుంది. ఎందుకు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ ఉన్నావు, నన్ను రమ్మంటావా అని అడుగుతాడు రిషి.
 

38

వద్దు సార్ నేనే వచ్చేస్తాను, ఇంటికి దగ్గరలోనే ఉన్నాను ఈరోజు మానవత్వం లేని ఒక మనిషిని చూశాను ఇంటికి వచ్చాక అదంతా చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది వసు. మరోవైపు సౌజన్య రావు, వసుతో గొడవపడిన వ్యక్తికి ఫోన్ చేసి డీలింగ్ కుదరలేదు మీరు చెప్పిన పని చేయలేనందుకు సారీ అంటాడు. దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు చెప్తున్నావా? అన్ని విషయాలు నాకు ముందే తెలిసాయి.
 

48

అసలే ఒక వ్యక్తి వల్ల డిస్టబెన్స్ గా ఉన్నాను ఫోన్ పెట్టే అంటూ కోప్పడతాడు ఆ వ్యక్తి. మరోవైపు డోర్ బెల్ మోగటంతో తలుపుతీస్తుంది ధరణి. వచ్చిన వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్య అంటూ గట్టిగా కేక పెడుతుంది. ధరణి ఎందుకు అలా అరుస్తుంది అంటూ కంగారుగా మహేంద్ర వాళ్ళు కూడా కిందికి వస్తారు. చూసేసరికి ఎదురుగా శైలేంద్ర ఉంటాడు.
 

58

 అతనే వసుతో గొడవపడిన వ్యక్తి, అతనే సౌజన్య రావుతో ఇంత వ్యవహారం నడిపిన వ్యక్తి. కొడుకుని హత్తుకుని ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి అంటూ ఆనంద పడిపోతుంది. ఫణీంద్ర కూడా అలాగే అడుగుతాడు. చెప్పకుండా వస్తే ఇంట్లోకి రానివ్వరా అంటాడు శైలేంద్ర. మహేంద్ర కూడా శైలేంద్రని పలకరిస్తాడు. జగతికి అతనిని పరిచయం చేస్తాడు. దేవయాని కూడా మీ పిన్ని అంటూ జగతిని పరిచయం చేస్తుంది.
 

68

ఇంతలోనే రిషి వచ్చి శైలేంద్రని పలకరించి చాలా ఆనంద పడిపోతాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగానే వచ్చింది నా భర్తేనా అంటూ తనని తాను గిల్లుకొని చూసుకుంటుంది ధరణి. ఈరోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అనుకుంటూ ఆనంద పడిపోతుంది. ధరణి మీకోసం చాలా బెంగపెట్టుకుంది ఆ బాధ తన కళ్ళల్లో చాలాసార్లు చూశాను. భార్యకి కావలసినది భర్త దగ్గర ఉండడం ఇప్పుడే తన కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను అంటాడు ఫణీంద్ర.
 

78

ధరణినిని శైలేంద్ర కోసం కాఫీ తీసుకు రమ్మంటాడు ఫణీంద్ర. నువ్వేమీ అక్కర్లేదు నేను తీసుకొస్తాను అంటుంది దేవయాని. నువ్వు కూర్చో శైలేంద్ర వచ్చినందుకు నీకు ఎంత ఆనందంగా ఉందో తనకి కూడా అంతే ఆనందంగా ఉంటుంది కాఫీ తనే తెస్తుంది అనటంతో  కోపంతో మూతి ముడుచుకుంటుంది దేవయాని. శైలేంద్రని తన గదికి తీసుకువెళ్తాడు రిషి. ఈగది కంఫర్ట్ గానే ఉందా లేకపోతే నాగది ఇచ్చేస్తాను అంటాడు రిషి.
 

88

ముందు ముందు నువ్వు ఇవ్వవలసింది చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇద్దువుగానివిలే అంటాడు శైలేంద్ర. ఒక్కొక్కసారి నీ మాటలు అర్థం కావు అంటాడు రిషి. నా సంగతి వదిలేయ్ నువ్వు మాత్రం మంచి పేరు తెచ్చుకుంటున్నావు, నీ గురించి అమెరికాలో కూడా మాట్లాడుకుంటున్నారు అంటాడు శైలేంద్ర. వస్తూనే నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు అంటాడు రిషి. ఇంతలో ధరణి కాఫీ తీసుకొని రావటంతో రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు తలుపు దగ్గరికి వేసి రావాలని తెలియదా అని ధరణితో చెప్తాడు శైలేంద్ర. ఆమె అలాగే చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Recommended image2
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Recommended image3
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved