- Home
- Entertainment
- పట్టు చీరలో కట్టిపడేస్తున్న సదా అందం.. దీపావళి స్పెషల్ అదిరిపోయింది.. ఏంజెల్‌లా ఉందట..
పట్టు చీరలో కట్టిపడేస్తున్న సదా అందం.. దీపావళి స్పెషల్ అదిరిపోయింది.. ఏంజెల్‌లా ఉందట..
`జయం` భామ సదా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ షోకి తెరలేపుతుంది. బ్యాక్ టూ బ్యాక్ ఫోటో షూట్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.

ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తెలుగు తెరపై సందడి చేసింది సదా. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో మెప్పించిన సదా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో రాణించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం టీవీ షోస్‌లోనూ సందడి చేస్తుంది. మరోవైపు వరుసగా ఫోటో షూట్లతో కట్టిపడేస్తుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు తెగ ట్రై చేస్తుంది.
తాజాగా పట్టుచీరలో మెరిసింది సదా. రెడ్ శారీలో వొంటి నిండా నగలు పెట్టుకుని దగదగ మెరిసిపోతుంది సదా. ఓ క్లాత్స్ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది. తాజాగా అయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ కొత్త ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సదా వైల్డ్ లైఫ్‌ని ఇష్టపడుతుందనే విషయం తెలిసిందే. ఆమె తరచూ ఫారెస్ట్ లో జంతువులు, పక్షులతో సరదాగా టైమ్ స్పెండ్ చేయడం, వాటి ఫోటోలు తీయడం చేస్తూ ఆకట్టుకుంటుంది. వెకేషన్ మాదిరిగా ఫారెస్ట్ టూర్లని ఆమె తెగ ఎంజాయ్ చేస్తుంది.
సదా చివరగా `టార్చ్ లైట్` అనే తమిళ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుంది. యానిమల్ లవర్‌గా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. యానిమల్ రైట్స్ సపోర్ట్ గా నిలుస్తుంది. ఆమె `వేగాన్` అనే సంస్థలో పనిచేస్తుంది. శాకాహారిగా ఉంటున్నారు.
దాని కారణంగానే సదా సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రాణించే ప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య `జబర్దస్త్`, `ఢీ`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరిసింది. నటిగా రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆమెకి ఎలాంటి ఆఫర్ రాలేదని తెలుస్తుంది. కానీ రావడం మాత్రం పక్క అని టాక్.
తెలుగులో హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ అందాల భామ ఇప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. మారిన కాలానికి అనుగుణంగా తను కూడా మారుతుంది. ఈ మధ్య చాలా మంది ఒకప్పటి హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తూ వెండితెరపై మరోసారి మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సదా కూడా ఆ ప్రయత్నాల్లోనే బిజీగా ఉందట.
సదా తెలుగులో `జయం`తో ఎంట్రీ ఇచ్చి, `ప్రాణం`, `నాగ`, `దొంగా దొంగది`, `లీలా మహల్ సెంటర్`, `ఔనన్నాకాదన్నా`, `చుక్కల్లోచంద్రుడు`, `వీరభద్ర`, `టక్కరి`, `మైత్రి`, `దశ తిరిగింది` వంటి చిత్రాల్లో మెరిసింది సదా. మరి రీఎంట్రీ ఏ హీరో సినిమాతో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.