MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Pithapuramlo: ఇరుముడి, మా ఇంటి బంగారం తరహాలో మరో మూవీ.. `పిఠాపురంలో..` రిలీజ్‌ ఎప్పుడంటే?

Pithapuramlo: ఇరుముడి, మా ఇంటి బంగారం తరహాలో మరో మూవీ.. `పిఠాపురంలో..` రిలీజ్‌ ఎప్పుడంటే?

Pithapuramlo: పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ పేరుతో సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీమ్‌.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 10 2026, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రిలీజ్‌ డేట్‌
Image Credit : Asianet News

పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రిలీజ్‌ డేట్‌

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం `పిఠాపురంలో అలా మొదలైంది`. ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. `ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 18న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పిఠాపురంలో..
Image Credit : Asianet News

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పిఠాపురంలో..

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ప్రేమ, సునిశితమైన హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి భావోద్వేగ అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు. మన చుట్టూ కనిపించే సహజమైన పాత్రలు, సంఘటనలతో సినిమా ఎంతో సహజంగా ఉంటుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన అన్నారు.

Related Articles

Related image1
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Related image2
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
34
ఇరుముడి, మా ఇంటి బంగారం తరహాలో సినిమా
Image Credit : Asianet News

ఇరుముడి, మా ఇంటి బంగారం తరహాలో సినిమా

హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో కీలక పాత్రలో నటించారని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అని మహేష్ చంద్ర తెలిపారు. ఇరుముడి, విశ్వనాథం అండ్ సన్స్, మా ఇంటి బంగారం తరహా లోనే మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుందని మహేష్ చంద్ర చెప్పారు. ఇదిలా ఉంటే `పిఠాపురం` నియోజకవర్గం.. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

44
పిఠాపురంలో అలా మొదలైంది మూవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు
Image Credit : Asianet News

పిఠాపురంలో అలా మొదలైంది మూవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Nagarjuna: వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది, నాగార్జునని ఏకిపారేసిన అన్వేష్..వెధవలు స్కూల్స్ కి వెళ్లడం ఏంటి ?
Recommended image3
Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్ నిడిమోరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved