MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దుర్గను పోలీసులకు పట్టించిన మోనిత.. కాపాడి షాకిచ్చిన డాక్టర్ బాబు?

Karthika Deepam: దుర్గను పోలీసులకు పట్టించిన మోనిత.. కాపాడి షాకిచ్చిన డాక్టర్ బాబు?

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 20వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. 

5 Min read
Navya G
Published : Oct 20 2022, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..కోపంగా దీప ఇంటి దగ్గరికి వచ్చిన మోనితతో దీప,నువ్వు మొన్న దుర్గతో ఇంట్లో ఉండడానికి అని డాక్టర్ బాబుని రెండు గంటలు బయట తిప్పమని శివకు చెప్పావట కదా అని అనగా మోనిత కోపంతో నేను అలా చెప్పలేదు కార్తీక్ అని అనగా, ఒకసారి అయితే నమ్మకపోవడానికి ప్రతిసారి అదే జరుగుతుంది కదా మళ్ళీ నువ్వు ఆ మాట అంటే తట్టుకోలేను అందుకే ముందే బయటికి వచ్చేసాము అని కార్తీక్ అంటాడు.దానికి మోనిత, ఇప్పుడు రా కార్తిక్ అని అనగా నేను రాను మోనిత. ఈ వంట నేనే చేశాను మధ్యలో వదిలేస్తే బాగోదు తినేసి వస్తాను అని కార్తీక్ అంటాడు.అప్పుడు మోనిత మనసులో, మిమ్మల్ని కాదు ఆ దుర్గ గాడిని అనాలి వాడి వల్ల ఇదంతా వచ్చింది అని కోపంగా దుర్గ ని తిట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మోనిత. అప్పుడు కార్తీక్ మనసులో,గతం మర్చిపోయి గుర్తుందని చెప్పలేని పరిస్థితుల్లో నా భార్యతో కొంచెం సమయం గడుపుదామని వస్తే దాన్ని కూడా దూరం చేసే పరిస్థితి తీసుకొస్తున్నావు మోనిత అని అనుకుంటాడు కార్తీక్. ఆ తర్వాత సీన్లో దుర్గ, మోనిత ఇంటి ఎదురుగా ఫోన్లో మాట్లాడుతూ,పోలీస్ కేసు ఏం అవ్వదు రా మన మీద ఏ అనుమానము రాదు నువ్వు భయపడకుండా ఉండు.

27

మన దగ్గర ఆధారాలు లేవు కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదే సమయంలో మోనిత అక్కడికి వస్తుంది అప్పుడు దుర్గ, మోనితతో, ఏంటి బంగారం వెళ్ళావా కార్తీక్ దీప లను ఒంటరిగా చూసావా చూసిన తర్వాత గుండె బద్దలైందా అని అడగగా నాకు గుండె బద్దలు ఇవ్వడం కాదురా మీ అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెట్టెలా చేస్తాను రేపు సాయంత్రం ఈ సమయానికల్లా మీ అందరి జీవితం ముగిసిపోయినట్టే. నిన్ను వంటలక్కని మా నుంచి ఎలా విడదీయాలో నాకు తెలుసు. నాకు కార్తీక్ ని ఎలా దక్కించుకోవాలో న తెలుసు చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత. అప్పుడు మోనిత మాటలు విన్న దుర్గ ఏంటిది ఇంత ధైర్యంగా ఉన్నది అని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత సీన్లో దీప కార్తిక్ భోజనం చేసి చేయి కడుక్కుంటూ ఉండగా కార్తీక్, నేను వెళ్ళొస్తాను దీప అని అంటాడు. అప్పుడు దీప, కొంచెం సేపు ఉండొచ్చు కదా డాక్టర్ బాబు అని అంటుంది. అదే సమయంలో దుర్గ అక్కడికి వస్తాడు. అప్పుడు దుర్గ,వెళ్లాలనుకుంటే వెళ్ళండి సార్ కానీ అక్కడ మోనిత నిప్పులు కక్కుతుంది జాగ్రత్త అని చెప్తాడు దానికి కార్తీక్, దాని గురించి పట్టించుకోవద్దు అని అంటాడు కార్తీక్.
 

