MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజాపై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు.. గెటప్ శ్రీను, సుధీర్, హైపర్ ఆది లాగా నీ జీవితంలో ఒక్కసారైనా అంటూ..

రోజాపై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు.. గెటప్ శ్రీను, సుధీర్, హైపర్ ఆది లాగా నీ జీవితంలో ఒక్కసారైనా అంటూ..

ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ హీట్ పీక్స్ లో ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో అక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంది. దీనితో చాలా మంది సినీ తారలు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2024, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ హీట్ పీక్స్ లో ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో అక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంది. దీనితో చాలా మంది సినీ తారలు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ ఆర్టిస్టులు పిఠాపురంలో ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని ప్రజలని కోరుతున్నారు. 

26

ఇక వైసీపీ నుంచి నటి రోజా నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఇతర జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేస్తుండడంతో రోజా స్పందించింది. వాళ్లంతా చిన్న ప్రాణాలు. మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తుంటారు అని అర్థం వచ్చేలా రోజా కామెంట్స్ చేశారు. 

36

దీనితో కిరాక్ ఆర్పీ రోజాపై విరుచుకుపడుతూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు,. రోజా గారు మాకు మర్యాద ఇస్తే మేము కూడా ఆమెకి మర్యాద ఇస్తూ మాట్లాడతాం. మమ్మల్ని చిన్న చిన్న ప్రాణాలు, చిన్న చిన్న ఆర్టిస్టులు అని సంబోధించింది. 

46

ఈవిడ ఏమన్నా నేషనల్ ఆర్టిస్టా.. 20 ఆస్కార్లు గెలిచిందా అంటూ కిరాక్ ఆర్పీ సెటైర్లు వేశాడు. అంతటితో ఆగలేదు. సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఇతర ఆర్టిస్టులు స్వచ్చందంగా పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టంతో ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అనే చులనక భావం ఏంటి అని కిరాక్ ఆర్పీ ప్రశ్నించాడు. 

56
Kiraak RP

Kiraak RP

నీ జీవితంలో ఎప్పుడైనా గెటప్ శ్రీను లాగా యాక్టింగ్ తో మెప్పించావా ? సుధీర్ కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు హీరో అయ్యాడు. సుధీర్ కి ఉన్నంత క్రేజ్ అయినా ఉందా నీకు ? 

66

హైపర్ ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చాడు. ఒక ట్రెండ్ సెట్ చేశాడు. గంటసేపు ఏకధాటిగా కామెడీ చేస్తూ నవ్వించగలడు. హైపర్ ఆది తో నువ్వు పోటీ పడగలవా అంటూ అంటూ కిరాక్ ఆర్పీ రోజాపై విరుచుకుపడ్డాడు. రోజా గురించి మేమెప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదు. కానీ ఆమె మాత్రం చిన్న చిన్న ప్రాణాలు అంటూ చులకన చేస్తోంది అని ఆర్పీ మండిపడ్డాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
రణ్‌వీర్ సింగ్‌పై కాజల్ అగర్వాల్ కామెంట్స్.. ధురంధర్ 2 చూసిన ఆమె ఏమని పోస్ట్ చేసిందంటే?
Recommended image2
5 రోజుల్లో 800 కోట్లు.. ధురంధర్ 2 సినిమా చూసి రజినీకాంత్ ఏమన్నారంటే?
Recommended image3
Lechindi Mahila Lokam : నవ్విస్తూనే అదిరిపోయే మెసేజ్, లేచింది మహిళా లోకం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved