50 ప్లస్ లో ఆ ఫిట్ నెస్ ఏంటి బాబోయ్.. పొట్టి బట్టల్లో కైపెక్కించేలా మలైకా ఫోజులు
బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.
బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్.
క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే.
మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ.
తాజాగా మలైకా అరోరా మినీ బ్లాక్ డ్రెస్ లో తన థండర్ థైస్ చూపిస్తూ ముంబై వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 50 ఏళ్ల ఫిట్ నెస్ చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
మలైకా ఎలాంటి డ్రెస్ ధరించినా అందులో హాట్ టచ్ ఉంటుంది. తప్పనిసారిగా కుర్రాళ్ళకి గాలం వేసే విధంగానే మలైకా థైస్ సొగసుతో ఉడికిస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూట్ లో మలైకాని ఎవ్వరు చూసినా ఆమె వయసు 30 అని భ్రమపడడం సహజం.
కానీ ఆమె వయసు 50 అని తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. థైస్ అందాలతో మలైకా దాదాపు 5 పదుల వయసులో చేస్తున్న గ్లామర్ విధ్వసం అంతా ఇంతా కాదు.
మలైకా నాజూకైన హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా తన స్ట్రక్చర్ తో కేక పెట్టిస్తోంది. కుర్ర భామలకు ఈమె అందం ఒక మిస్టరీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.