37

కార్తీక్ మనసులో, పాపం దీప దుర్గ ని వాడుకొని మోనితని నా నుంచి వేరు చేద్దామనుకుంటుంది కానీ ఆ మోనిత వళ్ళ దీపకు,శౌర్య కు ఏవైనా ప్రమాదం ఉంటుందేమో అని భయంగా ఉంది అని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్లిపోయిన తర్వాత దుర్గ జరిగిన విషయం అంతా దీపకు చెప్పగా దీప అయోమయ స్థితిలో ఉంటుంది అది ఎప్పుడు అలాగే అంటుందిలే ఏం పట్టించుకోవద్దు దుర్గా అని దీప అంటుంది. లేదు దీపమ్మ, ఎప్పుడూ తన కళ్ళలో భయం కనిపించింది కానీ ఇంత ధైర్యం కనిపించలేదు ఇంత ధైర్యం ఉందంటే ఏదో చేసింది. మనం ముందు జాగ్రత్తగా ఉండాలి అని అనగా, ఏం చేసి ఉంటాది దుర్గ అని దీప అడుగుతుంది. కిందటిసారి రౌడీలను పంపించినట్టు మళ్ళీ చేస్తుందా అసలకే అది ఎంత కొట్టినా చావని పాము జాగ్రత్తగా ఉండాలి అని అనగా, జాగ్రత్త దుర్గ మనం దాన్ని ఒక కంట కనబడుతూనే ఉండాలి ఎందుకైనా మంచిది ఒక కన్ను దానిమీద వెయ్యు అని చెప్తుంది దీప. ఆ తర్వాత సీన్లో శివ బోటిక్ ఎదురుగుండా నించొని ఆలోచిస్తూ అసలు సార్ ఎందుకు ఆ పాపని వెతకమన్నారు మేడం ఎందుకు వద్దంటున్నారు? సార్ ఎవరి గురించి ఆలోచించినా మేడం కంగారు పడిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు.
 

47

ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి పాప గురించి వెతకావా అని అనగా 4 కాలనీలు తిరిగాను సార్ దొరకలేదు అని చెప్పి మనసులో, ఇప్పుడు మేడం వెతకొద్దు అని చెప్పారు అంటే గొడవలు అయిపోతాయేమో అసలుకే ఉప్పు నిప్పులాంటి వాళ్ళు అని అనుకుంటాడు శివ. మీ మేడం ఏది అని కార్తీక్ అడగగా బయటికి వెళ్లారు సార్ మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నారు అని అంటాడు శివ. దానికి కార్తీక్, నేను బయట ఉంటే తను ఇంట్లో ఉండాలి నేను ఇంట్లో ఉంటే తను బయట ఉండాలి ఏంటి శివ ఇది అని అనగా శివ ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెడతాడు. ఎందుకు శివ అలా ఉన్నావు అని కార్తీక్ అడుగగా, సర్ మీరు నా పేరు చెప్తున్నారు సర్. మీకు నా పేరు గుర్తొచ్చింది నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ జన్మకి ఇది చాలు ఇప్పుడు చెప్పండి సార్ మీకు ఏం చేయాలంటే అది చేస్తాను ఎవరు వద్దన్నా అని శివ అనగా, ఎవరు వద్దన్నా అంటే దీప మోనిత కి ఈ విషయం తెలిసిందా అని అనగా లేదు సార్ అని శివ అంటాడు. అయితే ప్రతిరోజు వంటలక్క ఇంటి ఎదురుగుంట రాత్రులు పడుకో అని కార్తీక్ అంటాడు. దానికి శివ ఆశ్చర్యపోయి మనసులో దేపక్క తో మాట్లాడితేనే చంపేస్తుంది మేడం, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంక నా పని అయిపోయినట్టే అని అనుకుంటాడు శివ.

