MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ కోసం ఫస్ట్ టైం ఆ పని చేయాల్సి వచ్చింది... ఆసక్తిరేపుతున్న హీరోయిన్ కాజల్ కామెంట్స్ 

ఎన్టీఆర్ కోసం ఫస్ట్ టైం ఆ పని చేయాల్సి వచ్చింది... ఆసక్తిరేపుతున్న హీరోయిన్ కాజల్ కామెంట్స్ 

కాజల్ అగర్వాల్ చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె ఎన్టీఆర్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన కోసమే అందుకు ఒప్పుకున్నానని కాజల్ ఓపెన్ అయ్యింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : May 09 2024, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ ఇండస్ట్రీని తిరుగులేకుండా ఏలిన హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. సుదీర్ఘ కాలం ఆమె హవా సాగింది.  దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్నారు. టాలీవుడ్ - కోలీవుడ్ లో టాప్ స్టార్స్ సరసన నటించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో కూడా జతకట్టిన రికార్డు ఆమె సొంతం. దర్శకుడు రాజమౌళి మగధీర చిత్రంలో ఆఫర్ ఇచ్చి ఆమె కెరీర్ ని మలుపు తిప్పాడు. మగధీర తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వరుస విజయాలతో అశేష అభిమానులను సొంతం చేసుకుంది. 

37
Kajal Aggarwal

Kajal Aggarwal

చాలా కాలం అనంతరం కాజల్ అగర్వాల్ ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ప్రముఖ కమెడియన్ ఆలీ హోస్ట్ గా ఉన్న ఆలీతో సరదాగా సీజన్ 2 కి ఆమె విచ్చేశారు. ఆమె లేటెస్ట్ మూవీ సత్యభామ సంగతులతో పాటు వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు అభిమానులతో పంచుకున్నారు. 

 

47
Kajal Aggarwal

Kajal Aggarwal

తెలుగులో కాజల్ మొదటి చిత్రం లక్ష్మీ కళ్యాణం కాగా, దర్శకుడు తేజ ఎలా ఎంపిక చేశాడని ఆలీ అడిగారు. ఫోటోలు చూసి తేజ ఆడిషన్ కి పిలిచారు. లైఫ్ లో అది నా ఫస్ట్ ఆడిషన్. నన్ను ఏడ్చి చూపించమన్నారు. నాకు అసలు జీవితంలో ఏడ్చిన సందర్భం లేదు. అప్పుడు నాన్న ఓ విషయం చెప్పి నన్ను ఏడ్చేలా చేశాడు. అలా ఎంపికయ్యానని... కాజల్ అన్నారు. 
 

57
Kajal Aggarwal

Kajal Aggarwal

మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? అని అడగ్గా... గౌతమ్ కిచ్లు(కాజల్ భర్త) నాకు పదేళ్లుగా తెలుసు. లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పుడే మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని, కాజల్ అన్నారు. 
 

67
Kajal Aggarwal

Kajal Aggarwal


కాగా కాజల్ కెరీర్లో ఒకే ఒక చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఈ ప్రస్తావన తెచ్చిన ఆలీ... జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఎవరు? హీరో, దర్శకుడు లేదా నిర్మాతనా? అని అడిగాడు. కేవలం ఎన్టీఆర్ వలనే ఐటెం సాంగ్ కి ఒప్పుకున్నానని కాజల్ చెప్పడం విశేషం. 
 

77
Kajal Aggarwal

Kajal Aggarwal


ఎన్టీఆర్ తో కాజల్ మూడు సినిమాల్లో నటించింది. బృందావనం, బాద్ షా,  టెంపర్ చిత్రాల్లో జతకట్టారు. ఈ మూడు చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఐటెం సాంగ్ చేశానని కాజల్ చెప్పకనే చెప్పింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved