MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసభ్యంగా డ్యాన్స్, తమన్నా కంటే ఈ యంగ్ హీరోయిన్లు చాలా బెటర్.. నిర్మాత బోల్డ్ కామెంట్స్

అసభ్యంగా డ్యాన్స్, తమన్నా కంటే ఈ యంగ్ హీరోయిన్లు చాలా బెటర్.. నిర్మాత బోల్డ్ కామెంట్స్

తమన్నా పెర్ఫామ్ చేసిన కావాలయ్యా సాంగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్, గ్లామర్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 31 2023, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత రజనీకాంత్ అసలైన బాక్సాఫీస్ స్టామినా ప్రదర్శించిన చిత్రం ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా చిన్న రోల్ ప్లే చేస్తూ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. 

 

26

తమన్నా పెర్ఫామ్ చేసిన కావాలయ్యా సాంగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్, గ్లామర్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. అదే క్రమంలో ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ పై అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. తమన్నా కాళ్ళ మధ్యలో చేయి చూపిస్తూ డ్యాన్స్ చేయడంతో విమర్శంచిన వాళ్ళు కూడా ఉన్నారు. 

36

అయితే తాజాగా జైలర్ చిత్రంలో తమన్నా డ్యాన్స్ పై ఓ సీనియర్ నిర్మాతపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. నటుడు నిర్మాత అయిన కె రాజన్.. రారా సరసక్కు రారా అనే చిత్ర ఈవెంట్ లో కె రాజన్ తమన్నాని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు కేశవ్ దేపూర్ తెరకెక్కిన ఈ చిత్రం అడల్ట్ కంటెంట్ తో రూపొందింది. 

46

నిర్మాత కె రాజన్ మాట్లాడుతూ అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వారి కోసం ఇలాంటి చిత్రాలు రావాలి. సినిమా షూటింగ్ సమయంలో పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురవుతున్నాయి. వారికీ మామూళ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లంచాలు అడుగుతున్నారు. షూటింగ్స్ కి అనుమతి విషయంలో సింగిల్ విండో విధానం తేవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కి విజ్ఞప్తి చేసినట్లు రాజన్ పేర్కొన్నారు. 

56

ఇక చిత్రం గురించి మాట్లాడుతూ.. అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇలాంటి చిత్రాలు తెరకెక్కించాలి. జైలర్ చిత్రంలో తమన్నా  చేసిన డ్యాన్స్ కంటే అసభ్యంగా ఈ చిత్రంలో ఏమీలేదు. తమన్నాతో పోల్చుకుంటే ఈ చిత్రంలో నటించిన యంగ్ హీరోయిన్లు చాలా బెటర్ అని రాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

66

తమన్నా డ్యాన్స్ ని విమర్శించవచ్చు కానీ.. ఇలా అడల్ట్ చిత్రంతో పోల్చుతూ విమర్శించడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రారా సరసకు రారా చిత్రంతో ఏమాత్రం సంబంధం లేదని తమన్నాని ఎందుకు లాగడం అంటూ రాజన్ ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ అమ్మాయిల నేపథ్యంలో బోల్డ్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 3న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved