- Home
- Entertainment
- Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?
Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?
Venkatesh: ఒక్క ఫైట్ లేదు.. విలన్ అంతకన్నా లేడు. యాక్షన్ సీన్స్ లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది వెంకటేష్ సినిమా. ఈ సినిమా యావరేజ్ ఆడుతుందేమో అనుకున్నారు. కానీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి షాక్ ఇచ్చింది. ఈ మూవీ చూసి వెంకటేష్ భార్య ఏమన్నదో తెలుసా?

ఆల్-టైమ్ క్లాసిక్ సినిమా..
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఆల్-టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా, కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కడుపుబ్బ నవ్వించే డైలాగులు, కోటి అందించిన మధురమైన సంగీతం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి.
నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూసి వెంకటేష్ భార్య ఏమన్నదంటే?
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా గురించి నిర్మాత స్రవంతి రవికిషోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను చూసిన వెంటనే విక్టరీ వెంకటేష్ భార్య (నీరజ) దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక అద్భుతమైన మాట అన్నారట. "ఈ సినిమా రాబోయే 15 నుండి 20 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది (This is going to be remembered for ever for the next 15-20 years)" అని ఆమె ఆ రోజే చాలా నమ్మకంగా చెప్పారు.
కొన్ని సినిమాలు అంతే..
ఆమె అన్నట్లే, విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా నేటికీ అంతే ఫ్రెష్‌గా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, తాము ‘నువ్వే కావాలి’ లేదా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలు తీస్తున్నప్పుడు అవి ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్లు అవుతాయని, పది కాలాల పాటు ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించలేదని నిర్మాత రవికిషోర్ అన్నారు. ఒక మంచి సినిమా తీయాలనే నిస్వార్థ ప్రయత్నం మాత్రమే చేశామని, ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పట్టారని చెప్పారు.
కష్టపడి ఇష్టపడి చేసిన అన్ని సినిమాలు విజయవంతం కాకపోవచ్చని, కొన్ని సినిమాలు జనం ఆదరణకు నోచుకోకపోవచ్చు. సాధారణంగా బయట ఎవరైనా విజయం సాధించిన చిత్రాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు కానీ, ఒక నిర్మాతగా లేదా టెక్నీషియన్ అయితే.. పోయిన సినిమాలను కూడా అంతే సమానంగా ప్రేమిస్తామని (We love them equally), మనస్సులో ఆ ప్రాసెస్ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.
వెంకటేష్ కథల సెలక్షన్ ఎలా ఉంటుందంటే?
దగ్గుబాటి వెంకటేష్ ఇన్నేళ్ల పాటు కోట్లాది మందికి అభిమాన హీరోగా నిలవడానికి ప్రధాన కారణం ఆయన కథల ఎంపికేనని నిర్మాత రవికిషోర్ మెచ్చుకున్నారు. వెంకటేష్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసినప్పటికీ, వాటిలో ‘సోల్’ ఉన్న కథలనే ఎంచుకుంటారని, అందుకే ఆయన చేసే పాత్రలు ఎన్నేళ్లు గడిచినా అలా గుర్తుండిపోతాయని తెలిపారు.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాను చూసిన ఒక ప్రముఖ వ్యక్తి దీన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘గుండమ్మ కథ’తో పోల్చారట. కుటుంబ సమేతంగా కూర్చుని ఎన్నిసార్లు చూసినా విసుగు కలగని గొప్ప ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిలిచిందని ప్రశంసించారు. ‘గుండమ్మ కథ’ లాంటి మహామహుల క్లాసిక్ సినిమాల పక్కన ఈ చిత్రాన్ని చేర్చి మాట్లాడటం వినడానికి చాలా సంతోషంగా ఉందని నిర్మాత రవికిషోర్ ఆనందం వ్యక్తం చేశారు.
నువ్వు నాకు నచ్చావ్ రికార్డులు
2001 సెప్టెంబర్ 6న విడుదలైన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించింది. అప్పట్లో మాస్, ఫ్యాక్షన్ చిత్రాలు ఏలుతున్న రోజుల్లో ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా తీసి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అరుదైన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రం 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు అలాగే.. 3 కేంద్రాలలో 175 రోజులు ఆడి అప్పటి వరకు ఉన్న అనేక రికార్డులను తిరగరాసింది. మరీ ముఖ్యంగా కోటి అందించిన పాటలు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించాయి.ఏళ్లు గడుస్తున్నా బుల్లితెరపై ప్రసారమైన ప్రతిసారీ భారీ టిఆర్పి (TRP) రాబడుతూ, ఈ తరం ప్రేక్షకులను సైతం అలరిస్తూ ‘నువ్వు నాకు నచ్చావ్’సినిమా.