57

ఆ తర్వాత సీన్లో మోనిత, దుర్గ గురించి ఆలోచిస్తూ నా ప్రాణాలు తీయడానికే దుర్గ గాడు వచ్చాడు అసలు ఇన్ని రోజులు దుర్గ అనే వాడే లేకపోతే ఈ పాటికి నేను, కార్తీక్ హాయిగా ఉండేవాళ్ళము. ఆ దీప ను వదిలించుకునే దాన్ని రేపు నేను కార్తీక్  కెనడా చెక్కేస్తున్నాము ఆ దీప ఎలా వస్తుందో నేను చూస్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో దీప, దుర్గ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ భయపడి ఒకసారి డాక్టర్ బాబుని కలవాలి అని అనుకుంటుంది. అదే సమయంలో మోనిత ఇంటిదగ్గర దుర్గ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దుర్గ అలా ఉండడం చూసిన కార్తీక్ దుర్గ ఎప్పుడు మోనితను భయపెట్టేవాడు ఈ రోజు వీడి కళ్ళలో భయం ఉన్నది ఎందుకని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో దీప అక్కడికి వచ్చి ఓ కంగారుగా మోనిత ఎక్కడా అని అడుగుతుంది. లేదు బయటికి వెళ్లింది ఏమైంది అని కార్తీక్ అడగగా జరిగిన విషయం అంతా కార్తిక్ కి చెప్తుంది దీప. ఇంతలో మోనిత పోలీసులు పట్టుకొని అక్కడికి వస్తుంది.ఎవరు వీళ్లంతా అని కార్తీక్ అడగగా ఇన్స్పెక్టర్ సార్ వాడే సార్ దుర్గ.వెళ్లి అరెస్ట్ చేయండి అని మోనిత అంటుంది.

67

దానికి దుర్గ, నేనేం చేశాను నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అనగా, ఉదయం దుర్గ ఫ్రెండ్ తో మాట్లాడిన విషయాలన్నీ మోనిత వీడియో తీసి పోలీసులు పంపిస్తుంది. అప్పుడు పోలీసులు దాన్ని సాక్ష్యంగా చూస్తారు. అప్పుడు మోనిత, ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను కార్తీక్ వీడు పెద్ద క్రిమినల్ అని అనగా కార్తీక్ తెలివిగా ఆలోచిస్తూ, అవును మోనిత దుర్గ ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తనని నీ స్నేహితుడు నీ బంధువు అని ఎందుకు చెప్పావు? గుర్తుగా ఉంటాదని నేను ఆ వీడియో కూడా తీశాను అని ఆ వీడియో చూపిస్తాడు కార్తీక్.అందులో మోనిత, దుర్గ నా స్నేహితుడు బంధువు మేమిద్దరం కలిసి చాలా పనులు చేసాము అని అంటుంది.అప్పుడు ఆ వీడియో చూసిన పోలీసులతో కార్తీక్, వీళ్లిద్దరూ కలిసి చాలా పనులు చేశారంటే ఈ విషయాల్లో మోనిత కి కూడా భాగం ఉంటుంది కదా అని అంటాడు. అప్పుడు దీప, నవ్వుకుంటూ దాన్ని తిక్క కుదిరింది అయినా డాక్టర్ బాబు ఎందుకు దుర్గకు సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటుంది. అప్పుడు పోలీసులు మోనితతో మిమ్మల్ని కూడా ఇంట్రాగేట్ చేయాలి అని అనగా కార్తీక్, అవసరం లేదండి వీళ్లది ఏం తప్పులేదు ఈమె గతం మర్చిపోయింది అందుకే ఇలాగే ఏవేవో చేస్తుంది అని కార్తీక్ అంటాడు.
 

77

 దానికి మొనిత, కార్తీక్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. నేను తన మీదే వేసిన వల నా వైపే పడినట్టు ఉన్నది అని అనుకుంటుంది. అప్పుడు పోలీసులు మరి ఈ వీడియో ఏంటి అని దుర్గ చెప్పిన మాటలు గురించి అడుగుతారు. దానికి దుర్గ, అదేమీ లేదండి మేము ఒక బట్టలు కొట్టి పెట్టాము మమ్మల్ని ఒక మనిషి మోసం చేశారు మేము తిరిగి అతన్ని మోసం చేసాము దానికి దొరకకుండా ఉండాలని ఇలా మాట్లాడము దానికి మీరు ఏదేదో అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు పోలీసులు వెళ్తున్నప్పుడు కార్తీక్ ఆపి, సర్ ఇంకో విషయం తన పేరు దీప.తినకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి తిన ప్రాణానికి అపాయం ఉన్నది అని అనగా మోనిత ఆశ్చర్య పోతుంది. దానికి పోలీసులు, తన ప్రాణానికి అపాయం ఉంటే అది ఎవరివల్లో చెప్పండి నేను చూసుకుంటాము అని అంటారు. అప్పుడు మోనిత కంగారు పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved