MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janakai Kalaganaledu: జానకి, రామచంద్ర రొమాంటిక్ సీన్.. ఇద్దరికీ గోరుముద్దలు తినిపించిన భానుమతి!

Janakai Kalaganaledu: జానకి, రామచంద్ర రొమాంటిక్ సీన్.. ఇద్దరికీ గోరుముద్దలు తినిపించిన భానుమతి!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 5 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Dec 05 2022, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ లో భానుమతి నీకు ఈ బాణమ్మ కంటే పనులు ఎక్కువ అయ్యాయా వెళ్లిపోండి ఇప్పుడే వెళ్లిపోండి అని అనగా అది కాదు బానమ్మ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్దామని బట్టలు కూడా తీసుకురాలేదు అని అంటాడు రామచంద్ర. ఇప్పుడు భానుమతి ఇప్పుడే వస్తాను ఆగండి అని లోపలికి వెళుతుంది. తర్వాత రామచంద్ర జానకికి బట్టలు తీసుకుని వచ్చి వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి అని చెబుతుంది. తర్వాత రామచంద్ర తన బట్టలు చూసుకుని మురిసిపోతూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి రావడంతో జానకిని మీరు ఈ చీరలో చాలా బాగున్నారు అని పొగుడుతూ ఉండగా జానకి కూడా తెల్ల పంచే కలర్ చొక్కాలో మెరిసిపోతున్నారు అనగా రామచంద్ర సిగ్గుపడుతూ ఉంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇందులో భానుమతి ఎక్కడికొచ్చి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు వెళ్లి రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తాను అని అనగా మీకెందుకు శ్రమ నేను చేస్తాను అంటూ జానకి వంట చేయడానికి వెళుతుంది. అప్పుడు భానుమతి ఈ కూర నువ్వు చేయలేవు ఇది పుట్టగొడుగుల కూర రామచంద్ర కు ఈ కూర అంటే చాలా ఇష్టం అని చెబుతుంది. తర్వాత భానుమతితో వంట ఎలా చేయాలో జానకి అని తెలుసుకుని వెళ్లి వంట చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి వంట చేస్తూ ఉండగా రామచంద్ర దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు జానకి రామచంద్ర ని ఆటపట్టిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర జానకి వైపు అలాగే చూస్తూ ప్రేమగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు.
 

35

ఆ తర్వాత భానుమతి జానకి,రామచంద్ర ముగ్గురు కలిసి ఆరుబయట భోజనం చేస్తూ ఉంటారు. తర్వాత భానుమతి రామచంద్ర,జానకికి ఇద్దరికీ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ తరువాత జానకి, రామచంద్ర ఇద్దరు పరుగులు తీస్తూ అలా తిరిగిరావడానికి వెళ్తారు. ఇప్పుడు రామచంద్ర ని జానకి చాకలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. జానకి గారు ఊరికే ఉండండి నాలో ఉన్న రామచంద్ర నిద్రలేస్తాడు అని అనగా అవునా ఎలా ఎక్కడ ఉన్నాడు అంటూ మరింత ఆట పట్టిస్తూ ఉంటుంది జానకి. అప్పుడు వెంటనే రామచంద్ర జానకిని ఆట పట్టిస్తూ చక్కలిగింతలు పెడుతూ ఉంటాడు.
 

45

అప్పుడు జానకి కింద పడిపోతూ ఉండగా రామచంద్ర వెళ్లి జానకిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉండండి ఇంటిదగ్గర  బయలుదేరినప్పటీ నుంచి అల్లరి అల్లరి చేస్తూ చిలిపి పనులు చేస్తూ ఎంతో సరదాగా సరదాగా గడుపుతున్నాము అని అంటాడు రామచంద్ర. మీరు కూడా ఎంతో చాలా చలాకీగా ఉన్నారు మిమ్మల్ని చూస్తే మా జానకి గారేనా అని అనిపించేలా ఉండారండోయ్ అని అంటాడు రామచంద్ర.. మీరు చెప్పింది నిజమే నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మా అమ్మానాన్న పెళ్లిరోజు అంటూ  సంతోషపడుతుంది జానకి.
 

55

మామూలుగా వాళ్ళు గుర్తుకు వస్తే నేను ఏడుస్తాను కానీ ఇవాళ ఏడ్చను నేను బాధపడ్డాను అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు కూడా బాధపడతారు అందుకే నేను ఈరోజు మొత్తం హ్యాపీగా ఉంటాను అని అంటుంది జానకి. జానకి అమ్మ నాన్న అని గట్టిగా అరుస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెబుతూ ఆనంద పడుతూ ఉండగా అది చూసి రామచంద్ర కూడా ఆనంద పడుతూ ఉంటాడు. తల్లిదండ్రి కూతుర్ని కన్నతండ్రి లాగా చూసుకునే భర్త రావాలి అని కోరుకుంటాడు. నన్ను మీలా చూసుకునే భర్తనే నాకు వచ్చారు. మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో నా భర్తతో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది అంటూ జానకి రామచంద్ర గురించి గొప్పగా చెబుతూ రామచంద్రని గట్టిగా హత్తుకుంటుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved