MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డాక్టర్ కాళ్ళమీద పడి అడుక్కుంటే ఆ మాట అన్నారు, నా భార్య ఇంకా ఏడుస్తోంది.. ముక్కు అవినాష్ భావోద్వేగం 

డాక్టర్ కాళ్ళమీద పడి అడుక్కుంటే ఆ మాట అన్నారు, నా భార్య ఇంకా ఏడుస్తోంది.. ముక్కు అవినాష్ భావోద్వేగం 

2021లో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 12 2024, 09:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు సహాయం చేయడంతో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు.    

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

2021లో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు. కానీ అవినాష్, అనూజ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. 

37

అవినాష్ సతీమణి గర్భవతి కావడం.. తన బేబీ బంప్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాం. తల్లి దండ్రులు అయ్యే క్షణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఊహించని పిడుగు లాంటి సంఘటన జరిగింది. గర్భంలోనే శిశువు మరణించింది. అది కూడా డెలివరీకి ఒక్కరోజు ముందు. 

47

ఈ సంఘటన గురించి తాజాగా ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. నేను షూటింగ్ లో ఉండగా ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి వెళితే బిడ్డ ఉమ్మ నీరు తాగి మారణించిందని డాక్టర్ తెలిపారు. బేబీకి హార్ట్ బీట్ లేదని తేల్చారు. దీనితో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో కూడా నా కంట్రోల్ లో లేదు. 

57

డాక్టర్ కాళ్లపై పడి ఎలాగైనా బిడ్డని బతికించండి అని వేడుకున్నా. హార్ట్ బీట్ లేకుంటే ఎవరైనా ఏం చేయగలం అని డాక్టర్ అన్నారు. ఆ బాధలో రోడ్లపై పిచ్చోడిలా తిరిగా. నేను నానా భార్య ఎన్నో కలలు కాన్నాం. కానీ ఫస్ట్ ప్రెగ్నన్సీ ఇలా జరగడంతో ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. నేను నా భార్య అయితే జాగ్రత్తగానే ఉన్నాం అని ముక్కు అవినాష్ తెలిపాడు. 

67

బాబు పుడితే ఏ పేరు పెట్టాలి, పాప పుడితే ఏ పేరు పెట్టాలి అని నేను నా భార్య రోజూ సంతోషంగా కలలు కనేవారం. నా భార్య అయితే బిడ్డ గురించి చాలా ఊహించుకుంది. ఆమె ఇప్పటికి రాత్రిళ్ళు ఏడుస్తూనే ఉంది అని అవినాష్ తెలిపాడు. 

77

చనిపోయిన బిడ్డని బయటకి తీసినప్పుడు చూశా. బాబు నా పోలికలతోనే ఉన్నాడు అని అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. అభిమానులు,స్నేహితుల మద్దతుతోనే కోలుకోగలిగా అని తెలిపాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Recommended image2
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?
Recommended image3
Obsession: రూ. 7 కోట్ల‌తో తీస్తే రూ. 2,240 కోట్లు వ‌చ్చాయి.. ఇంత‌కీ సినిమాలో అంత‌లా ఏముందిరాబై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved