- Home
- Entertainment
- స్లీవ్ లెస్ బ్లౌజ్, పింక్ శారీలో రీతూ వర్మ సూపర్ లుక్.. చీరకట్టు అందాలతో మైమరిపిస్తున్న తెలుగు హీరోయిన్..
స్లీవ్ లెస్ బ్లౌజ్, పింక్ శారీలో రీతూ వర్మ సూపర్ లుక్.. చీరకట్టు అందాలతో మైమరిపిస్తున్న తెలుగు హీరోయిన్..
తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) చీరకట్టులో మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయి అందాలతో నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటున్న తెలుగు హీరోయిన్ రీతూ వర్మ విభిన్నపాత్రల్లో నటిస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ లో వెలుగొందుతోంది.
తన కేరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లే పాత్రల్లోనే నటిస్తోంది. ఆడియెన్స్ ను ఆకట్టుకునే రోల్స్ లో అద్భుతమైన పెర్పామెన్స్ తో అలరిస్తోంది. అయితే అటు సినిమాల్లోనే కాకుండా రీతూ వర్మ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివగ్ గా కనిపిస్తోంది.
లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుందీ. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రీతూ వర్మ అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ పిక్స్ లో రీతూ వర్మ ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. చీరకట్టు అందాలతో కుర్రాళ్లను తనవైపు ఆకర్షిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలను విందుచూస్తూ మతిపోగొడుతోంది. పింక్ శారీలో అచ్చమైన తెలుగమ్మాయి ఆకట్టుకునేలా ఫోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే రీతూ వర్మ ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే ఫొటోషూట్లు చేస్తుంటుంది. అభిమానులు కూడా ఆమెను చీరకట్టులోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఫ్యాన్స్ అభిరుచి మేరకే రీతూ కూడా ఫొటోషూట్లు చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
నేచురల్ స్టార్ నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ.. అప్పటి నుంచి డీసెంట్ రోల్స్, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. చివరిగా ‘వరుడు కావాలెనులో’ మెరిసింది. ప్రస్తుతం ఆమె చిత్రాలు ‘ఒకే ఒక జీవితం’, ‘ఆకాశం’, ‘ధ్రువ నక్షతం’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.