MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నమ్మి మోసపోవడం నా తప్పే.. బాలయ్య మూవీ విషయంలో స్టార్ డైరెక్టర్ అంతగా హర్ట్ అయ్యారా ?

నమ్మి మోసపోవడం నా తప్పే.. బాలయ్య మూవీ విషయంలో స్టార్ డైరెక్టర్ అంతగా హర్ట్ అయ్యారా ?

నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా హిట్ మూవీ లేక సతమతమయ్యారు. లక్ష్మి నరసింహ తర్వాత బాలయ్యకి దాదాపు ఆరేళ్ళ పాటు సరైన హిట్ లేదు. బాలయ్య మార్కెట్ దెబ్బ తింటోంది అనుకున్న తరుణంలో వచ్చిన చిత్రం సింహా. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2024, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా హిట్ మూవీ లేక సతమతమయ్యారు. లక్ష్మి నరసింహ తర్వాత బాలయ్యకి దాదాపు ఆరేళ్ళ పాటు సరైన హిట్ లేదు. బాలయ్య మార్కెట్ దెబ్బ తింటోంది అనుకున్న తరుణంలో వచ్చిన చిత్రం సింహా. సింహా చిత్రమే బాలయ్య కెరీర్ కి తిరిగి ఊపిరి పోయింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కి కొత్త జోష్ ఇచ్చింది. బాలయ్య ఎలా కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారో అంతే పవర్ ఫుల్ గా బోయపాటి ప్రజెంట్ చేశారు. బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు. 

 

37

ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి అయినప్పటికీ రచయితగా కొరటాల శివ పాత్ర ఎంతైనా ఉంది. అప్పటికి కొరటాల ఇంకా డైరెక్టర్ కాలేదు. కొరటాల శివ అందించిన కథ, మాటలు ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అయ్యాయి. కొరటాల శివ, బోయపాటి ఇద్దరూ పోసాని కృష్ణమురళి శిష్యులే. ఇప్పుడు వీళ్ళిద్దరూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. 

 

47

అయితే సింహా చిత్రం విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ అంశం గురించి సున్నితంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అది జరిగి పోయిన విషయం. ఇప్పుడు అందరం బావున్నాం. స్టోరీ, డైలాగ్స్ క్రెడిట్ విషయంలోనేనా గొడవ అని ప్రశ్నించగా..నమ్మి మోసపోవడం మనదే తప్పు. అయితే ఇప్పుడు నేను ఎవరిని రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. 

 

57

ఎక్కడో తప్పు మాత్రం జరిగింది. నేను మనస్థాపం చెందిన మాట వాస్తవం. నమ్మి మోసపోవడం చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. నాక్కూడా జరిగింది. అది ఒక ఎక్స్ పీరియన్స్. జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని కొరటాల అన్నారు. 

 

67

ఈ చిత్రానికి కొరటాల శివ అందించిన కథ, మాటలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా కొరటాల మాటలు రాశారు. బోయపాటి దర్శకత్వం కూడా ఇక్క హైలైట్. అన్ని అనుకూలంగా కుదరడం వల్ల సింహా చిత్రం సూపర్ హిట్ అయింది. 

 

77

సినిమా క్రెడిట్ విషయంలో ఇప్పటికే టాలీవుడ్ లో చాలా వివాదాలు జరిగాయి. శ్రీనువైట్ల, కోన వెంకట్ మధ్య విభేదాలు వచ్చింది కూడా క్రెడిట్స్ వల్లే. కొరటాల శివ ప్రస్తుతం దర్శకుడిగా ఎన్టీఆర్ తో దేవర చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దేవర చిత్రంతో కొరటాల పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved