MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా తగ్గని సమంత క్రేజ్‌.. టాప్‌ హీరోయిన్లందరికీ ఝలక్.. తనే నెంబన్‌ వన్‌..

సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా తగ్గని సమంత క్రేజ్‌.. టాప్‌ హీరోయిన్లందరికీ ఝలక్.. తనే నెంబన్‌ వన్‌..

సమంత మరింత షైన్‌ అవుతుంది. ఆమె క్రేజ్‌ మరింత పెరుగుతుంది. భారీ పాన్‌ ఇండియా సినిమా చేయలేదు, ఇటీవల భారీ హిట్లు లేవు, కానీ సమంత మాత్రం మరింతగా రీచ్ అవుతుంది. ఆమె పాపులారిటీ మరింత పెరుగుతుంది. అదే ఆశ్చర్యపరుస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 22 2023, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత.. ఇటీవల ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యం రీత్యా తాను బ్రేక్‌ తీసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో కోట్ల మంది అభిమానులను ఆందోళనకి గురయ్యారు. ఏడాది పాటు మిస్‌ అవుతామనే బాధ వారిలో వెంటాడింది. అయినా ఆమెకి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. రెట్టింపు స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సమంత నటించాల్సిన ప్రాజెక్ట్ లు(ఖుషి, సిటాడెల్‌) షూటింగ్ లు పూర్తి కావడంతో ఆమె ఇప్పుడే విశ్రాంతిలో ఉన్నారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సమంత ఇప్పుడు ప్రశాంతమైన లైఫ్‌ని అనుభవిస్తున్నారు. ఇంట్లో తన క్యాట్‌తో, పెట్‌ డాగ్‌ లతో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు ఇషా ఫౌండేషన్‌లో ధాన్యం చేస్తున్నారు. పూర్తిగా ఆధ్యాత్మి సేవ వైపు ఆమె టర్న్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. రెండేళ్ల క్రితం సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకుంది సమంత. కానీ దాని తాలుకూ ఎఫెక్ట్ ఇంకా ఉందట. తరచూ ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తిగా దాన్నుంచి బయటపడేందుకు మళ్లీ తనని మరింత బలంగా మార్చుకునేందుకు సామ్‌ ఈ బ్రేక్‌ తీసుకుంది. 
 

36

అయితే ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా సమంత క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు సరికదా మరింత పెరుగుతుంది. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఇండియాలోనే టాప్‌ హీరోయిన్‌గా నిలిచింది. క్రేజ్‌, పాపులారిటీ, సినిమాలు, ఫాలోయింగ్‌ ఇలా అన్ని యాంగిల్‌లో ప్రముఖ సెలబ్రిటీ రేటింగ్‌ సంస్థ ఓర్మాక్స్ ప్రకటించిన తాజా జాబితాలో సమంత నెంబర్‌ 1 స్థానంలో నిలవడం విశేషం. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు, సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్స్ అందరిని వెనక్కి నెట్టి సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఎక్కువ మంది ప్రేమించి కథానాయికగా, మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్స్ జాబితాలో సామ్‌ ఫస్ట్ ప్లేస్‌ దక్కించుకోవడం విశేషం. 
 

46

సమంత ముందు దీపికా పదుకొనె, అలియాభట్‌, కియారా, నయనతార, త్రిష, రష్మిక మందన్నా, కత్రినా కైఫ్‌, కాజల్‌, కీర్తిసురేష్‌లు కూడా వెనకబడిపోవడం గమనార్హం. టాప్‌ 10 హీరోయిన్లలో సమంతది ఫస్ట్ ప్లేస్‌ కాగా, అలియా భట్‌ రెండో స్థానంలో, దీపికా పదుకొనె మూడో స్థానంలో, నయనతార నాలుగు, కాజల్‌ ఐదు, త్రిష ఆరు, కత్రినా ఏడు, కియారా ఎనిమిది, కీర్తిసురేష్‌ తొమ్మిది. కాగా నేషనల్‌ క్రష్‌ రష్మిక పదో స్థానంలో నిలవడం ఆశ్చర్యపరుస్తుంది. రకుల్‌, తమన్నా, అనుష్క, పూజా హెగ్డేలకు ఇందులో చోటు దక్కలేదు. 
 

56

సమంతకి `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్‌ సిరీస్‌ ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చిపెట్టింది. మూడేళ్ల క్రితం అది వచ్చినా, దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. దీనికితోడు `యశోద`, `శాకుంతలం` వంటి పాన్‌ ఇండియా మూవీస్‌ చేసింది. అయితే అవి ఆదరణ పొందకపోయినా వాటి ఇంపాక్ట్ ఉంది. మరోవైపు `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌తో ఇండియానే ఊపేసింది. పెద్ద పెద్ద స్టార్స్ ఈ పాటలో సమంతని ఇమిటేట్‌ చేయడం విశేషం. ఈ పాట మాస్‌ లోకి బాగా వెళ్లింది. నార్త్ కి బాగా రీచ్‌ అయ్యింది. దీనికితోడు తన పర్సనల్‌ లైఫ్‌లో జరిగిన విషయాలు ఆడియెన్స్ లో సింపతీని పెంచాయి. ఇవన్నీ ఆమెకి తిరుగులేని కథానాయికని, ఎక్కువ మంది ప్రేమించి నటిగా మార్చాయని చెప్పొచ్చు. 
 

66

సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్‌ కాఉనంది. దీంతోపాటు హిందీలో వరుణ్‌ దావన్‌తో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ చేసింది. ఇది హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌కి రీమేక్‌. రాజ్‌ డీకేలు రూపొందించారు. ఇది త్వరలో రాబోతుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved