- Home
- Entertainment
- AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్ ఎలా ఉందంటే?
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్ ఎలా ఉందంటే?
AK 47 Teaser Review: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో `ఆదర్శకుటుంబం` అనే చిత్రం రూపొందుతుంది. దీన్నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మరి ఈ టీజర్ ఎలా ఉందనేది చూస్తే.

ఆదర్శ కుటుంబం మూవీతో రాబోతున్న వెంకటేష్
విక్టరీ వెంకటేష్ సక్సెస్ జోరులో ఉన్నారు. యాక్షన్ సినిమాలను పక్కన పెట్టి తనబలమైన మంచి ఫ్యామిలీ చిత్రాలతో వచ్చి విజయాలు అందుకుంటున్నారు. గతేడాది ఆయన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీలో భాగమై మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన `ఆదర్శ కుటుంబం` చిత్రంతో రాబోతున్నారు. హౌజ్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. షార్ట్ గా `ఏకే 47` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రమిది. రైటర్‌గా వెంకటేష్ సినిమాలకు పనిచేశారు త్రివిక్రమ్. కానీ డైరెక్టర్ గా పనిచేయలేదు. ఇప్పుడు మొదటిసారి ఈ మూవీ రూపొందుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్ఠాత్మక బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చింది
తాజాగా `ఆదర్శ కుటుంబం-ఏకే 47` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చింది. వెంకటేష్ మిడిల్ క్లాస్ కష్టాలను ఆవిష్కరించారు. డబ్బులు కూడా ఎలా ఖర్చుపెట్టాలో భార్యలు లెక్కలు వేస్తుంటే, కొడుకు చదువుకోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొడుకు చదువు మొద్దు అనే విషయాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత తను ఇంట్లో వంటలు చేయడం, అనంతరం ఆఫీస్‌కి వెళ్లడం, అప్పుల వాళ్లు రోడ్డుపై ధర్నా చేయడం వంటి అంశాలను చూపించారు. ఇందులో వెంకటేష్ తన మార్క్ పంచ్ డైలాగ్‌లతో అలరించారు. ఇక ఫ్యామిలీ మాత్రమే కాదు, తాను తన ఫ్యామిలీ జోలికి వస్తే, యాక్షన్ కూడా చేస్తానని చూపించారు.
ఆదర్శ కుటుంబం టీజర్ ఎలా ఉందంటే
తనకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందనే విషయం తెలుసు. కానీ అవసరమైతే, పరిస్థితులు డిమాండ్ చేస్తే యాక్షన్ తో రచ్చ చేస్తానని ప్రత్యర్థుల అంతు చూస్తూ చెప్పాడు వెంకటేష్. యాక్షన్‌తోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత `నది గట్టు దాటితే వరద అంటారు. సముద్రం దాటితే ఉప్పెన అంటారు. అదే సామాన్యుడు దాటితే ఏమంటారో ఒక బలమైన పదం చెప్పాలని అడుగుతాడు వెంకటేష్. వస్తే వాట్సాప్ చేయమని పోలీస్‌కి చెప్పడం అదిరిపోయింది. ఇక ఇందులో సాధారణ ఇంట్లో ఉండే ఆయన ఒక లాటరీతో లైఫ్ మారిపోతుంది. మంచి రిచ్ విల్లాలోకి మారిపోతాడు. దీంతో అన్నీ మారిపోతాయి. మరి అలా వచ్చింది? వెంకటేష్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా మారింది. దీనికితోడు సామాన్యుడు దాటితో ఏమంటారో అనే సస్పెన్స్ లో పెట్టాడు వెంకటేష్. ఆదర్శ కుటుంబం ఆకట్టుకునేలా సాగింది.
ఫ్యామిలీతో వెంకీ మరో హిట్ కొడతాడా?
ఇదిలా ఉంటే `ఆదర్శ కుటుంబం` టీజర్ లో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. ఇటీవల వెంకటేష్ వరుసగా ఫ్యామిలీ చిత్రాలు చేశారు. `దృశ్యం`, `సంక్రాంతికి వస్తున్నాం` వంటి చిత్రాల తరహాలోనే ఈ టీజర్ కనిపించింది. ఫ్యామిలీ అంశాలు, ఫన్నీ డైలాగులు తప్ప కొత్తగా ఏం లేదు. మరి సినిమాలో కొత్తదనం ఉంటుందేమో చూడాలి. అయితే ఇటీవల మంచి ఫ్యామిలీ కథతో వచ్చిన మూవీస్ ఆకట్టుకుంటున్నాయి. పెద్ద హిట్ అవుతున్నాయి. ఆ కోవలోనే ఈ చిత్రం నిలుస్తుందా అనేది చూడాలి. ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

