MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Divine Blockbusters: తక్కువ బడ్జెట్‌తో బాక్సాఫీసు షేక్‌.. 'హనుమాన్ అంశ్'కి ముందు వందల కోట్లు రాబట్టిన 4 చిత్రాలు

Divine Blockbusters: తక్కువ బడ్జెట్‌తో బాక్సాఫీసు షేక్‌.. 'హనుమాన్ అంశ్'కి ముందు వందల కోట్లు రాబట్టిన 4 చిత్రాలు

Divine Blockbusters: ‘హనుమాన్ అంశ్’ సినిమా తన కలెక్షన్లు, హౌస్‌ఫుల్ షోలతో వార్తల్లో నిలుస్తోంది. భక్తి, పురాణాలు, జానపద నమ్మకాల ఆధారంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు గతంలో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. అవేంటో ఓసారి చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 13 2026, 06:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న హనుమాన్‌ అంశ్‌
Image Credit : SWAMbhu Media Network

బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న హనుమాన్‌ అంశ్‌

ఈ మధ్య కాలంలో 'హనుమాన్ అంశ్' పేరు బాగా వినిపిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.205కోట్లు రాబట్టింది. ఇది విడుదలై 36 రోజులవుతున్నా ఇంకా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. భక్తి, పురాణ కథల ఆధారంగా వచ్చే సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. `హనుమాన్‌ అంశ్‌`కి ముందు ఇలాగే ఆధ్యాత్మికత, జానపద కథల నేపథ్యంతో చిన్న బడ్జెట్‌లో వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు చేసిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కాంతార (2022)
Image Credit : instagram

కాంతార (2022)

ఈ జాబితాలో మొదటి సినిమా 'కాంతార'. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం కర్ణాటక సంస్కృతి, జానపద నమ్మకాలు, మనిషి-ప్రకృతి మధ్య సంబంధాన్ని చూపించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.407 కోట్లు వసూలు చేసి ప్రాంతీయ కథల సత్తా ఏంటో నిరూపించింది.
36
కార్తికేయ 2 (2022)
Image Credit : our own

కార్తికేయ 2 (2022)

నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'కార్తికేయ 2' సినిమాను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. పురాణం, చరిత్ర, రహస్యం, సాహసం కలగలిపి ఈ సినిమాను రూపొందించారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన రహస్యాలను ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు అందించింది. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.117.87 కోట్లు వసూలు చేసింది.
46
హను-మాన్ (2024)
Image Credit : google

హను-మాన్ (2024)

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హను-మాన్' సినిమా భారతీయ పురాణ కథ, సూపర్ హీరో జానర్‌ల అద్భుతమైన కలయిక. హనుమంతుడి భక్తి, శక్తులను ఆధునిక సూపర్ హీరో కథ రూపంలో ఈ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసింది. 2024లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'హను-మాన్' ప్రపంచవ్యాప్తంగా రూ.295.29 కోట్లు వసూలు చేసింది.
56
మహావతార్ నరసింహ (2025)
Image Credit : instagram

మహావతార్ నరసింహ (2025)

'మహావతార్ నరసింహ' సినిమాను కూడా ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు జనం పోటెత్తారు. విష్ణుమూర్తి నరసింహ అవతారానికి సంబంధించిన పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రాచీన ధార్మిక కథను యానిమేషన్ రూపంలో వెండితెరపైకి తీసుకొచ్చారు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.326.82 కోట్లు వసూలు చేసింది.

66
హనుమాన్ అంశ్ (2026)
Image Credit : X

హనుమాన్ అంశ్ (2026)

2026 ఆగస్టు 7న విడుదలైన 'హనుమాన్ అంశ్' సినిమా మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైంది. కానీ, సినిమా చూసిన వారి సంఖ్య పెరిగేకొద్దీ, మౌత్ టాక్‌తో ప్రేక్షకులు పెరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకు భారీ ప్రశంసలు వస్తుండటంతో పాటు, చాలా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. నీమ్ కరోలీ బాబా జీవితం, ఆయన బోధనలు, ఆయనతో ముడిపడిన అద్భుతాల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ఇప్పటివరకు రూ.205.15 కోట్లు వసూలు చేసి ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నెల 18 నుంచి తెలుగులోనూ విడుదల కాబోతుంది. దీంతో ఇది మరింతగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఈజీగా మూడు వందల కోట్లు దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Related Stories
Recommended image1
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved